Crime News: పతంగులు నింపిన విషాదం - గాలిపటాలు ఎగరేస్తూ వేర్వేరు జిల్లాల్లో ముగ్గురు మృతి
Telangana News: పండుగ పూట పతంగులు ఎగురవేస్తూ ముగ్గురు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన ఘటన తెలంగాణలో జరిగింది. 3 జిల్లాల్లో వేర్వేరు చోట్ల గాలిపటాలు ఎగరేస్తూ వీరు ప్రాణాలు కోల్పోయారు.
Three People Died While Flying Kites In Telangana: పండుగ సందర్భంగా పతంగుల సరదా వారి ప్రాణం తీసింది. భవనాలపై గాలిపటాలు ఎగరేస్తూ ప్రమాదవశాత్తు భవనం పైనుంచి కింద పడి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటనలు నిర్మల్, యాదాద్రి, రంగారెడ్డి జిల్లాల్లో చోటు చేసుకున్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ (Nirmal) పట్టణంలోని గుల్జార్ మార్కెట్ ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ మహ్మద్ షఫీ రెండో కుమారుడు హుఫేజ్ (11) తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. సెలవులు కావడంతో ఇంటి వద్దే ఉన్న బాలుడు బుధవారం స్నేహితులతో కలిసి పతంగులు ఎగురవేసేందుకు ఓ భవనంపైకి వెళ్లాడు. గాలిపటం ఎగరేస్తూ భవనం పైనుంచి కింద పడగా.. స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
అటు, యాదాద్రి జిల్లా (Yadadri District) మోటకొండూరు మండలం అమ్మనబోలులో జూపల్లి నరేందర్ (48) సంక్రాంతి సందర్భంగా మంగళవారం డాబాపైకి ఎక్కి పతంగి ఎగురవేశారు. డాబాపై రక్షణ గోడ లేకపోవడంతో కిందపడిపోయారు. తీవ్ర గాయాలైన ఆయన్ను కుటుంబసభ్యులు ఆలేరు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు, రంగారెడ్డి జిల్లా (Rangareddy District) మీర్‌పేట కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడకు చెందిన కె.మహేశ్‌యాదవ్ (39) పతంగి ఎగురవేయడానికి మంగళవారం ఓ భవనం ఎక్కారు. గాలిపటం ఎగరేస్తూ అదుప తప్పి భవనం పైనుంచి కింద పడిపోవడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అటు, చైనా మాంజా దారాలు తగిలి వివిధ ప్రాంతాల్లో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
Also Read: Congress Arrests: బెయిలబుల్ సెక్షన్లతో బీఆర్ఎస్ నేతల అరెస్టులు - వెంటనే బెయిల్ - వ్యూహాత్మకమేనా ?