అన్వేషించండి

Narayanpet News: బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?

Telangana News: ఓ బిడ్డ మరణాన్ని తట్టుకోలేని ఆ తండ్రి చిన్నారి సమాధి వద్దే పడుకున్నాడు. ఈ హృదయ విదారక ఘటన నారాయణపేట జిల్లాలో జరిగింది.

Tearful Incident in Narayanpet District: అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డలు తమ కళ్ల ముందే దూరమైతే ఆ తల్లిదండ్రుల బాధను వర్ణించలేం. తన బిడ్డ మరణాన్ని జీర్ణించుకోలేని ఆ తండ్రి చిన్నారి సమాధి వద్దే రోధిస్తూ పడుకున్నాడు. సమాధిని గట్టిగా కౌగిలించుకుంటూ కన్నీరు మున్నీరుగా విలపించాడు. దీన్ని గమనించిన బంధువులు ఆ తండ్రిని ఓదార్చి తమ వెంట ఇంటికి తీసుకెళ్లారు. గుండెలను పిండేసే ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నారాయణపేట (Narayanpet) జిల్లాలో ఈ విషాద ఘటన జరిగింది. ఈ దృశ్యాన్ని చూసిన నెటిజన్లు.. ఆ తండ్రి బాధ మరెవరికీ రాకూడదని పేర్కొంటున్నారు. 

ఇదీ జరిగింది

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపేట జిల్లా గోపాల్ పేట వీధికి చెందిన లక్ష్మీ ప్రణీత (12) తన స్నేహితులతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొంది. ఓ వాటర్ ట్యాంక్ వద్ద ఆడుకుంటుండగా.. అది ప్రమాదవశాత్తు కూలిపోయింది. ఈ ఘటనలో లక్ష్మీ ప్రణీతతో పాటు మరో అమ్మాయికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ లక్ష్మీ ప్రణీత ప్రాణాలు కోల్పోయింది. దీంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అదే రోజు సాయంత్రం లక్ష్మీ ప్రణీత అంత్యక్రియలు నిర్వహించారు. ఆమె తండ్రి రమేష్ స్నానం చేసిన వెంటనే బయటకు వెళ్లాడు. రాత్రి 11 దాటినా ఇంకా ఇంటికి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికినా.. ఫలితం లేకపోయింది. అనుమానం వచ్చి ప్రణీతను పూడ్చిపెట్టిన ప్రాంతానికి వెళ్లగా.. అక్కడ సమాధి వద్దే రమేష్ పడుకుని విలపించడాన్ని గమనించారు. అతన్ని సముదాయించి ఇంటికి తీసుకొచ్చారు. ఈ ఘటన అక్కడి వారిని కంటతడి పెట్టించింది.

Also Read: Part Time Jobs Scam: పార్ట్ టైం ఉద్యోగాల స్కాం - రంగంలోకి ఈడీ, రూ.32.34 కోట్లు అటాచ్

టాప్ హెడ్ లైన్స్

Breaking News: నేడు తాడేపల్లిలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ కీలక భేటీ
నేడు తాడేపల్లిలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ కీలక భేటీ
Rebel BRA MLAs looking back | ఫిరాయింపు ఎమ్మెల్యేల ‘రివర్స్ గేర్’.. గులాబీ గూటివైపు చూపులు?
Rebel BRA MLAs looking back | ఫిరాయింపు ఎమ్మెల్యేల ‘రివర్స్ గేర్’.. గులాబీ గూటివైపు చూపులు?
Telangana Graduate MLC Elections 2027: పట్టభద్రుల ఎమ్మెల్సీలుగా పోటీకి యువనేతలు పోటాపోటీ -అన్ని పార్టీలు యువతకే ప్రాధాన్యం ఇవ్వనున్నాయా?
పట్టభద్రుల ఎమ్మెల్సీలుగా పోటీకి యువనేతలు పోటాపోటీ -అన్ని పార్టీలు యువతకే ప్రాధాన్యం ఇవ్వనున్నాయా?
SIR Enumeration Uncollectable Votes: తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కుదిపేస్తున్న SIR ప్రక్షాళన - లక్షల్లో ఓట్ల గల్లంతు - వాళ్లంతా ఏమయ్యారు?
తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కుదిపేస్తున్న SIR ప్రక్షాళన - లక్షల్లో ఓట్ల గల్లంతు - వాళ్లంతా ఏమయ్యారు?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Chemical Signaling: మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
Microsoft Alert: హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Embed widget