(Source: ECI/ABP News/ABP Majha)
Telangana Politics: సిగ్గున్నవారు ఎవరు బీజేపీలో ఉండరు - పొన్నం ప్రభాకర్
Telangana Politics: సిగ్గు ఉన్నోళ్లెవరూ బీజేపీలో ఉండరు అంటూ మాజీ మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశంలో కాంగ్రెస్ లేకుండా చేయాలని బీజేపీ చాలా కుట్రలు చేస్తుందని ఆరోపించారు.
Telangana Politics: బీజేపీతో సహా అన్ని రాజకీయ పార్టీల అంగీకారంతో తెలంగాణ ఏర్పడిందని కరీంనగర్ మాజీ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పార్లమెంట్ ప్రొసీజర్ ఎలా నడుస్తుందో తెలియని ప్రధాని తెలంగాణ బిల్లును తలుపులు మూసి ఆమోదించారని అవమానించారని గుర్తు చేశారు. అందుకే వారికి క్షమాపణలు చెప్పిన తరువాతనే తెలంగాణలో అడుగు పెట్టాలని చెప్పామని ఆయన అన్నారు. సిగ్గున్నవారు ఎవరు బీజేపీలో ఉండరంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. వారు తెలంగాణ డీఎన్ఏ నా కాదా అని పరీక్ష చేసుకోవాలంటూ తీవ్ర విమర్శలు చేశారు. అలాగే దేశంలో కాంగ్రెస్ ను లేకుండా చేయాలని బీజేపీ చూస్తుందంటూ ఆరోపించారు.
కేవలం మిమల్ని ప్రశ్నిస్తూనం అని దేశంలో కాంగ్రెస్ లేకుండా చెయ్యాలి అని చూస్తుంది @BJP4India
— Ponnam Prabhakar (@PonnamLoksabha) November 13, 2022
తెరాస బీజేపీ రెండు పార్టీలు తెలంగాణ ప్రజలను మభ్యపెడుతున్నారు... మొన్నటి వరకు ఢిల్లీలో దోస్తీ చేసి ఇప్పుడు కుస్తీ పడుతున్నట్టు ప్రజలను నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు pic.twitter.com/sQxnUDCGjs
ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభం.. అయిపోయిన పెళ్లికి బాజాలు మోగించినట్టు ఉందంటూ ఎద్దేవా చేశారు. రామగుండం మాత్రమే కాదు ఇంకా 4 ఫ్యాక్టరీలు అప్పటి ప్రభుత్వం పున ప్రారంభానికి 18400 కోట్లు కేటాయించిందని చెప్పారు. ఇది బీజేపీ అజ్ఞానులకు తెలియదా అంటూ ధ్వజమెత్తారు. దేశంలో యూరియా, డీఏపీలు దిగుమతి చేసుకునే అవసరం ఉందన్నారు. ఆరోజు లక్ష కోట్ల సబ్సిడీని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందన్నారు. 8 సంవత్సరాలుగా ఈ దేశంలో ఒక్క ఎరువుల ఫ్యాక్టరీ అయిన ఏర్పాటు చేశారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సిగ్గు ఉన్నొడు ఎవ్వడు బీజేపీ లో ఉండడు !
— Ponnam Prabhakar (@PonnamLoksabha) November 13, 2022
పార్లమెంట్ సాక్షిగా ప్రధాని తెలంగాణ బిల్లు తలుపులు మూసి పాస్ చేశారు అని విమర్శలు చేస్తే దానికి సిగ్గు లేని రాష్ట్ర బీజేపీ నాయకులు మద్దతు తెలుపుతున్నారు - పొన్నం ప్రభాకర్ @INCIndia @manickamtagore @revanth_anumula @kcvenugopalmp pic.twitter.com/VbnFmSL91j
పేదలను దోచుకునే వారిని వదలం అంటున్న ప్రధాని ఈ దేశంలో పేదలను దోచుకుంటున్నది మీరు కాదా అంటూ ప్రశ్నించారు. దేశంలో మీకన్నా పెద్ద దోపిడీ దారులు ఎవరైనా ఉన్నారా అంటూ మండిపడ్డారు. ప్రతిపక్షాలను, ప్రాంతీయ పార్టీలను తినడం వల్ల న్యూట్రిషన్ పెరుగుతుంది కానీ.. మీరంటున్నటు తిట్ల వల్ల కాదని చెప్పుకొచ్చారు. పోర్టులు, ఎయిర్ పోర్టులు ప్రభుత్వ రంగ సంస్థలు అంబాని, ఆధానిలకు అమ్మడం లేదా అని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. కాళేశ్వరం కేసీఆర్ ప్రభుత్వానికి ఏటీఎం అన్నారు.. మరి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. మోడీ వచ్చినప్పుడు వెళ్లి తెలంగాణ హక్కుల కోసం కేసీఆర్ కొట్లాడాల్సిందని చెప్పారు. 8 సంవత్సరాలుగా అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చి.. ఇప్పుడు రాజకీయ దోబూచులాడుతున్నారంటూ విమర్శలు చేశారు. అహ్మదాబాద్ కు బుల్లెట్ ట్రైన్ వేసినట్టు.. హైదరాబాద్ నుండి ఢిల్లీకి బుల్లెట్ ట్రైన్ వేయించడని అన్నారు.