అన్వేషించండి

Congress Arrests: బెయిలబుల్ సెక్షన్లతో బీఆర్ఎస్ నేతల అరెస్టులు - వెంటనే బెయిల్ - వ్యూహాత్మకమేనా ?

Telangana: బెయిలబుల్ సెక్షన్లు పెట్టి బీఆర్ఎస్ నేతల్ని అరెస్టు చేస్తున్నారు పోలీసులు. వెంటనే వారికి బెయిల్ వస్తోంది. ఎందుకిలా చేస్తున్నారు ?

Police are arresting BRS leaders under bailable sections :  తెలంగాణ పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారో .. లేకపోతే వ్యూహం లేక వ్యవహరిస్తున్నారో బీఆర్ఎస్ నేతలకు అర్థం కావడం లేదు. కొన్ని కేసుల్లో బీఆర్ఎస్ నేతల్ని అరెస్టు చేస్తున్నారు.కానీ వారిని జైలుకు పంపడం లేదు. వారిపై బెయిలబుల్ సెక్షన్లు మాత్రమే పెడుతున్నారు. దాంతో రిమాండ్ కు పంపేందుకు జడ్జిలు తిరస్కరించి బెయిల్ ఇస్తున్నారు. ఇలా  హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడికౌశిక్ రెడ్డిని చాలా సార్లు అరెస్టు చేశారు.కానీ బెయిలబుల్ సెక్షన్లే పెట్టారు.అరెస్టు చేసిన అన్ని సార్లు బయటకు వచ్చారు. ఓ సారి ఎర్రోళ్ల శ్రీనివాస్ నూ అరెస్టు చేశారు ఆయనకు బెయిల్ ...రిమాండ్ కు వెళ్లకుండానే లభించింది. 

అరెస్టు కానీ జైలుకు పంపకూడదన్న లక్ష్యమా ?

ఎర్రోళ్ల శ్రీనివాస్, పాడికౌశిక్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం పేరుతో కాస్త దూకుడుగా వ్యవహరిస్తున్నారు. పాడికౌశిక్ రెడ్డి పోలీస్ స్టేషన్ లోనే హంగామా చేశారు. పోలీసు అధికారులతో దురుసుగా ప్రవర్తించారు. తర్వాత కరీంనగర్‌లో ఎమ్మెల్యే సంజయ్ కుమార్  తోనూ అంత కంటే ఎక్కువగా ప్రవర్తించారు. ఎర్రోళ్ల శ్రీనివాస్ కూడా అలాగే చయడంతో అరెస్టు చేశారు. వీరెరిపైనా కఠినమైన సెక్షన్లు పెట్టలేదు. కానీ అరెస్టులు చేశారు. అలాంటి సెక్షన్లతో రిమాండ్‌కు పంపరని ఆ పోలీసులకు తెలియదా అంటే.. తెలియదని ఎలా అనుకోగలం. మరి ఎందుకు అలా చేస్తున్నారు ?. ఇదే సందేహం బీఆర్ఎస్ నేతలకూ వస్తోంది. తమను జైలుకు పంపాలంటే పెద్ద విషయం కాదు కానీ ఎందుకు ఇలా చేస్తున్నారని అనుకుంటున్నారు. 

జైలుకు పంపేలా చేయడానికే రెచ్చగొడుతున్నారా ?

పాడి కౌశిక్ రెడ్డి రాజకీయ వ్యవహారశైలి భిన్నంగా ఉంది. ఆయన నేరుగా ముఖ్యమంత్రిని ధూషిస్తున్నారు. ఇతర వ్యవహారాల్లో దాడులకు తెగబడినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇలా ఓ ముఖ్యంత్రిని దూషిస్తే..ఏదో ఓ కేసులో అరెస్టు చేయడం పెద్ద విషయం కాదు. అలా చేస్తారని తెలిసిక కూడా పాడి కౌశిక్ రెడ్డి దూకుడుగా ఉంటున్నారు. అంటే కాంగ్రెస్ ను రెచ్చగొడుతున్నారని అనుకోవచ్చు. బీఆర్ఎస్ నేతలు.. పాడికౌశిక్ రెడ్డి కలిసి..అరెస్టుల కోసం వ్యూహం పన్నినట్లుగా భావిస్తున్నారు.అందుకే అరెస్టులు చేస్తున్నారు కానీ జైలు వరకూ వెళ్లనీయడం లేదని.. ఆ తర్వాత జరిగే రాజకీయానికి అవకాశం లేకుండా చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. 

కేటీఆర్ అరెస్టు పైనా మైండ్ గేమ్ - కానీ సుప్రీంకోర్టుకు వెళ్లే వరకూ చాన్స్ !

ఇదే ప్లాన్ ను రేవంత్ ప్రభుత్వం కేటీఆర్ విషయంలోనూ పాటిస్తోంది. ఎన్నో రోజులుగా ఇదిగో కేటీఆర్ అరెస్టు..అదిగో కేటీఆర్ అంటున్నారు కానీ ఇప్పటి వరకూ అరెస్టు చేయలేదు. కేటీఆర్ ను అన్ని రకాల న్యాయపరమైన అవకాశాల్ని ఉపయోగిచుకునేలా చేశారు. చివరికి సుప్రీంకోర్టులోనూ ఆయనకు ఊరట లభించలేదు. ఎప్పుడు అరెస్టు చేస్తారోనని కేటీఆర్ కూడా వెయిటింగ్ చేస్తున్నారు.దానికి తగ్గట్లుగా రాజకీయం చేసేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేసుకుందని చెబుతున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా రిలీఫ్ ఇవ్వకపోవడంతో ఆయనను అరెస్టు చేయడానికి ఎలాంటి ఆటంకాలు లేవు.కానీ ఎప్పుడు అరెస్టు చేస్తారన్నది సస్పెన్స్ గానే ఉంది.  మొత్తంగా కాంగ్రెస్ సర్కార్ అరెస్టుల వల్ల పొలిటికల్ లాస్ లేకుండా... ఇతరులకు పొలిటికల్ గెయినింగ్ లేకుండా చూసేలా వ్యూహం పన్నుతోందని అనుకోవచ్చు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Naznin Munni : బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
Sandesara brothers: వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
Viraansh Bhanushali: ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
Tarique Rahman: బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!
బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!

వీడియోలు

రికార్డులు సృష్టిస్తున్నా ఐపీఎల్ ఛాన్స్ రాని బ్యాటర్ సకిబుల్ గని
బుమ్రా, పంత్ తనపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారన్న బవుమా
విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీల మోత.. ఒక్క రోజే 22 సెంచరీలు
సీసీటీవీల్లో రికార్డ్ చేశారా? బీసీసీఐపై ఫ్యాన్స్ ఫైర్
Rohit Sharma Century Mumbai vs Sikkim | Vijay Hazare Trophy 2025 తొలి మ్యాచ్ లో ముంబై ఘన విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Naznin Munni : బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
Sandesara brothers: వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
Viraansh Bhanushali: ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
Tarique Rahman: బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!
బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!
New Kia Seltos: అనంతపురం కేంద్రంగా కొత్త కియా సెల్టోస్ ఉత్పత్తి ప్రారంభం! కొత్త సంవత్సరంలో విడుదల! దాని స్పెషాలిటీ తెలుసుకోండి!
అనంతపురం కేంద్రంగా కొత్త కియా సెల్టోస్ ఉత్పత్తి ప్రారంభం! కొత్త సంవత్సరంలో విడుదల! దాని స్పెషాలిటీ తెలుసుకోండి!
మోదీ, చంద్రబాబు కలిస్తే 2 కాదు.. 11 వీళ్లిద్దరూ అడుగేస్తే ఇక ఆపేదెవడు?
మోదీ, చంద్రబాబు కలిస్తే 2 కాదు.. 11 వీళ్లిద్దరూ అడుగేస్తే ఇక ఆపేదెవడు?
Dhandoraa OTT : ఆ ఓటీటీలోకి శివాజీ 'దండోరా' - ఎందులో, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఆ ఓటీటీలోకి శివాజీ 'దండోరా' - ఎందులో, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Unbreakable Cricket Records : క్రికెట్ చరిత్రలో ఈ 11 రికార్డులు బ్రేక్ చేయడం దాదాపు అసాధ్యం! ఆ జాబితా ఇక్కడ చూడండి!
క్రికెట్ చరిత్రలో ఈ 11 రికార్డులు బ్రేక్ చేయడం దాదాపు అసాధ్యం! ఆ జాబితా ఇక్కడ చూడండి!
Embed widget