అన్వేషించండి

Telangana Municipal Elections: మున్సిపల్ ప్రచారానికి కాంగ్రెస్, బీజేపీ తరపున అగ్రనేతలు - బీఆర్ఎస్ లైట్-ఎందుకలా?

Municipal campaign:తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ఒక్క వారమే గడువు. అందుకే ీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతల్ని బరిలోకి దింపాయి. కానీ బీఆర్ఎస్ మాత్రం లైట్ తీసుకుంటోంది.

Municipal campaign  BRS Lite: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు కనిపిస్తున్నాయి. అధికార కాంగ్రెస్, దూకుడు మీదున్న బీజేపీ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని అగ్రనేతలను రంగంలోకి దించగా, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మాత్రం స్థానిక నేతలకే బాధ్యత వదిలేసిందంి.   తెలంగాణలోని 123 మున్సిపల్ , 7 కార్పొరేషన్లకు  జరుగుతున్న ఈ ఎన్నికలను అధికార కాంగ్రెస్ పార్టీ తన పాలనకు ఒక రెఫరెండంగా భావిస్తోంది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల్లో పర్యటిస్తూ ప్రచారాన్ని హోరెత్తించాలని నిర్ణయించారు. పట్టణ ఓటర్లను ఆకట్టుకునేందుకు వరాల జల్లు కురిపిస్తూ, మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా తన పట్టును నిరూపించుకోవాలని చూస్తున్నారు. కేడర్‌లో ఉత్సాహం నింపేలా ప్రతి  మున్సిపాలిటీకి మంత్రులను ఇన్-ఛార్జులుగా నియమించి క్షేత్రస్థాయిలో  పరిస్థితిని పర్యేవేక్షిస్తున్నారు. 

ప్రచారానికి వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు 

 బీజేపీ సైతం ఏమాత్రం తగ్గడం లేదు. జాతీయ అధ్యక్షుడు స్వయంగా ప్రచారానికి వస్తుండటమే కాకుండా, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ వంటి వారు గల్లీ గల్లీ తిరుగుతున్నారు. వీటికి అదనంగా, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రెండు రోజుల పాటు తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేయనుండటం ఆ పార్టీకి పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది. జనసేన మద్దతుతో సెటిలర్ల ఓట్లను, యువత ఓట్లను గంపగుత్తగా కొల్లగొట్టాలన్నది బీజేపీ వ్యూహం. ఇంతటి భారీ యంత్రాంగాన్ని దింపడం ద్వారా రాష్ట్రంలో తామే ప్రత్యామ్నాయం అనే సంకేతాన్ని ఆ పార్టీ పంపిస్తోంది.

జాతీయ పార్టీల హడావుడిని పట్టించుకోని బీఆర్ఎస్ 

ఈ హడావుడి మధ్య బీఆర్ఎస్ తీరు రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. గతంలో ప్రతి చిన్న ఎన్నికనూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకునే అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు ఈసారి ప్రచారానికి దూరంగా  ఉంటున్నారు.  కేవలం ప్రెస్ మీట్లకే పరిమితమవుతూ, క్షేత్రస్థాయి ప్రచార బాధ్యతలను స్థానిక ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్-ఛార్జులకే వదిలేశారు. అభ్యర్థుల ఎంపిక కూడా వారికే ఇచ్చారు.  దీనివల్ల పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన స్తబ్దత నెలకొంది.  

ఫలితాలు తేడా వస్తే బాధ్యత తీసుకోకుండానేనా? 

బీఆర్ఎస్ ఈ ఎన్నికలను లైట్ తీసుకోవడం వెనుక లోతైన రాజకీయ కారణాలు ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఎన్నికల్లో ఫలితాలు తారుమారైతే, ఆ ఓటమి బాధ్యతను తమపై వేసుకోకుండా తప్పించుకోవడానికే అగ్రనేతలు దూరంగా ఉంటున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించడం ద్వారా.. ఫలితాలు బాగుంటే పార్టీ పుంజుకుందన్న ప్రచారం, తేడా వస్తే  స్థానిక నేతల  వైఫల్యంగా చూపించే వీలుంటుందని పార్టీ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. అయితే, ఇది కార్యకర్తలను నిరుత్సాహానికి గురిచేస్తోంది. కాంగ్రెస్ తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి, బీజేపీ తన బలాన్ని నిరూపించుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతుంటే.. బీఆర్ఎస్ మాత్రం డిఫెన్సివ్ మోడ్‌లో కనిపిస్తోంది.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. కవితకు మళ్లీ నోటీసులు!
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. కవితకు మళ్లీ నోటీసులు!
Khammam Crime News: భర్త పేరిట ఇన్సురెన్స్.. బంధువుల సాయంతో హత్య చేయించిన భార్య.. ఖమ్మంలో దారుణం
భర్త పేరిట ఇన్సురెన్స్.. బంధువుల సాయంతో హత్య చేయించిన భార్య.. ఖమ్మంలో దారుణం
Telangana Economic situation :తెలంగాణ బడ్జెట్ 2026 - అప్పుల సుడిగుండంలో ఆరు గ్యారంటీల పయనం - రేవంత్, భట్టి జోడి మ్యాజిక్ చేస్తారా?
తెలంగాణ బడ్జెట్ 2026 - అప్పుల సుడిగుండంలో ఆరు గ్యారంటీల పయనం - రేవంత్, భట్టి జోడి మ్యాజిక్ చేస్తారా?
CM Revanth Reddy: మహిళల్ని రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు చేసి గౌరవించిన పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
మహిళల్ని రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు చేసి గౌరవించిన పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Budget Session 2026: ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
Pawan Kalyan CM: ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
Stock Market 9 March: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలతో భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
Trisha Krishnan : త్రిషపై కామెంట్స్... హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్ - సారీ చెప్పిన డైరెక్టర్ పార్తిబన్
త్రిషపై కామెంట్స్... హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్ - సారీ చెప్పిన డైరెక్టర్ పార్తిబన్
Tamil Nadu Assembly Elections 2026: తమిళనాట మరోసారి గెలిచేందుకు స్టాలిన్ చాణక్య వ్యూహాలు - విజయ్ ఉచితాల వల వర్కవుట్ అవుతుందా?
తమిళనాట మరోసారి గెలిచేందుకు స్టాలిన్ చాణక్య వ్యూహాలు - విజయ్ ఉచితాల వల వర్కవుట్ అవుతుందా?
Kovvur Jeelugumilli Highway: కొవ్వూరు -జీలుగుమిల్లి మధ్య 368 కోట్లతో కొత్త హైవే.. పోలవరం మీదుగా 2 లేన్లతో అనుమతి
కొవ్వూరు -జీలుగుమిల్లి మధ్య 368 కోట్లతో కొత్త హైవే.. పోలవరం మీదుగా 2 లేన్లతో అనుమతి
T20 World Cup Winner: అహ్మదాబాద్‌లో భారత్ సరికొత్త చరిత్ర.. టీ20 వరల్డ్ కప్ సాధించే క్రమంలో రికార్డులు బద్ధలు
అహ్మదాబాద్‌లో భారత్ సరికొత్త చరిత్ర.. టీ20 వరల్డ్ కప్ సాధించే క్రమంలో రికార్డులు బద్ధలు
Trisha Krishnan : అది వారి సంస్కారం - మైక్ ఉంటే ఏదైనా మాట్లాడేస్తారా?... త్రిష స్ట్రాంగ్ కౌంటర్
అది వారి సంస్కారం - మైక్ ఉంటే ఏదైనా మాట్లాడేస్తారా?... త్రిష స్ట్రాంగ్ కౌంటర్
Embed widget