అన్వేషించండి

TS EAPCET 2026 Results : తెలంగాణ ఎప్‌సెట్ 2026 ఫలితాలు విడుదల, రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి

TS EAPCET 2026 Results | తెలంగాణ ఎప్‌సెట్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్ eapcet.tgche.ac.in లో ఫలితాలు చెక్ చేసుకోవాలని అభ్యర్థులకు సూచించారు.

Telangana EAPCET Results 2026 | హైదరాబాద్: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ ఎప్‌సెట్ (TG EAPCET 2026) ఫలితాలు విడుదలయ్యాయి.  ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు కేవలం 6 రోజుల్లోనే రికార్డ్ సమయంలో ఫలితాలు విడుదల చేశారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ https://eapcet.tgche.ac.in/ లో ఫలితాలు చెక్ చేసుకోవాలని ఈ మేరకు ఎప్‌సెట్ కన్వీనర్‌ ఆచార్య కె.విజయకుమార్‌రెడ్డి సూచించారు. 

ఇంజనీరింగ్ అభ్యర్థులు ఫలితాల కోసం క్లిక్ చేయండి 

అగ్రికల్చర్, ఫార్మసీ అభ్యర్థులు ఫలితాల కోసం క్లిక్ చేయండి

హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని జేఎన్‌టీయూ (JNTU-H) క్యాంపస్‌లో ఉదయం 11 గంటలకు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్‌ శ్రీదేవసేన, జేఎన్‌టీయూ-హెచ్‌ (JNTUH) వీసీ టి. కిషన్‌కుమార్‌రెడ్డి తదితర ఉన్నతాధికారులు ఈ ఫలితాలను విడుదల చేశారు. 

రికార్డ్ సమయంలో ఎప్‌సెట్ 2026 ఫలితాలు
ఈసారి తెలంగాణ విద్యాశాఖ అత్యంత వేగంగా ఫలితాలు విడుదల చేసి రికార్డు సృష్టించింది. తెలంగాణ ఎప్‌సెట్ 2026 పరీక్షలు పూర్తయిన కేవలం 6వ రోజే ఫలితాలను విడుదల చేయడం విశేషం. విద్యార్థుల సమయం వృధా కాకుండా ఉండేందుకు, కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి కౌన్సెలింగ్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, ఈ ఏడాది పరీక్ష ముగియగానే ప్రాథమిక కీ ఆధారంగా విద్యార్థుల కంప్యూటర్‌ స్క్రీన్‌పై వారి మార్కులు నేరుగా చెక్ చేసుకునేలా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఎగ్జామ్ రాసిన విద్యార్థులు తమ ర్యాంక్ కార్డులు, ఫలితాలను  www.eapcet.tgche.ac.in వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.  https://eapcet.tgche.ac.in/TGEAPCET/EAPCET_RankCard.aspx

Also Read: CBSE New Language Policy: సీబీఎస్ఈ త్రిభాషా విధానం తప్పనిసరి.. దానివల్ల ఏం మార్పులు వస్తాయి

ఇంజనీరింగ్ టాపర్లు..

ఈ ఏడాది ఎప్‌సెట్‌లో ఇంజినీరింగ్‌ విభాగంలో 1,97,241 మంది విద్యార్థులు.. అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగంలో 84,954 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాశారు. ఎం రుషి అనే విద్యార్థిని 156.63 మార్కులతో ఇంజనీరింగ్ విభాగంలో స్టేట్ టాపర్‌గా నిలిచింది. బెజుగామ అన్షుల్ (148.70) రెండో ర్యాంక్ సాధించగా.. ఏపీకి చెందిన వంశీధర్ రెడ్డి (147.05) 3వ ర్యాంక్, జొన్నల రోషన్ మణిదీప్ రెడ్డి (144.44) 4వ ర్యాంకులు సొంతం చేసుకున్నారు. ఆదుల సాయి నికిత్ (143.30) టాప్ 5గా నిలిచాడు. టాప్ 10లో సగం మంది మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు చెందిన వారే ఉండటం విశేషం.

అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో టాపర్లు..

అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో ముకరం అహ్మద్ 150.177 మార్కులతో స్టేట్ టాపర్‌గా నిలిచాడు. తాడూరి నివృత్ సాయి వెంకట్ రెండో ర్యాంక్  (143.43), సాహితీ గీతిక 3వ ర్యాంక్  (142.35), మయూక్ జయసింహ  (139.78) 4వ ర్యాంక్, అమైర్ అనాస్ (137.40) 5వ ర్యాంక్ సాధించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Embed widget