(Source: ECI/ABP News/ABP Majha)
Telangana Police: తెలంగాణలో డ్రగ్స్ పై ఉక్కుపాదం - యాాంటీ నార్కోటిక్స్ విభాగానికి ఎస్పీ నియామకం
Hyderabad News: రాష్ట్రంలో మరో ముగ్గురు ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. మాదకద్రవ్యాల వినియోగంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించింది. యాంటీ నార్కోటిక్స్ విభాగానికి ఎస్పీని నియమించింది
IPS Transfers: తెలంగాణ(Telangana) రాష్ట్రంలో డ్రగ్స్ పూర్తిగా నిర్మూలించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సీఎం రేవంత్ రెడ్డి సీఎంగా తొలి సమీక్షలోనే దీనిపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అందులో భాగంగానే రాష్ట్రంలో పెద్దఎత్తున దాడులు నిర్వహించి మాదకద్రవ్యాలను పట్టుకుంటున్నారు. తాజాగా ర్యాడిసన్ బ్లూ హోటల్‌లో డ్రగ్స్ సేవిస్తూ కొందరు పట్టుబడటంతో ప్రభుత్వం మరింత దృష్టి సారించింది. యాంటీనార్కోటిక్స్ బ్యూరో విభాగానికి కొత్త ఎస్పీ(SP)ని నియమించింది..
ఐపీఎస్‌ల బదిలీ
తెలంగాణ(Telangana) లో సివిల్ సర్వీస్ ఉద్యోగుల బదిలీలు కొనసాగుతున్నాయి. మరో ముగ్గురు ఐపీఎస్(IPS) అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. హైదరాబాద్(HYD) కమిషన్‌రేట్‌లో అదనపు కమిషనర్‌గా పనిచేస్తున్న విశ్వప్రసాద్‌ను ఐజీగా బదిలీ చేయగా...హైదరాబాద్ అదనపు కమిషనర్‌గా పనిచేస్తున్న ఏవీ రంగనాథ్‌ను ఐజీగా బదిలీ చేశారు. హైదరాబాద్ మధ్య మండలం డీసీపీగా పనిచేస్తున్న శరత్ చంద్రపవార్‌ను యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఎస్పీగా నియమించారు. హైదరాబాద్‌లో మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాడిసన్ బ్యూ హోటల్‌లో మాదకద్రవ్యాలు సేవిస్తూ కొందరు పట్టుబడటం, వారిలో ఆ హోటల్ యజమాని కుమారుడే ఉండటం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ హోటల్ యజమాని ఓ జాతీయ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. ఈ పరిస్థితుల్లో యాంటీ నార్కొటిక్స్ విభాగానికి కొత్త ఎస్పీ అపాయింట్ కావడం చర్చనీయాంశమైంది.
యాంటీ నార్కొటిక్స్ విభాగం బలోపేతం
యాంటీ నార్కొటిక్స్ విభాగం బలోపేతం దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మెట్రోనగరం హైదరాబాద్ లో లెక్కకు మిక్కిలి పబ్ లతోపాటు శివారు ప్రాంతాల్లో జరిగే రేవ్ పార్టీల్లో విచ్చలవిడిగా మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి. ముఖ్యంగా యువత వీటికి బానిసలైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అలాగే బడిపిల్లలకు సైతం చాక్లెట్ల రూపంలో ఉండే మత్తు పదార్థాలను సైతం యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. మరీ ముఖ్యంగా అమ్మాయిలు వీటికి బానిసలైపోతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రగ్స్ పూర్తిగా నిర్మూలించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. నగరంలో మత్తు పదార్థాలన్న మాటే వినిపించరాదని గట్టిగా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు ఏకంగా ఆ విభాగానికి ఎస్పీని నియమించడంతో మత్తుపదార్థాల అక్రమరవాణాదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇటీవల మోయినాబాద్ లో ఓ ఫాంహౌస్ లో జరిగిన రేవ్ పార్టీకి నగరంలో పలుకుబడి ఉన్న పెద్దల పిల్లలు చేసిన హంగామా సంచలన రేకెత్తించింది. వారం రోజుల క్రితమే యూట్యూబర్ ఇంట్లోనే మత్తుపదార్థాలు దొరకడం కలకలం రేపాయి. ఇప్పుడు రాడిసన్ బ్లూ హోటల్లో ఏకంగా ఓ ప్రజాప్రతినిధి కుమారుడే మత్తు పదార్థాలతో పార్టీ ఇవ్వడం చూస్తే హైదరాబాద్ లో చాక్లెట్ల కన్నా ఈజీగా మత్తుపదార్థాలు దొరుకుతున్నాయని అర్థమవుతోంది. ఇక గంజాయి అక్రమ రవాణా సంగతి చెప్పనక్కర్లేదు. సరిహద్దుల్లో ఎంత నాకాబందీ ఏర్పాటు చేసినా..ఏదో రూపంలో గంజాయి నగరంలోకి వస్తూనే ఉంది. వీటన్నింటినీ అరికట్టడానికి యాంటీనార్కోటిక్స్ విభాగాన్ని మరింత పటిష్టం చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మత్తుపదార్థాల సరఫరాలో ఎంతటి వారు ఉన్నా వదిలొద్దని స్పష్టం చేశారు.