By: ABP Desam | Updated at : 10 May 2023 03:14 PM (IST)
ఏపీ, తెలంగాణ టాప్ హెడ్ లైన్స్
టీడీపీ ఎమ్మెల్యే భర్త, మామలకు బెయిల్ - చిట్ పండ్ కేసులో హైకోర్టు ఉత్తర్వులు !
జగజ్జనని చిట్ ఫండ్ కేసులో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు,. ఆయన తనయుడు వాసులకు ఏపీ హైకోర్టు బుధవారంనాడు బెయిల్ మంజూరు చేసింది. జగజ్జనని చిట్ ఫండ్ కేసులో వీరిద్దరిని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. జగజ్జనని చిట్ ఫండ్ కేసులో ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీన ఆదిరెడ్డి అప్పారావు, ఆయన తనయుడు వాసులను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఆదిరెడ్డి అప్పారావు, ఆయన కొడుకు వాసులు బెయిల్ కోసం ఈ నెల 3వ తేదీన ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇరువర్గాల వాదనలు విన్నది. బుధవారం ఏపీ హైకోర్టు తీర్పును వెల్లడించింది. ఇంకా చదవండి
బహిరంగ సభలో తిట్టుకున్న ఎమ్మెల్యేలు- భద్రాద్రి కొత్తగూడెంలో వివాదం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఏకంగా ఎమ్మెల్యేలు ఇద్దరు బహిరంగంగా తిట్టుకోవడం సంచలనంగా మారింది. పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య మధ్య ఘర్షణపూరిత వాతావరణం నెలకొంది.
దమ్ముగూడెంలోని లక్ష్మీనగరంలో ఎమ్మెల్యేల మధ్య చెలరేగిన వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రేగా కాంతారావు, భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య మధ్య మంత్రి సమక్షంలోనే మాటల తూటాలు పేలాయి. తునికి ఆకుల సేకరణ చెక్కుల పంపిణీ సందర్భంగా కార్యక్రమం ఏర్పాటు చేశారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కార్యక్రమానికి హాజరయ్యారు. ఇంకా చదవండి
కర్ణాటక ఎన్నికలపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆసక్తికర ట్వీట్- సమాజ ప్రగతికి ఓటు వేయాలని సూచన
కర్ణాటక ఎన్నికల వైపు దేశమంతా చూస్తోంది. ఇప్పటికే అక్కడ ప్రభుత్వాని ఏర్పాటు చేసి పాలిస్తున్న బీజేపీ గెలుస్తుందా... లేకుంటే ప్రజలు మార్పు కోరుకుంటారా అనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది. ఇవాళ జరుగుతున్న పోలింగ్‌లో ప్రజలు తమ అభిప్రాయాన్ని ఈవీఎంలలో ఉంచుతున్నారు. కర్ణాటకలో పోలింగ్ జరుగుతున్న వేళ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. డియర్ కర్ణాటక విద్వేషాన్ని తిరస్కరించు అంటూ పిలుపునిస్తూనే.. ప్రజలతోపాటు సమాజాభివృద్ధి, శ్రేయస్సు, సంక్షేమానికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
చిట్ ఫండ్ చట్టం ఈ కేసుకు వర్తించదని అప్పారావు తరపు న్యాయవాదులు వాదించారు. డిపాజిట్ దారుల పిర్యాదు లేకుండానే కేసు నమోదు చేశారని వారు గుర్తు చేశారు అయితే ఈ వాదనను సీఐడీ తరపు న్యాయవాదులు తోసిపుచ్చారు. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత అప్పారావుకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆదిరెడ్డి వాసు భార్య, టిడిపి ఎంపి కింజరపు రామ్మోహన్ నాయుడు సోదరి భవానీ రాజమండ్రి ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో రాజకీయ కక్షతోనే ఆదిరెడ్డి అప్పారావు, వాసులను అరెస్ట్ చేశారని టీడీపీ ఆరోపించింది. గత వారంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఇంకా చదవండి
త్వరలో రాజకీయ నిర్ణయం తీసుకుంటానని ముద్రగడ లేఖ
కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. త్వరలోనే తన రాజకీయ నిర్ణయం ప్రకటిస్తానని ముద్రగడ పద్మనాభం తాజాగా ఓ లేఖ విడుదల చేశారు. కాపు సామాజికవర్గ ప్రజలకు ఉద్దేశించి రాసిన లేఖలో తుని రైల్వే కేసు కొట్టివేసినందున సత్యం జయించిందని సంతోషం వ్యక్తం చేశారు. తన జాతి రిజర్వేషన్ జోకర్ కార్డులా మారినందుకు బాధపడుతున్నానని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. 2016 వ సంవత్సరం ఫిబ్రవరి 2 వ తేదీన తనను తీహార్ జైలుకు తీసుకెళ్లేందుకు హెలికాప్టర్ రెడీగా పెట్టారని.. బెయిల్ తెచ్చుకోండి, లేదా అండర్ గ్రౌండ్ కి వెళ్ళమని సలహాలు ఇచ్చారన్నారు. ఇంకా చదవండి
కోటంరెడ్డికి మిగిలేది రాజకీయ సమాధే, అనిల్ ఘాటు వ్యాఖ్యలు
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. నాలుగేళ్లు నిద్రపోయి ఇప్పుడు అభివృద్ధి లేదు, పనులు కాలేదంటూ మాట్లాడటం సరికాదన్నారాయన. నియోజకవర్గంలో అన్ని సమస్యలు పరిష్కరించడం ఎవరికీ సాధ్యం కాదని, జగన్ ని 10 అడిగితే ఏడో ఎనిమిదో పనులు జరుగుతాయని, అంత మాత్రాన అసలు ఏ పనీ చేయలేదనడం భావ్యం కాదన్నారు. జగన్ పుణ్యంతో లక్షణంగా ఉన్నామని, ఇంకా ఆయన్ను ఆడిపోసుకోవడం ఎందుకని ప్రశ్నించారు. ఓటమి అనేది తలపై రాసి ఉంది కాబట్టే.. వారు పక్క పార్టీలకు వెళ్తున్నారని, వైసీపీలో ఉంటే గెలిచేవారని.. ఇప్పుడు వారికి రాజకీయ సమాధే మిగిలుందని విమర్శించారు.
కోటంరెడ్డి వైసీపీకి దూరం జరిగే క్రమంలో అనిల్ తో ఆయనకు మాటల యుద్ధం జరిగింది. అనిల్ మంత్రి అయిన సమయంలో ఎవరూ ఆయనకు సపోర్ట్ చేయలేదని, నెల్లూరులో ఆయనకు స్వాగత సత్కారాలు చేసింది తానే అనే విషయం గుర్తు చేశారు కోటంరెడ్డి. తమ్ముడూ అంటూనే ఆయనకు చురకలంటించారు. అనిల్ కూడా కోటంరెడ్డిపై సెటైర్లు పేల్చారు. ఆ తర్వాత వ్యవహారం సద్దుమణిగింది. ఒకరి నియోజకవర్గంలో ఇంకొకరు జోక్యం చేసుకోవడంలేదు. ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు. మళ్లీ ఇటీవల కాలంలో నెల్లూరు బాహాషహీద్ దర్గాకు నిధులు మంజూరైన తర్వా కోటంరెడ్డి లైమ్ లైట్లోకి వచ్చారు. నెల్లూరులో ఫ్లెక్సీలు వేయిస్తూ హడావిడి చేస్తున్నారు. దీనిపై మాజీ మంత్రి అనిల్ కౌంటర్ ఇచ్చారు. నాలుగేళ్లు నిద్రపోయి ఇప్పుడే లేచారంటూ పరోక్షంగా కోటంరెడ్డిపై సెటైర్లు వేశారు. ఇంకా చదవండి
Breaking News Live Telugu Updates: ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం- సీపీఎస్‌పై కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్
Top 10 Headlines Today: నేటి నుంచి ఆసీస్, ఇండియా మధ్య గదా యుద్ధం, ఇది సినిమా కాదు ఎమోషన్ అంటున్న ప్రభాస్
Top 10 Headlines Today: నేడు ఏపీ మంత్రి మండలి సమావేశం, ఐసీసీ ట్రోఫీ అందుకోవాలని ఇండియా, ఆసీస్ మధ్య ఫైట్
KCR Plan For Elections : పథకాల వరద పారించి ఎన్నికలకు కేసీఆర్ - మాస్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా !?
Weather Latest Update: నేడు ఏపీలో ఈ మండలాల్లో తీవ్ర వడగాల్పులు, తెలంగాణలో వేడి కాస్త తక్కువే - ఐఎండీ
Modi Telangana Tour: మరోసారి తెలంగాణకు మోదీ, ఈసారి రోడ్ షోకి కూడా ప్లాన్!
Odisha Train Accident: ఒడిశాలోని ఓ మార్చురీలో హర్రర్ సినిమాను తలపించే సీన్- రక్తంలా కనిపిస్తున్న నీళ్లు!
మనం అనుకుంటున్నట్టు ప్రభాస్ అలాంటి వాడు కాదు: కృతి సనన్
YS Viveka Case : అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ రద్దు చేయండి - సుప్రీంకోర్టులో సునీత పిటిషన్