అన్వేషించండి

BRS MLA Defection Case: ఎమ్మెల్యే సంజయ్‌పై అనర్హత పిటిషన్ కొట్టివేత, ఫిరాయింపు కేసులో కీలక పరిణామం

BRS MLA Sanjay Kumar | జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై నమోదైన అనర్హత పిటిషన్ ను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టివేశారు. ఎమ్మెల్యే సంజయ్ బీఆర్ఎస్ లో ఉన్నారని పేర్కొన్నారు.

Telangana Politics | హైదరాబాద్: ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే సంజయ్‌పై బిఆర్ఎస్ (BRS) దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌ను స్పీకర్ కొట్టివేస్తూ, ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చారు. సంజయ్ కుమార్ పార్టీ మారారు అనేందుకు తగిన ఆధారాలు లేవని, ఆయన సాంకేతికంగా బిఆర్ఎస్ సభ్యుడిగానే కొనసాగుతున్నారని స్పీకర్ తన తీర్పులో పేర్కొన్నారు.

స్పీకర్ తీర్పుపై బీఆర్ఎస్ ఆగ్రహం..

బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి వేసిన అనర్హతా పిటిషన్‌ను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టివేస్తూ ఎమ్మెల్యే సంజయ్ కు క్లీన్ చిట్ ఇవ్వడాన్ని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలని స్పీకర్ కు, తెలంగాణ ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో విచారణ పూర్తి చేసిన స్పీకర్, సుప్రీంకోర్టు గడువు లోపే తన నిర్ణయాన్ని వెలువరించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశానని, తాను పార్టీ జెండా కప్పుకోలేదని ఎమ్మెల్యే చేసిన వాదనను స్పీకర్ పరిగణనలోకి తీసుకున్నారు.

ఈ కేసుతో పాటు మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై బిఆర్ఎస్ అనర్హత వేటు వేయాలని కోరగా, ఇప్పటివరకు సంజయ్ కుమార్‌తో కలిపి మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చినట్లయింది. గతంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్య లకు సైతం స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. స్పీకర్ నిర్ణయాలపై బిఆర్ఎస్ వర్గాలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని, దీనిపై ఉన్నత న్యాయస్థానాల్లో పోరాటం చేస్తామని ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు.

బీఆర్ఎస్ నుంచే గెలిచా.. ఆ పార్టీలోనే కొనసాగుతా: ఎమ్మెల్యే సంజయ్

తన వేతనం నుంచి ప్రతినెలా రూ.5 వేలు బీఆర్ఎస్ కోసం వెళ్తాయని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లులకు విప్ జారీ చేస్తే తాను మద్దతు ఇస్తానని చెప్పారు. తాను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచానని, ఆ పార్టీ ఎమ్మెల్యేగానే కొనసాగుతా అన్నారు.

మొత్తం 8 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్

ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీ, బండ్ల కృష్ణ మోహన్, గూడెం మహిపాల్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్యలకు తెలంగాణ స్పీకర్ ఇదివరకే క్లీన్ చిట్ ఇచ్చారు. తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సైతం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే అని, పార్టీ మారారని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని ప్రకటించారు. మరో ఎమ్మెల్యే కడియం శ్రీహరికి స్పీకర్ నోటీసులు జారీ చేయగా, బుధవారం ఉదయం స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై విచారణకు హాజరయ్యారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
KBR Park Elevated Corridors: కేబీఆర్‌ పార్కు ఎలివేటెడ్‌ కారిడార్‌ ప్రాజెక్ట్.. బాలకృష్ణ సహా ప్రముఖుల స్థలాలు సేకరణ
కేబీఆర్‌ పార్కు ఎలివేటెడ్‌ కారిడార్‌ ప్రాజెక్ట్.. బాలకృష్ణ సహా ప్రముఖుల స్థలాలు సేకరణ
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Hyderabad PRT: హైదరాబాద్‌లో 'పీఆర్‌టీ' రవాణా వ్యవస్థ.. మూడు కారిడార్లకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్‌సిగ్నల్!
హైదరాబాద్‌లో 'పీఆర్‌టీ' రవాణా వ్యవస్థ.. మూడు కారిడార్లకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్‌సిగ్నల్!

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Drishyam 3 OTT : అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
October Smartphones Launch: అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
మీ కారు RCని వేరే రాష్ట్రానికి ట్రాన్స్‌ఫర్ చేయాలా? ఆన్‌లైన్‌లోనే పని పూర్తి.. కావాల్సిన పత్రాలు, ఫీజుల వివరాలివే!
వెహికల్‌ RCని ట్రాన్స్‌ఫర్‌ చేయడం ఎలా? పూర్తి ప్రాసెస్‌, ఫీజుల వివరాలు
Embed widget