అన్వేషించండి

Top 10 Headlines: తెలంగాణ ఓటర్లకు ఏపీ సీఈవో గుడ్ న్యూస్ - బుల్లెట్ రైలు వచ్చేస్తోంది, ఢిల్లీలో మళ్లీ లొల్లి

Top Headlines Today: తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ, అంతర్జాతీయ, క్రీడలు, వినోదాలకు సంబంధించిన నేటి టాప్ 10 ముఖ్య వార్తలు మీకోసం.

Top 10 Headlines on 25th November:

తెలంగాణ వార్ - ప్రచారంలో అగ్ర నేతలు

తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ ఆయా పార్టీల అగ్రనేతలు రంగంలోకి దిగుతున్నారు. సీఎం కేసీఆర్ ఖానాపూర్, జగిత్యాల, వేములవాడ, దుబ్బాకలో ప్రజా ఆశీర్వాద సభల్లో శనివారం పాల్గొననున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీ సైతం ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రియాంక గాంధీ పాలేరు, ఖమ్మంలో నేడు రోడ్ షో నిర్వహించనున్నారు. అనంతర సత్తుపల్లి, మధిర బహిరంగ సభల్లో పాల్గొంటారు. మరోవైపు, రాహుల్ గాంధీ బోధన్, ఆదిలాబాద్, వేములవాడ సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. అటు, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు తెలంగాణలో పర్యటించనున్నారు. కామారెడ్డి, తుక్కుగూడ బహిరంగ సభల్లో బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించనున్నారు. అమిత్ షా సైతం కొల్లాపూర్, మునుగోడు, పటాన్ చెరు బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. అనంతరం ఖైరతాబాద్ రోడ్ షోలో పాల్గొంటారు.

తెలంగాణలో 3 రోజులు వర్షాలు

బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్‌ పరిసరాల్లో ఈ నెల 26న ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారులు  శుక్రవారం తెలిపారు. ఈ నెల 27 నాటికి అది అల్పపీడనంగా మారే అవకాశం ఉందన్నారు. అనంతరం పశ్చిమ వాయువ్య దిశగా కదిలి 29 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడుతుందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రాబోయే 2 రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

ఏపీలో తెలంగాణ ఓటర్లకు గుడ్ న్యూస్

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది. తెలంగాణలో ఓటర్లుగా ఉండి ఏపీలో విధులు నిర్వహిస్తున్న వారు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా వెసులుబాటు కల్పించింది. ఇందుకోసం ఈ నెల 30న వేతనంతో కూడిన సెలవు మంజూరు చేసింది. ఈ మేరకు ఏపీ ఎన్నికల సంఘం అధికారి ముఖేశ్‌కుమార్‌ మీనా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

రేపు తిరుమలకు ప్రధాని మోదీ

తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్కడ పర్యటిస్తోన్న ప్రధాని మోదీ ఆదివారం తిరుమలకు రానున్నారు. నిర్మల్ లో బహిరంగ సభ అనంతరం సాయంత్రం తిరుపతికి చేరుకుంటారు. అక్కడ రాత్రి బస చేసి సోమవారం ఉదయం 8 గంటలకు శ్రీవారిని దర్శించుకోనున్నారు. అనంతరం మహబూబాబాద్ చేరుకుని తిరిగి ఎన్నికల ప్రచారంలో పాల్గొని, 3 రోజుల పర్యటన ముగించుకుని సాయంత్రం ఢిల్లీకి పయనమవుతారు.

బుల్లెట్ రైలు - కీలక అప్ డేట్

అహ్మదాబాద్‌ - ముంబయి బుల్లెట్‌ రైలు ప్రాజెక్టులో కీలక ప్రక్రియ పూర్తైనట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేశారు. 'బుల్లెట్ రైలు ప్రాజెక్టులో కీలక పురోగతి. 251.40 కి.మీ మేర పిల్లర్లు, 103.24 కి.మీ మేర ఎలివేటెడ్ సూపర్ స్ట్రక్చర్ నిర్మాణం' అని వివరాలు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇందులో బాక్స్ గడ్డర్లు, సెగ్మెంటల్ గడ్డర్ల నిర్మాణం పూర్తైంది. ఈ ప్రాజెక్టును జాతీయ హైస్పీడ్ రైల్ కార్పోరేషన్ లిమిటెడ్ పర్యవేక్షిస్తోంది.

సొరంగం - మళ్లీ అవాంతరం

ఉత్తరాఖండ్‌లోని ఉత్తర్‌కాశీ సిల్‌క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను కాపాడేందుకు చేపట్టిన సహాయక చర్యలకు మళ్లీ విఘాతం ఏర్పడింది. శుక్రవారం డ్రిల్లింగ్‌ మొదలుపెట్టిన కొద్ది సేపటికే ఆగర్‌ యంత్రానికి మరో లోహపట్టి అడ్డంకిగా నిలిచింది. దీంతో పనులు నిలిచిపోయాయి. కాగా కార్మికులు సొరంగంలో చిక్కుకుని 12 రోజులైంది. ఇప్పటి వరకూ 48.6 మీటర్ల మేర డ్రిల్లింగ్‌ జరగ్గా, 46.8 మీటర్ల వరకూ కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన 800 ఎంఎం వ్యాసం గల స్టీలు పైపుల ఏర్పాటు పూర్తైంది. సొరంగంలో చిక్కుకున్న కార్మికులను చేరుకునేందుకు మరో 12 మీటర్ల పైపును అమర్చాల్సి ఉందని అధికారులు తెలిపారు.

ఢిల్లీలో లొల్లి - సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

నూతన సీఎస్ నియామకంపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) వి.కె.సక్సేనా, సీఎం కేజ్రీవాల్ మధ్య మరోసారి వివాదాస్పదమైంది. కొత్త సీఎస్ తమను సంప్రదించకుండా కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై శుక్రవారం విచారించిన సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. వివాదంపై ఎల్జీ, సీఎం కలిసి ఎందుకు మాట్లాడుకోరని ప్రశ్నించింది. గతంలో ‘దిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌’ ఛైర్‌పర్సన్‌ నియామకం విషయంలోనూ ఇదే విషయాన్ని చెప్పామని, అయినా వినలేదని గుర్తు చేసింది.

నిరీక్షణకు తెర - 24 మందికి స్వేచ్ఛ

అమెరికా, ఈజిప్టు, ఖతార్‌ దేశాల చొరవతో ఇజ్రాయెల్‌–హమాస్‌ మధ్య కుదిరిన సంధి మేరకు గాజాలో శుక్రవారం భూతల, వైమానిక దాడులకు బ్రేక్ పడింది. ఒప్పందం ప్రకారం హమాస్ చెరలోని బందీల విడుదల ప్రక్రియ ప్రారంభమైంది. తొలిరోజు 13 మంది ఇజ్రాయెలీ బందీలను హమాస్ మిలిటెంట్లు విడుదల చేశారు. వీరిని రెడ్ క్రాస్ సంస్థకు అప్పగించారు. మొత్తం 24 మంది బందీలను హమాస్‌ విడిచిపెట్టిందని, వీరిలో 13 మంది ఇజ్రాయెల్‌ పౌరులు, 10 మంది థాయ్‌లాండ్‌ పౌరులు, ఒకరు ఫిలిప్పైన్స్‌ పౌరుడున్నట్టు ఖతార్‌ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు.

6 దేశాలకు చైనా ఉచిత వీసా

5 ఐరోపా దేశాలతో పాటు మలేషియాకు చైనా శుక్రవారం ఉచిత వీసా ప్రవేశ అవకాశం కల్పించింది. వ్యాపార, పర్యాటక రంగాల్లో ఆయా దేశాలకు చెందిన పౌరులను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. డిసెంబరు 1 తేదీ నుంచి 15 రోజులు ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, స్పెయిన్, మలేసియా దేశాలకు ఈ అవకాశం కల్పించింది. కొవిడ్‌ నేపథ్యంలో గత మూడేళ్లుగా చైనా పర్యాటకులకు అనుమతులు నిలిపేసింది. ఈ ఏడాది నిబంధనలు తొలగించింది.

సంక్రాంతి బరిలో మాస్ మహారాజ్ 'ఈగల్'

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటిస్తున్న 'ఈగల్' సంక్రాంతి బరిలో నిలవనుంది. కావ్య థాపర్‌, అనుపమ పరమేశ్వరన్‌ కథానాయికలు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తైనట్లు చిత్ర బృందం శుక్రవారం ప్రకటించింది. మరో 50 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుందని తెలియజేస్తూ కౌంట్‌డౌన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. అందులో రవితేజ ఇంటెన్స్‌ లుక్‌లో స్టైలిష్‌ డ్రెస్సింగ్‌తో కనిపించగా.. ఆయన టేబుల్‌పై భిన్న రకాలైన తుపాకులు ఉండటం ఆసక్తి రేకెత్తిస్తోంది. 

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABPTDP revealed reports on TTD Laddus | టీటీడీ లడ్డూల ల్యాబ్ రిపోర్టులు బయటపెట్టిన టీడీపీ | ABP Desamహైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Embed widget