Top Headlines: తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీం కీలక ఆదేశాలు - సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నేత కేవీపీ లేఖ, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Today Top Headlines: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Top Headlines In AP And Telangana:
1. తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
తిరుమల లడ్డూ వివాదంలో సుప్రీంకోర్టులో స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించింది. ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేయాలని సూచించింది. ఇద్దరు ప్రస్తుతం వేసిన సిట్ నుంచి సభ్యులుగా ఉంటారు. ఇంకో ఇద్దరు సిబీఐ నుంచి తీసుకొస్తారు. మరొ వ్యక్తి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఐఏ నుంచి ఉండే అవకాశం ఉంది. ఫుడ్ సెఫ్టీ ఆఫీసర్ నాయకత్వం వహించబోతున్నారు. మొత్తం దర్యాప్తును సిబీఐ డెరెక్టర్ ప్రవీణ్ సూద్ పర్యవేక్షించబోతున్నారు. ఇంకా చదవండి.
2. పవన్ కల్యాణ్‌పై డీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు
ఉదయనిధి స్టాలిన్ గతంలో సనాతన ధర్మం వైరస్ వంటిది అని చేసిన వ్యాఖ్యలపై వారాహి డిక్లరేషన్ సభలో పవన్ కల్యాణ్ స్పందించారు. ఉదయనిధి పేరు ప్రస్తావించలేదు కానీ ఓ యువనేత అంటూ విమర్శలు గుప్పించారు. తమిళంలోనూ ఆయన ప్రసంగించడంతో ఈ అంశం తమిళనాడులోనూ హాట్ టాపిక్ అయింది. పవన్ కల్యాణ్.. ఉదయనిధిని టార్గెట్ చేసుకుని చేసిన విమర్శలపై డీఎంకే స్పందించింది. డీఎంకే అధికార ప్రతినిధి సయ్యద్ హఫీజుల్లా ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. ఇంకా చదవండి.
3. జనసేన విస్తరణ దిశగా పవన్ కల్యాణ్
రాజకీయాలు ఎంత విచిత్రంగా ఉంటాయంటే ఏదో సినిమాలో చెప్పినట్టు " లైట్ ఎక్కడో ఉంటుంది.. దాని స్విచ్చు ఇంకెక్కడో ఉంటుంది". నాయకుల స్పీచ్ గమనిస్తే యథాలాపంగా మాట్లాడిన మాటల వెనుక చాలా పెద్ద వ్యూహమే కనపడుతుంది. దానికి పవన్ కల్యాణ్ వారాహి డిక్లరేషన్ ప్రసంగం బెస్ట్ ఎగ్జాంపుల్. ఎక్కడో ఆవు నెయ్యి కల్తీ దగ్గర మొదలైన రచ్చ పవన్ సనాతన ధర్మం కోసం తమిళంలో నిప్పులు చెరిగిన వరకు చేరుకుంది. సనాతన ధర్మ బోర్ట్ అనీ ధర్మ పరిరక్షణ అనీ పవన్ చాలా అంశాల మీదే మాట్లాడినా అసలు టార్గెట్ మాత్రం తమిళ రాజకీయ చిత్రమే అని అర్థమయిపోతుంది అంటున్నారు విశ్లేషకులు. ఇంకా చదవండి.
4. సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నేత కేవీపీ లేఖ
నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కేవీపీ ఫామ్ హౌస్ ను కూల్చొద్దా అని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ అయ్యాయి. ఇతర నేతల గురించి రేవంత్ చెప్పినా... కేవీపీ మాత్రం స్వయంగా కాంగ్రెస్ పార్టీ నేత. దీంతో ఆయన ఆవేదనా పూర్వకంగా స్పందించారు. తన వల్ల కాంగ్రెస్ పార్టీకి చెడ్డపేరు రావడం ఇష్టం లేదని .. తమ ఫామ్ హౌస్ అక్రమం అయితే కూల్చివేయాలని ఆయన లేఖలో కోరారు. ఇంకా చదవండి.
5. తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డుపై అప్ డేట్
తెలంగాణ వ్యాప్తంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డు కోసం చేపట్టిన పైలెట్ ప్రాజెక్టు సర్వే కొనసాగుతోంది. ప్రతి నియోజకవర్గంలో ఒక వార్డు, రెండు గ్రామ పంచాయితీలను ఎంపిక చేసుకొని వివరాలు నమోదు చేస్తున్నారు. బృందాలుగా విడిపోయిన అధికారులు ప్రజలతో మాట్లాడి వారి వివరాలు రిజిస్టర్ చేస్తున్నారు. ఫ్యామిలీలో మహిళను యజమానిగా గుర్తిస్తూ సర్వే సాగుతోంది. కుటుంబంలో ఎవరెవరు ఉంటున్నారు. ఎన్ని ఇళ్లు ఉన్నాయి. ఎన్ని ఫ్యామిలీలు ఉంటున్నాయి. చదువుకుంటున్న వాళ్లు ఎంతమంది కుటుంబ పెద్ద ఏం పని చేస్తున్నారు. ఇంకా చదవండి.