Kishan Reddy On Rilce Mills : ధాన్యం గోల్ మాల్‌పై ఎఫ్‌సీఐతో విచారణ - కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన
తెలంగాణ రైస్ మిల్లుల్లో ధాన్యం మాయంపై ఎఫ్‌సీఐతో విచారణ చేయించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఎఫ్‌సీఐ ప్రాధమిక విచారణలో పెద్ద ఎత్తున ధాన్యం గోల్ మాల్ జరిగిందని తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణ ప్రభుత్వం, బీజేపీ మధ్య జరుగుతున్న వరి పోరాటంలో అనూహ్య మలుపు చోటు చేసుకుంది. తెలంగాణలో ధాన్యం సేకరణలో జరుగుతున్న అక్రమాలపై ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో విచారణ చేయించాలని కేంద్రం నిర్ణయించింది.ఈ విషయాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణలోని రైస్ మిల్లులను తనికీ చేయాలని ఎఫ్‌సీఐని ఆదేశించామని కేంద్ర మంత్రి ప్రకటించారు. ఇటీవల నలభై మిల్లుల్లో పరిశీలన జరిపితే 4 లక్షల 53 వేల 896 బస్తాలు లెక్క తేలలేదన్నారు. ఈ నాలుగు మిల్లుల్లోనే ఇంతపెద్ద స్థాయిలో ధాన్యం ఏమియందో తెలియడం లేదని అందుకే అన్ని మిల్లులలోనూ విచారణ చేయాలని ఆదేశించామన్నారు.
తమిళిసైపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు
ఎఫ్‌సీఐకి రైస్ మిల్లులతో సంబంధం ఉండదన్నారు. నేరుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచే ధాన్యం సేకరణ చేస్తుందన్నారు. ధాన్యం సేకరించి వాటిని రైస్ మిల్లలకు పంపేది ప్రభుత్వమేనని.. రైస్ మిల్లులు అక్రమాలకు పాల్పడుతూంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. రైస్ మిల్లులపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ధాన్యం ఏమయ్యాయో స్పష్టత కావాల్సి ఉందన్నారు. ఎఫ్‌సీఐకి తెలంగాణ గత సీజన్ లో ఇచ్చిన టార్గెట్ ను రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కేంద్రానికి ఇవ్వలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్ధన మేరకు ఆరుసార్లు ఈ విషయమై ప్రభుత్వానికి ధాన్యం ఇచ్చేందుకు పొడిగింపు ఇచ్చామన్నారు.
హలో కేటీఆర్ అంటూ కర్ణాటక సర్కార్ చేసిన ట్వీట్ వైరల్ ! ఎందుకంటే ?
గత ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించిన బియ్యాన్ని ఎఫ్‌సీఐకి ఇవ్వలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.ఈ సీజన్ లో 40.20 లక్షల టన్నుల బియ్యాన్ని ఇస్తామని కూడా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖ ఆధారంగా 40.20 లక్షల టన్నుల బియ్యాన్ని కొనుగోలు చేస్తామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే తాము ఇస్తామన్న 40.20 లక్షల టన్ను ధాన్యం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోందో లేదోననే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు.
తెలంగాణలో శాంతిభద్రతలపై రేణుకా చౌదరి సీరియస్ కామెంట్స్- కేంద్రం జోక్యానికి డిమాండ్
వడ్లు కొనాల్సిందేనని టీఆర్ఎస్ ఉద్యమం చేసింది. కేంద్రం పట్టించుకోకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది. రాష్ట్రం కొనుగోలు చేసి మిల్లర్లకు పంపి.. వాటిని ఎఫ్‌సీఐకి ఇస్తుంది. అయితే ఇలా మిల్లర్లకు పంపిన ధాన్యం మాయమవుతోందన్న ఆరోపణలు బీజేపీ చేస్తోంది. ఎఫ్‌సీఐ విచారణలో ఆ బియ్యం అంతా ఎక్కడకు వెళ్తుందో నిగ్గు తేలే అవకాశం ఉంది. టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ఇదే అంశంపై కిషన్ రెడ్డికి లేఖ రాశారు. సీబీఐ విచారణ జరిపించాలన్నారు. అయితే కిషన్ రెడ్డి మళ్లీ ఎఫ్‌సీఐ తోనే విచారణ చేయిస్తున్నామని ప్రకటించారు.