అన్వేషించండి

Revanth Reddy Chit Chat: టీఆర్ఎస్ కు ఇవే చివరి సభలు.... మోదీ డైరెక్షన్ లో సీఎం కేసీఆర్... చిట్ చాట్ లో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికల ప్రస్తావన వెనుక ఆంతర్యం వేరే ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. పార్టీలో తిరుగుబాటు భయంతోనే కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారన్నారు.

హుజురాబాద్ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ లో చాలా మార్పులోస్తాయని, పార్టీలో తిరుగుబాటు తప్పదని టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన సీఎల్పీలో మీడియాతో చిట్ చాట్ లో అనేక అంశాలను ప్రస్తావించారు. ప్రధానంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలు ఉండవు అన్న అంశాన్ని ప్రస్తావిస్తూ హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాత టీఆర్ఎస్ లో తిరుగుబాటు తప్పదన్నారు. విజయ గర్జన సభ అని కేసీఆర్ ప్రకటించడం రాబోయే తిరుగుబాటును ఎదుర్కోడానికేనన్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలతో కేసీఆర్ భయంతో ఉన్నారని అది బయటపడకుండా ప్రవర్తిస్తున్నారన్నారు. 

ఇవే టీఆర్ఎస్ కు చివరి సభలు

ముందస్తు ఎన్నికలు రావాని కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల కలిసిరావని, 6 నెలల ముందే అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని రేవంత్ రెడ్డి అన్నారు. భయంతోనే విజయ గర్జన సభలు పెడుతున్నారని, ఇవే టీఆర్ఎస్ పార్టీకి చివరి సభలు అవుతాయన్నారు. హరీశ్ రావును కూడా కేసీఆర్ త్వరలో పార్టీ నుంచి బయటికి పంపుతారన్నారు. ఈటెల గెలిచిన ఓడిన ఎవరికీ లాభం లేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 

Also Read: కేసీఆర్ మాటలకు అర్థాలే వేరా ? తెలంగాణలో ముందస్తు ఖాయమేనా ? 

మోదీ డైరెక్షన్ లో కేసీఆర్

గుజరాత్ తోనే తెలంగాణలో ఎన్నికలు వస్తాయని రేవంత్ రెడ్డి అన్నారు. 2022 ఆగస్ట్ 15తో స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతుందని, దీంతో కొత్త శకానికి నాంది అని కేసీఆర్.. ఎన్నికలకు వెళ్తారని రేవంత్ రెడ్డి చెప్పారు. మోదీ డైరెక్షన్ లో కేసీఆర్ గుజరాత్ ఎన్నికలతో కలిసి ముందస్తు ఎన్నికలలో వెళ్తారని, రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసే కుట్ర జరుగుతోందని రేవంత్ రెడ్డి అన్నారు. అప్పుడే ముందస్తు ఎన్నికలు అంటే తన పార్టీలో మరింత గందరగోళం వస్తుందని కేసీఆర్ చెప్పడం లేదన్నారు. ప్రతి నియోజక వర్గంలో నాయకులకు టికెట్ల ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి వారిని ముందస్తుగానే అలెర్ట్ కాకుండా ఈ డ్రామా ఆడుతున్నారన్నారు.  

Also Read: టీఆర్ఎస్ పార్టీలో చేరిన మోత్కుపల్లి నర్సింహులు.. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం కేసీఆర్ 

విజయ గర్జన సభ ఇప్పుడెందుకు?

ముందస్తు ఎన్నికల గురించి సీఎం కేసీఆర్ ను ఎవరు అడిగారని, ముందస్తు ఎన్నికల విషయం ఎందుకు మాట్లాడుతున్నారని రేవంత్ ప్రశ్నించారు. మరో రెండేళ్లు టీఆర్ఎస్ సర్కార్ అధికారంలో ఉంటుందని  చెప్పుకోవడం కోసమే ముందస్తు ఉండదని చెప్పడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని అన్నారు. విజయ గర్జన సభ ఎందుకు పెడుతున్నారని రాష్ట్రంలో  ఏం అభివృద్ధి, సంక్షేమం సాధించారని విజయ గర్జన సభ అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణలో ఎంపీలు 16 గెలుస్తాం, కేంద్రంలో చక్రం తిప్పుతామని కేసీఆర్ అంటున్నారని, ఇది దేనికి సంకేతమని రేవంత్ అన్నారు. టీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో దళిత, గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇస్తానన్నారు... దళిత సీఎం అని ముడేకరాల భూమి ఇస్తా అని కేసీఆర్ దళితులను మోసం చేశారన్నారు. 

Also Read: రూ.1.7 లక్షల కోట్లతో రూ.10 లక్షల కోట్లు సంపాదిస్తాం.. సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

బీజేపీతో సీక్రెట్ ఒప్పందం

దళితులు ఏ,బీ,సీ,డీ వర్గీకరణ కోరుతున్నా వాటిపై సీఎం కేసీఆర్ మాట్లాడలేదన్నారు. కేసీఆర్ ఇన్నిసార్లు ప్రధానికి కలిసినా ఎప్పుడైనా ఎస్సీలో ఏబీసీడీ వర్గీకరణ గురించి ప్రధాన మోదీని అడిగారా అంటూ కేసీఆర్..దళిత ద్రోహి అని రేవంత్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్  సొంత పార్టీలోనే దళితులకు ప్రాధాన్యత లేదని పార్టీ అధ్యక్ష పదవీ కోసం.. కేసీఆర్ నామినేషన్ వేసే సమయంలో ఒక్క దళితుడు కూడా లేరన్నారు. యూపీ ఎన్నికల్లో బీజేపీకి కేసీఆర్ సహకారం ఉంటుందని, దాని వెనక అంతర్గత ఒప్పందం జరిగిందని కేసీఆర్ పై కేసులు, దాడులు జరగకుండా ఒప్పందం జరిగిందని రేవంత్ ఆరోపించారు. గుజరాత్ ఎన్నికల సమయానికి తెలంగాణ సర్కారును కేసీఆర్ రద్దు చేస్తారన్నారు. సర్కార్ ను నడపాల్సిన సమయంలో పార్టీపై కేసీఆర్ దృష్టి పెట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాలన్నీ ముందస్తు ఎన్నికల కోసమేనని రేవంత్ అన్నారు. 

Also Read: హుజూరాబాద్ లో దళితబంధుకు బ్రేక్.. ఈసీ కీలక ఆదేశాలు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget