Telangana State Commission for Women : యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లకు మహిళా కమిషన్ హెచ్చరిక - ఇక హద్దుమీరితే కఠిన చర్యలే
Nerella Sarada : మహిళల్ని కించపరిచే యూట్యూబ్ క్రియేటర్లు, ఇన్‌ఫ్లూయన్సర్లకు తెలంగాణ మహిళా కమిషన్ హెచ్చరికలు జారీ చేసింది. చట్టపరిధిని అతిక్రమిస్తే కఠిన చర్యలు ఖాయమని.. స్పష్టం చేసింది.
Telangana Womens Commission has issued warnings : మహిళలను కించ పరిచి అదే కామెడీ, డార్క్ కామెడీ అంటూ కంటెంట్ క్రియేట్ చేసే వారికి, ఇన్ ఫ్లూయన్సర్లకు తెలంగాణ మహిళా కమిషన్ స్పష్టమైన సూచనలతో హెచ్చరికలు జారీ చేసింది. ప్రాథమిక హక్కుల్లో వాక్ స్వాతంత్య్రం ఉంది కానీ.. దానికి కొన్ని పరిమితుల్ని రాజ్యంగంలో పెట్టిందని తెలంగాణ మహిళా కమిషన్ స్పష్టం చేసింది. ఇటీవలి కాలంలో చాలా మంది కంటెంట్ క్రియేటర్లు హద్దులు దాటిపోతున్నారని గుర్తు చేసింది. తండ్రీ, బిడ్డల విషయంలో ఇటీవల కొంత మంది చేసిన తరహా వీడియోలు ఏ మాత్రం క్షమించేవి కావని అందుకే.. . కంటెంట్ క్రియేటర్లకు.. ఇన్ ఫ్లూయన్సర్లకు.. నిబంధనలు జారీ చేస్తున్నామని తెలిపారు.
పబ్లిక్ ఆర్డర్, కనీస హుందాతనం, నైతికత అనేవి మొదటగా కంటెంట్ క్రియేటర్లు, ఇన్ ఫ్లూయన్సర్లుగా మొదటగా చూసుకోవాల్సిన అంశం. ముఖ్యంగా మహిళాలకు సంబంధించిన ఎలాంటి చట్టాలను ఉల్లంఘించేలా కంటెంట్ ఉండకూడదు. ఒక వేళ అలా ఉంటే మహిళా కమిషన్‌కు చర్యలు తీసుకునే అధికారం ఉంటుంది. ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగాన్ని దృష్టిలో ఉంచుకోవాలని.. వాక్ స్వాతంత్య్రం ఉన్నా.. దానికి ఉన్న పరిమితుల్ని గుర్తించాలన్నారు. ఏ మాధ్యమంలో కంటెంట్ క్రియేట్ చేసినా అది చట్టాలకు అనుగుణంగానే ఉండాలన్నారు. హింసను ప్రరేపిచేలా ఉంటే ఊరుకునే ప్రసక్తే ఉండదని మహిళా కమిషన్ స్పష్టం చేసింది. తప్పుడు ప్రచారాలు చేయడం.. ఫేస్ న్యూస్ స్ప్రెడ్ చేయడాన్ని అత్యంత తీవ్రంగా మహిళా కమిషన్ తీసుకుంటుంది.
మహిళలపై లైంగిక దాడులకు ప్రేరేపించేలా ఉంటే .. వెంటనే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని .. ఇన్ఫఫ్లూయన్సర్లు..సరైన కారణం కోసం మాత్రం ఇన్ ఫ్లూయన్స్ చేయాలి కానీ.. ఇతరలను కించ పర్చడానికి కాదని స్పష్టం చేశారు. కామెడీ, డార్క్ కామెడీ ఏదైనా ఇతరులను కించ పరిచేలా ఉండకూడదన్నారు. మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద ఈ ఉత్తర్వులు చేశారు.
Chairperson @sharadanerella has issued strict"Directives for Responsible Content Creation&Influencing".This move aims to regulate social media misuse,ensuring content adheres to legal,moral & public order standards.
— Telangana State Commission for Women (@SCWTelangana) July 22, 2024
IMMINENT NEED FOR CONTENT CREATORS&INFLUENCERS TO BE RESPONSIBLE pic.twitter.com/hr2Qav2Btf
సోషల్ మీడియాలో మహిళ జర్నలిస్టుల పై వస్తున్న ట్రోలింగ్స్ , వేణు స్వామీ వ్యవహారం పై మహిళ కమిషన్ చైర్ పర్సన్ నేరేళ్ళ శారదను కలిసి పిర్యాదు చేశారు మహిళా జర్నలిస్టులు. ముఖ్యంగా సెలబ్రీటీల జాతకాలు చెబుతూ.. రచ్చ చేస్తున్న వేణు స్వామీ వ్యవహారం పై మహిళ కమిషన్ చైర్ పర్సన్ నేరేళ్ళ శారదను కలిసి పిర్యాదు చేశారు. ఈ కారణంగా ఈ ఉత్తర్వులు జారీ చేశారు.