అన్వేషించండి

TS News Developments Today: మంత్రి ఇలాకాలో ఎంత డబ్బు దొరికింది? ఇంకా నిరంతరం సాగుతున్న సోదాలు

ఓ వైపు రాష్ట్రంలో చలి వణికిస్తుంటే మరోవైపు దర్యాప్తు సంస్థలు రాష్ట్రంలో వాతావరణాన్ని వేడిక్కెస్తున్నాయి. సిట్ దర్యాప్తులో లుక్ నోటీసుల సంఖ్య పెరుగుతోంది. నేడు హైకోర్టులో విచారణ ఉంది.

ఎమ్యెల్యే ల కొనుగోళ్ల విషయంలో అసలు ఏం జరుగుతోంది?

ఎమ్మెల్యే కొనుగోళ్లు కేసులో ఊహించని ట్విస్ట్​లు చోటుచేసుకుంటున్నాయి. ఎటువైపు నుంచి ఎటు వెళుతుందో అర్థం కావడం లేదు. తాజాగా ఇద్దరు నిందితులు నోటీసులకు స్పందించకపోవడంతో సిట్‌ తదుపరి కార్యాచరణకు సిద్ధమైంది. ఇప్పటికే ఎమ్మెల్యేలకు ఎర కేసులో తుషార్‌పైనా లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేసింది.  ఎమ్మెల్యేల ఎర కేసులో విచారణకు ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. విచారణకు హాజరు కావాలని అభియోగాలు ఎదుర్కొంటున్న బిఎల్ సంతోష్ తో పాటు మిగిలిన ముగ్గురు సిట్ హాజరు కావాలని కోర్టు సూచించింది. మరోవైపు సుప్రింకోర్టు ఉత్తర్వులు పరిశీలించాకే సిట్ పిటీషన్లపై ఈ రోజు విచారణ చేపడతామని హైకోర్టు న్యాయమూర్తి చెప్పారు. ఇప్పటికే సిట్ దర్యాప్తు నిలిపివేయాలంటూ నిందితుల తరపున అడ్వకేట్ పీటిషన్ దాఖలు చేశారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి బి.ఎల్. సంతోష్ విచారణ కు వస్తారా? రారా? అనేది ఇంకా క్లారిటీలేదు. 

మంత్రి మల్లారెడ్డి నివాసంలో ఈ రోజు కూడా కొనసాగనున్న ఐటీ సోదాలు

మంత్రి చామకూర మల్లారెడ్డి నివాసంతో పాటు ఆయన చెందిన బంధువులు, స్నేహితులతో ఆయకు ఉన్న అన్నీ వ్యాపారాలపై ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి.

నేడు కామారెడ్డి జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటన

నేడు కామారెడ్డి జిల్లా నాగిరెడ్డి పేటలో ఎమ్మెల్సీ కవిత పర్యటన. టీఆరెస్ కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొననున్న కవిత. పార్టీ మరింత బలోపేతం.. కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్న కవిత.

ఉదయమే రాజన్న సిరిసిల్ల జిల్లాలో కారు బీభత్సం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో కారు బీభత్సం సృష్టించింది. వేములవాడ తిప్పాపూర్ ‌వంతెనవద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కనున్న మొబైల్‌ టిఫిన్ సెంటర్లోకి క్రెటా కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలం చేరుకున్నారు. స్థానికుల సాయంతో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్ పరారయ్యాడు. కారు యజమాని ప్రముఖ టీఆర్ఎస్ నేతగా అనుమానిస్తున్నారు. డ్రైవర్ తాగిన మత్తులో ఉండటంతో ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

కొనసాగుతున్న షర్మిల పాదయాత్ర

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న వైస్సార్ టీపీ అధినేత్రి షర్మిల పాదయాత్ర.. రాష్ట్ర ప్రభుత్వం తీరు పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తు సాగుతున్న యాత్ర.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి నేటి వరకు కేసీఆర్ ప్రభుత్వం పై లో ప్రజలు ఇబ్బందులను వివరిస్తూ షర్మిల పాదయాత్ర కొనసాగుతుంది.

608 చేరిన తెలంగాణలో మండలాల సంఖ్య.. కొత్తగా మరో మండలం

రాష్ట్రంలో కొత్తగా మరో మండలం ఏర్పాటైంది. నిజామాబాద్ జిల్లా బోధన్ రెవెన్యూ డివిజన్​లో 14 గ్రామాలతో పొతంగల్​ను మండలంగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం  ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కోటగిరి మండలంలో ఉన్న పొతంగల్, కొడిచెర్ల, జల్లపల్లె, సుంకిని, కల్లూర్, హంగర్గ, హెగ్డోలి, కొల్లూర్, దోమలెడ్గి, సోంపూర్, టక్లి, కారేగావ్, హమ్నాపూర్, తిరుమలాపూర్ గ్రామాలతో పొతంగల్ మండలాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇదే జిల్లాలో సెప్టెంబర్​లో సాలూర, ఆలూరు, డొంకేశ్వర్ మండలాలను కొత్తగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పొతంగల్​తో కలిపితే రాష్ట్రంలోని రెవెన్యూ మండలాల సంఖ్య 608కి చేరింది. కొత్త మండలం ఏర్పాటు తో ఈరోజు పోతాంగల్ లో ప్రజలు నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు.

వాతావరణం అలర్ట్

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ, రేపు వర్ష సూచన ఉంది. తెలంగాణలో తూర్పు, ఈశాన్య భారత్ నుంచి చల్లని గాలులు వీస్తున్నాయి. వాటి వల్ల వాతావరణం అతి చల్లగా మారి ఇవాళ, రేపు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget