అన్వేషించండి

Telangana News: తెలంగాణలో విస్తృతంగా వర్షాలు, ఊపందుకున్న వ్యవసాయ పనులు 

Telangana News: ఎట్టకేలకు వానలు ప్రారంభం కావడంతో అన్నదాతలు అప్రమత్తమయ్యారు. వరినార్లు పోస్తూ వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు. 

Telangana News: వానా కాలం ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని కళ్లల్లో వత్తులేసుకొని చూసిన అన్నదాతలకు.. కాస్త ఆలస్యమైనా వరుణ దేవుడు కరుణించాడు. ఎట్టకేలకు వర్షాలు పడుతుండడంతో నారు మడులు సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. సాధారణంగా మే మూడో వారంలోనే నారు పోయడం, తర్వాత నెల రోజులకు నాట్లు వేయడం అందరూ చేసే పనే. కానీ ఈసారి నైరుతి రుతు పవనాల రాక కాస్త ఆలస్యం అవడంతో.. జూన్ నాలుగో వారంలో వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, వరంగల్, హన్మకొండ, ములుగు, భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట, మెదక్, వనపర్తి, నాగర్ కర్నూల్, సంగారెడ్డి జిల్లాల్లో ఇప్పటికే నార్లు పోశారు. 

గత వారం రోజుల్లోనే దాదాపు 30 శాతం వరినార్లు పూర్తి అయినట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. సాగునీరు అందుబాటులో ఉన్న రైతులు ఇప్పటికే నారు సిద్ధం చేసుకోగా... మరో వారం, పది రోజుల్లో నాట్లు మొదలు పెట్టొచ్చని అంచనా వేస్తున్నారు. సీజన్ ఆలస్యంగా ప్రారంభం కావడంతో ఈ వర్షాకాలంలో 120 రోజుల కంటే తక్కువ సమయంలో పండే స్వల్ప కాలిక రకాలను సాగు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచిస్తున్నారు. ఈ మేరకే కూనారం సన్నాలు, కూనారం 1638, బతుకమ్మ, వరంగల్ 962, ఆర్ఎస్ఆర్ 21278, ఆర్ఎస్ఆర్  29325, జగిత్యాల 1798, తెలంగాణ సోనా, ఎంటీయూ 1010, జగిత్యాల 24423, ఐఆర్ 64, హెచ్ఎంటీ సోనా వంటి స్వల్ప కాలిక వంగడాలనే అధిక శాతం రైతులు నారు పోశారు. మరోవైపు పత్తి, మొక్కజొన్న, కంది, సోయాబీన్, విత్తనాలు నాే ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. 

ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో నేడు వర్షాలు

ఈ రోజు అల్పపీడనం ఉత్తర ఇంటీరియర్ ఒడిశా, పరిసరాలలోని దక్షిణ జార్ఖండ్ & ఉత్తర ఛత్తీస్ గఢ్ వద్ద కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. దీనికి అనుబంధంగా ఉన్న ఆవర్తనము సగటు సముద్ర మట్టం నుండి 7.6 కిలో మీటర్ల వరకు కొనసాగుతుందని చెప్పారు. ఈ వాతావరణ పరిస్థితుల వల్ల తెలంగాణ రాష్ట్రంలో  తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు  ఈ రోజు, రేపు కొన్ని చోట్ల ఎల్లుండి అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు మరియు మెరుపులతో  కూడిన  వర్షములు  ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాలలో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది.  ఈ రోజు భారీ వర్షాలు  రాష్ట్రంలో ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ  వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు భారీ వర్షాలు కొమరం భీమ్, మంచిర్యాల, కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.

హైదరాబాద్ లో ఇలా
‘‘ఆకాశం పాక్షికంగా మేఘావృతంగా ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 22 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు నైరుతి దిశ నుంచి గాలి వేగం గంటకు 6 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 30.8 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 24.5 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 80 శాతంగా నమోదైంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Manchu Family Issue: మంచు ఫ్యామిలీలో చల్లారని వివాదం- మరోసారి పోలీస్‌స్టేషన్‌కు మనోజ్‌
మంచు ఫ్యామిలీలో చల్లారని వివాదం- మరోసారి పోలీస్‌స్టేషన్‌కు మనోజ్‌
Telangana Latest News : తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
AP CM Chandra Babu: పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
ఏపీలో పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
MLC Kavitha Tour: జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Manchu Family Issue: మంచు ఫ్యామిలీలో చల్లారని వివాదం- మరోసారి పోలీస్‌స్టేషన్‌కు మనోజ్‌
మంచు ఫ్యామిలీలో చల్లారని వివాదం- మరోసారి పోలీస్‌స్టేషన్‌కు మనోజ్‌
Telangana Latest News : తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
AP CM Chandra Babu: పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
ఏపీలో పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
MLC Kavitha Tour: జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
PV Sindhu Meets Pawan Kalyan: సార్‌, పెళ్లికి రండీ! డిప్యూటీ సీఎం పవన్‌ను ఆహ్వానించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు
సార్‌, పెళ్లికి రండీ! డిప్యూటీ సీఎం పవన్‌ను ఆహ్వానించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు
Upcoming 5G Smartphones: వచ్చే వారం మార్కెట్లోకి మూడు బడ్జెట్ ఫోన్లు - రూ.9 వేలలోపే 5జీ మొబైల్ కూడా!
వచ్చే వారం మార్కెట్లోకి మూడు బడ్జెట్ ఫోన్లు - రూ.9 వేలలోపే 5జీ మొబైల్ కూడా!
Allu Arjun Meets Chiranjeevi: బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
Embed widget