![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
TG Fancy Number: ఆ ఫ్యాన్సీ నెంబరుకు రూ.25.50 లక్షలు - రాష్ట్రంలోనే తొలిసారిగా..
Telangana News: రాష్ట్రంలోనే తొలిసారిగా ఓ ఫ్యాన్సీ నెంబరుకు రూ.25.50 లక్షల ధర పలికింది. ఖైరతాబాద్ ఆర్టీఏలో సోమవారం ఆన్ లైన్ బిడ్డింగ్‌లో 9999ను ఓ సంస్థ భారీ ధరకు దక్కించుకుంది.
![TG Fancy Number: ఆ ఫ్యాన్సీ నెంబరుకు రూ.25.50 లక్షలు - రాష్ట్రంలోనే తొలిసారిగా.. tg 09 9999 fancy number sold over 25 lakhs in kairathabad auction TG Fancy Number: ఆ ఫ్యాన్సీ నెంబరుకు రూ.25.50 లక్షలు - రాష్ట్రంలోనే తొలిసారిగా..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/21/5bb999c07cbcf0aa175506fb18415f871716272580052876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Telangana Fancy Number Sold Over 25 Lakhs: ఓ వాహన ఫ్యాన్సీ నెంబరు ఏకంగా రూ.25.50 లక్షల ధర పలికింది. రవాణా శాఖకు ఓ ఫ్యాన్సీ నెంబరుకు (Telangana Fancy Number) ఇంత రాబడి రావడం రాష్ట్రంలోనే ఇది తొలిసారి. ఖైరతాబాద్ లోని రవాణా శాఖ కార్యాలయంలో సోమవారం కొత్త సిరీస్ ప్రారంభమైన క్రమంలో ఆన్ లైన్ వేలం నిర్వహించారు. టీజీ09 9999 నెంబరును సోని ట్రాన్స్పోర్ట్ సొల్యూషన్స్ తమ టయోటా ల్యాండ్ క్రూజర్ ఎల్ఎక్స్ వాహనం కోసం దక్కించుకుంది. ఆర్టీఏ విధించిన రూ.50 వేల ఫీజుతో పాటు, బిడ్డింగ్ మొత్తం రూ.25.50 లక్షలు చెల్లించి ఈ నెంబరును సొంతం చేసుకుంది. ఆన్ లైన్లో ఈ స్థాయిలో పోటీ రావడం తెలంగాణలోనే ఇదో తొలిసారి అని హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ సి.రమేష్ తెలిపారు. దీంతోపాటు మరికొన్ని ఫ్యాన్సీ నెంబర్ల వేలం ద్వారా ఒక్కరోజే రవాణా శాఖకు రూ.43,70,284 ఆదాయం సమకూరిందని చెప్పారు.
ఆల్ నైన్స్ అత్యధిక బిడ్డింగ్ ఇలా..
- TS 09 GD 9999 నెంబరుకు ముప్పా హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.15,53,000 చెల్లించింది.
- TS 09 GE 9999 నెంబరుకు కీస్టోన్స్ ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ రూ.17.35 లక్షలు చెల్లించింది.
- TS 09 GC 9999 ఫ్యాన్సీ నెంబరుకు ప్రైమ్ సోర్స్ గ్లోబల్ సర్వీస్ చెల్లించిన మొత్తం రూ.21.60 లక్షలు
- TG 09 9999 నెంబరుకు సోనీ ట్రాన్స్పోర్ట్ సొల్యూషన్స్ రూ.25.50 లక్షలు చెల్లించి సొంతం చేసుకుంది.
Also Read: CM Revanth Reddy: సీఎం అయ్యాక తొలిసారి నేడు తిరుమలకు రేవంత్ రెడ్డి, కారణం ఏంటంటే?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)