News
News
X

తెలంగాణలో వచ్చే 3 రోజులు వానలే వానలు

రెండు ద్రోణుల ప్రభావంతో తెలంగాణలో వడగళ్ల వానలు, ఈదురుగాలులు వీస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.

FOLLOW US: 
Share:

బంగ్లాదేశ్, దాని పరిసర ప్రాంతం నుంచి. పశ్చిమ బెంగాల్, ఒడిశా మీదుగా ఉత్తరకోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉపరితల ద్రోణి ఏర్పడింది. దక్షిణ తమిళనాడు నుంచి మధ్య, అంతర్గత కర్ణాటక, గోవా మీదుగా ఉత్తర కొంకణ్ వరకు సముద్రమట్టానికి 0.9 కి.మీ ఎత్తులో మరో ద్రోణి ఫామైంది. ఈ ప్రభావంతో తెలంగాణలో రాగల మూడురోజుల్లో చాలాచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపింది.

రాగల 3 రోజులకు వాతావరణ సూచన:

తెలంగాణలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు ఎల్లుండి (మార్చి 17,18) చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులు ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడతాయి. గాలి వేగం గంటకు 30 నుంచి 40 కి.మీ వరకు ఉండొచ్చు. రేపు (మార్చి 17న) వడగండ్లతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఎల్లుండి ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని సమాచారం.

మార్చి 16 గురువారం రోజు తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. పలు జిల్లాల్లో ఉరుముల, మెరుపులతో కూడిన వర్షం పడింది. ముఖ్యంగా రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం  నమోదైంది. చాలాచోట్ల వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. గంటకు 30-40 కి.మీ వేగంతో గాలులు వీచాయి. మామిడితోటలకు వడగళ్ల వాన కడగళ్లను మిగిల్చింది. కాయలు, పిందెలన్నీ రాలిపోయాయి. భారీనష్టమే జరిగింది.

మార్చి 17న తెలంగాణలో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వానలు పడే అవకాశం ఉంది. నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, నల్గొండ, మహ-బాద్‌, వరంగల్, హనుమకొండ, సిద్దిపే, హైదరాబాద్‌, మేడ్చల్- మల్కాజ్ గిరి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వాన పడే అవకాశం ఉందని వాతావరణ కేందరం తెలిపింది. గాలులు గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో వీస్తాయని మెట్ ఐఎండీ తెలిపింది. మార్చి 18న తెలంగాణలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షం పడే అవకాశం ఉంది.  

గురువారం అత్యధికంగా రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం ప్రొద్దుటూరులో 4.5 సెం.మీ వర్షపాతం నమోదైంది. రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లిలో 4 సెం.మీ వర్షం పడింది. రంగారెడ్డి జిల్లా శివరాంపల్లిలో 4 సెం.మీ రెయిన్ ఫాల్ రికార్డయింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ 3.5 సెం.మీ, రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ధర్మసాగర్ 3 సెం.మీ, వికారాబాద్ జిల్లా మోమిన్ పేటలో 3 సెం.మీ, సంగారెడ్డి జిల్లా కొహిర్ లో 2.6 సెం.మీ, హైదరాబాద్ జిల్లా బండ్లగూడలో 2.5 సెం.మీ, నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలో 2.5 సెం.మీ వర్షపాతం రికార్డయింది.

హైద‌రాబాద్ లో కూల్ వెదర్ 

ఎండలతో అల్లాడిన హైద‌రాబాద్ న‌గ‌రం ఒక్కసారిగా చల్లబడింది. మధ్యాహ్నం నుంచే సూర్యుడు ముఖం చాటేశాడు. మేఘాలు దట్టంగా ఆవరించడంతో చీకట్లు కమ్ముకొచ్చాయి. న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో ఉరుముల‌తో కూడిన వ‌ర్షం పడింది. ఒక్కసారిగా వెదర్ మారడంతో నగరవాసులు కాస్త ఉపశమనం పొందారు. హుస్సేన్ సాగర్ పరిసరాల్లో కూల్ వెదర్‌ ని ఎంజాయ్ చేశారు.

Published at : 16 Mar 2023 08:01 PM (IST) Tags: Hyderabad IMD Weather Rain Telangana ALERT WIND

సంబంధిత కథనాలు

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

Indian Railways: రైళ్లపై రాళ్లు రువ్వితే కేసులు మామూలుగా ఉండవు - రైల్వేశాఖ వార్నింగ్

Indian Railways: రైళ్లపై రాళ్లు రువ్వితే కేసులు మామూలుగా ఉండవు - రైల్వేశాఖ వార్నింగ్

KCR Decisions: పోడు భూములకు పట్టాలు రెడీ, పంపిణీపై త్వరలో తేదీ ప్రకటిస్తాం: సీఎం కేసీఆర్

KCR Decisions: పోడు భూములకు పట్టాలు రెడీ, పంపిణీపై త్వరలో తేదీ ప్రకటిస్తాం: సీఎం కేసీఆర్

TSPSC Exam Postpone: పేపర్ల లీకుల ఎఫెక్ట్ - హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష వాయిదా, కొత్త తేదీ ప్రకటించిన టీఎస్ పీఎస్సీ

TSPSC Exam Postpone: పేపర్ల లీకుల ఎఫెక్ట్ - హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష వాయిదా, కొత్త తేదీ ప్రకటించిన టీఎస్ పీఎస్సీ

TSPSC Paper Leak: 'గ్రూప్‌-1' మెయిన్స్‌ పేపర్ కూడా లీకయ్యేదా? బయటపడుతున్న కుట్రలు!

TSPSC Paper Leak: 'గ్రూప్‌-1' మెయిన్స్‌ పేపర్ కూడా లీకయ్యేదా? బయటపడుతున్న కుట్రలు!

టాప్ స్టోరీస్

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

KTR On Amaravati : అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?

KTR On Amaravati :   అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?

Avinash Reddy : కడప ఎంపీ అవినాష్ రెడ్డికి అరెస్ట్ భయం - ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ !

Avinash Reddy : కడప ఎంపీ అవినాష్ రెడ్డికి అరెస్ట్ భయం - ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ !