TS News Developments Today: గాంధీభవన్‌లో నేడు ఏం జరగబోతుంది? దూరంగా ఉండాలని సీనియర్లు నిర్ణయం!
ఏఐసీసీ చేపట్టే కార్యక్రమాల అమలు కార్యక్రమాలపై నేడు సమావేశంలో చర్చించనున్నారు. సీనియర్ల అసంతృప్తి నేపథ్యంలో భేటీపై ఉత్కంఠ నెలకొంది.
నేడు గాంధీ భవన్ లో పీసీసీ కార్యవర్గ సమావేశం
నేడు గాంధీభవన్‌లో పీసీసీ కార్యవర్గ సమావేశం కానుంది. సమావేశానికి టీపీసీసీ కొత్త కమిటీ సభ్యులు హాజరుకానున్నారు. ఏఐసీసీ చేపట్టే కార్యక్రమాల అమలు కార్యక్రమాలపై చర్చించనున్నారు. సీనియర్ల అసంతృప్తి నేపథ్యంలో భేటీపై ఉత్కంఠ నెలకొంది. అయితే నేడు జరిగే పీసీసీ కార్యవర్గ సమావేశాన్ని బహిష్కరించాలని సీనియర్‌లు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి నిర్వహించే కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సీనియర్ నేతలు నిర్ణయం తీసుకున్నాట్లు సమాచారం. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో నేడు జరిగే పీసీసీ కార్యవర్గ సమావేశం ఎలా జరుగుతుందో నని గాంధీభవన్ వర్గాలు ఎదురుచూస్తున్నాయి.
నేడు జరుగనున్న ఎంబీబీఎస్ యాజమాన్య కోటా stray వేకెన్సీ కౌన్సిలింగ్ వాయిదా
మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ అల్ ఇండియా కోటా stray వేకెన్సీ కౌన్సిలింగ్ ను వాయిదా వేసిన నేపథ్యంలో కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఇప్పటికే జారీ చేసిన stray వేకెన్సీ కౌన్సిలింగ్ ప్రకటన ను ఉపసంహరించుకుంది. త్వరలో కౌన్సెలింగ్ కు సంబంధించి మరో ప్రకటన జారీ చేస్తామని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది.
నేడు కామన్ లా అడ్మిషన్ టెస్ట్.
జాతీయ స్థాయి న్యాయ విద్య ప్రవేశ పరీక్ష అయిన కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (CLAT) నేడు జరుగునుంది. ఐదేండ్ల లా యూడీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష ప్రారంభం కానుంది. సాయంత్రం 4 గంటల వరకు ఈ పరీక్ష కొనసాగుతుంది. దేశంలో 23 రాష్ట్రాల్లో 127 పరీక్ష కేంద్రాల్లో క్లాట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ ప్రవేశ పరీక్షతో దేశవ్యాప్తంగా ఉన్న 22 నేషనల్ లా యూనివర్సిటీలు, 77 అనుబంధ కాలేజీల్లోని లా కోర్సుల్లో సీట్లు పొందవచ్చు. కన్సార్షియమ్ ఆఫ్ నేషనల్ లా యూనివర్సిటీస్ (NLUs) ఏటా ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నది.
నేడు, రేపు నోబెల్ ప్రైజ్ అవార్డు గ్రహిత కైలాష్ సత్యర్థి హన్మకొండ జిల్లా పర్యటన.
పర్యటన సందర్భంగా అధికారులు సమన్వయము తో పని చేసి విజయవంతం చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్బంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ..నేడు, రేపు పర్యటనలో భాగంగా నేడు ఆదాలత్ కోర్ట్ సందర్శన రేపు హన్మకొండ లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో భారీ బహిరంగ సభ 50 వేల మంది పాఠశాల విద్యార్థులు హాజరు అవుతారు అని అన్నారు.హన్మకొండ వరంగల్ జిల్లాలా నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 8,9,10 తరగతుల విద్యార్థులు హాజరయ్యే విధంగా చూడాలి అని అన్నారు. గ్రౌండ్ లో అనుగుణంగా వేదిక, బ్యారీకేడ్లు, బయటికి, లోపలికి వెళ్ళేదారిని ఇబ్బందులు లేకుండా బాగు చేయించాలని అధికారులకు సూచించారు. బందోబస్తు ఏర్పాట్లను చూడాలని పోలీస్ శాఖ కి సూచించినారు.మైదానం అంత శుభ్రంగా ఉండేలా చూడాలని, వాటరింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. . దీంతో పాటు ఆరోజున విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని ట్రాన్స్కో అధికారులకు తెలిపారు. కార్యక్రమానికి హాజరయ్యే అతిధితో పాటు అందరికీ వినిపించేలా మైక్, సౌండ్ బాక్సులను ఏర్పాటు చేయాలని అధికారులకు వివరించారు. అన్ని శాఖల అధికారులు తమకు అప్పగించిన పనులను పూర్తి చేసేలా, వేడుకలు విజయవంతం చేయాలని తెలిపారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలి అని అన్నారు. అవసరం అయిన LEDస్క్రీన్ లను ఏర్పాటు చేయాలి అని అన్నారు.ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులచే దేశభక్తిని పెంపొందించే సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించాలని అధికారులకు సూచించారు.
కొల్లాపూర్‌కు హార్టికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీ మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
నాగర్ కర్నూలు జిల్లాలోని కొల్హాపూర్ మండలానికి హార్టికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీ మంజూరైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొల్హాపూర్‌కు ఉద్యానవనపాలిటెక్నిక్ కళాశాల మంజూరు కావడంపై ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి ప్రభుత్వానికి , సీఎం కేసీఆర్‌కు, మంత్రుల కేటీఆర్, నిరంజన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.