Traffic Challan: పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్‌తో భారీ ఆదాయం-రెండ్రోజుల్లో రూ.10 కోట్లు వసూలు
Pending Challans: తెలంగాణలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్ ఆఫర్.. కోట్లు కుమ్మరిస్తోంది. ఇప్పటివరకు రూ.10 కోట్ల మేర తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది.
![Traffic Challan: పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్‌తో భారీ ఆదాయం-రెండ్రోజుల్లో రూ.10 కోట్లు వసూలు Telangana Traffic Challans Rs 10 Crore income In Two Days Discount On Pending challans Telangana Police Department Traffic Police Traffic Challan: పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్‌తో భారీ ఆదాయం-రెండ్రోజుల్లో రూ.10 కోట్లు వసూలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/29/7252a410d18604a9b6bd5ce4ab794a7b1703832461262841_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Traffic Challan Discount In Telangana: క్రిస్మస్, న్యూఇయర్‌కి షాపుల్లో డిస్కౌంట్ పెట్టినట్టు... పెండింగ్ చలానాలు వసూలు చేసుకునేందుకు తెలంగాణ పోలీసు శాఖ (Telangana Police Department) డిసౌంట్ ఆఫర్ ప్రకటించింది. దీంతో పెండింగ్ చలానాలు క్లియరవుతున్నాయి. కోట్ల రూపాయాల్లో ఆదాయం వచ్చి పడుతోంది. ఇప్పటికే 10కోట్ల రూపాయల మేర వసూలు అయినట్టు సమాచారం.
భారీ డిస్కౌంట్లు
ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వారికి ట్రాఫిక్ పోలీసులు (Traffic Police) చలాన్లు జారీ చేస్తుంటారు. అయితే... ఆ చలానాలు కట్టకుండా పెండింగ్ పెట్టేస్తారు వాహనదారులు. అవన్నీ రాబట్టుకునేందకు పెండింగ్ చలాన్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది పోలీసు శాఖ. టూవీలర్లు, త్రీ వీలర్లకు 80 శాతం, బస్సులకు 90 శాతం, కార్లు, హెవీ మోటార్ వెహికిల్స్‌కు 60 శాతం డిస్కౌంట్ ఇచ్చింది. పెండింగ్ చలాన్లకు రాయితీ ఇవ్వడంతో.... దొరికిందే ఛాన్స్ అని... ఆలస్యం చేయకుండా చలానాలు కట్టేస్తున్నారు వాహనదారులు. ఎప్పటినుంచో కట్టకుండా పెట్టుకున్న చలానాల డబ్బు కూడా చల్లించేస్తున్నారు. వాహనదారుల నుంచి భారీగా స్పందన రావడంతో... డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించిన రెండు రోజుల్లోనే రూ.10కోట్లు వసూలు అయినట్టు ప్రకటించారు.
దాదాపు పది లక్షల చలాన్లు క్లియర్
డిసెంబర్ 28వ తేదీ(December 28th) రాత్రి.... అంటే గురువారం రాత్రి 10:30 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 9.80 లక్షలకు పైగా చలాన్లు క్లియర్ అయ్యాయి. అత్యధికంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 3.84 లక్షల చలాన్లకు రూ.2.90 కోట్లు, సైబరాబాద్ పరిధిలో 2.2 లక్షల చలాన్లకు రూ.1.90 కోట్లు, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 97వేల చలాన్లకు రూ.81 లక్షలు వాహనదారుల నుంచి వసూలు చేశారు. చలాన్ సైట్‌పై తాకిడి పెరగడంతో సర్వర్లు కూడా మొరాయిస్తున్నాయి. దీన్ని బట్టి.. పెండింగ్ చలానాల పేమెంట్లు కట్టేందుకు ఎంత స్పందన వస్తుందో అర్థమవుతోంది.
గతేడాది 300 కోట్ల ఆదాయం
గత ఏడాది కూడా పెండింగ్ చలానాల వసూళ్ల కోసం ఇలాంటి ఆఫర్‌నే ప్రకటించారు. అప్పుడు కూడా పెండింగ్ చలాన్ల ద్వారా ఏకంగా 300 కోట్ల ఆదాయం సమకూరింది. కాగా.. ఈ ఏడాది కూడా సుమారు 2 కోట్ల చలానాలు పెండింగ్‌లో ఉండటంతో.. మరోసారి పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్ ప్రకటించారు. డిసెంబర్ 26ను ఈ ఆఫర్ ప్రారంభించారు. జనవరి 10వ తేదీ వరకు డిస్కౌంట్‌తో పెండింగ్ చలానాలు కట్టే అవకాశాన్ని ట్రాఫిక్ పోలీసులు కల్పించారు. ఇంకెందుకు ఆలస్యం... మీకు చలానాలు ఉంటే... ఆలస్యం చేయకండి.. మంచి కాలం మించినా దొరకదు అని... త్వరపడండి... పెండింగ్ చలానాల పేమెంట్లు క్లియర్ చేసుకోండి.
అయితే... ఒక్కమాట.... పెండింగ్ చలాన్లపై మాత్రమే ఈ ఆఫర్ ప్రకటించారు. అంటే... ఈ డిస్కౌంట్ కేవలం డిసెంబర్ 25వ తేదీకి ముందు పడిన చలానాలకు మాత్రమే వర్తిస్తుంది. ఆ తర్వాత పడిన చలానాలు 100 శాతం కట్టాల్సిందే అని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
Also Read: తిరుపతిలో కరోనా అలర్ట్ - నలుగురికి పాజిటివ్ నిర్దారణ, అప్రమత్తమైన అధికారులు
Also Read: సాహిల్‌ను తప్పించేందుకు సినిమా తరహా స్కెచ్-ప్రజాభవన్ ఘటనలో కోత్త కోణం
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)