అన్వేషించండి

Telangana Elections 2023: 'తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం' - సీఎం కేసీఆర్ భూదందాలకు పాల్పడ్డారని ఈటల సంచలన వ్యాఖ్యలు

Telangana Elections 2023: సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ భూదందాలకు పాల్పడ్డారని, బీఆర్ఎస్ హయాంలో ఆ పార్టీ కార్యకర్తలకే లబ్ధి జరిగిందని ఆరోపించారు.

Telangana Elections 2023: సీఎం కేసీఆర్ పాలనతో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. హైదరాబాద్ లో సోమవారం మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలకే 'బీసీ బంధు' దక్కిందని, కేసీఆర్ పాలనలో దళితులు, బీసీలు, రైతులు ఎవరూ సంతోషంగా లేరని విమర్శించారు. సీఎం భూ దందాలకు పాల్పడుతున్నారని, అసైన్డ్, ప్రభుత్వ భూములు అమ్ముకుంటున్నారని, రూ.లక్షల కోట్లు అప్పులు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వమే స్వయంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ధ్వజమెత్తారు. కొందరు బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని విమర్శిస్తున్నాని, అవి రెండూ ఒక్కటైతే తాను గజ్వేల్ లో ఎందుకు పోటీ చేస్తానని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ను గద్దె దించడం ఒక్క బీజేపీకే సాధ్యమని, తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే కమలం పార్టీ అధికారంలోకి రావాలని ఈటల అన్నారు.

'సీఎం కేసీఆర్ విఫలం'

ప్రత్యేక రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో సీఎం కేసీఆర్ సంపూర్ణంగా విఫలమయ్యారని ఈటల విమర్శించారు. కేసీఆర్ తనను తాను ఎక్కువగా ఊహించుకుంటారని, వాస్తవాలు, నిజాలు తెలుసుకోవడానికి ఇష్టపడరని అన్నారు. కాళ్ల కింద భూమి కదులుతోన్న విషయాన్ని సీఎం గ్రహించడం లేదని, రియల్ ఎస్టేట్ వ్యాపారిలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 

'30 వేల మంది కేసీఆర్ బాధితులు'

హైదరాబాద్ నగరం చుట్టుపక్కల 5,800 ఎకరాల భూమిని అభివృద్ధి పేరిట అతి చౌక ధరలకు కేసీఆర్ కుటుంబం తీసుకుందని, ఒక్క గజ్వేల్ లోనే 30 వేల మంది కేసీఆర్ బాధితులున్నారని ఈటల ఆరోపించారు. కేసీఆర్ అడుగులకు మడుగులు వత్తే వారికే బీసీ బంధు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో  కలిసి పని చేసిన చరిత్ర కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ఉందని, ఈ 2 పార్టీలు కలిసి బీజేపీపై విష ప్రచారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ను నిలువరించే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని, హుజూరాబాద్ ఫలితమే గజ్వేల్ లోనూ రిపీట్ అవుతుందని ఈటల ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం నామినేషన్ వేయనున్నట్లు ఈటల తెలిపారు.

ప్రచారంలో 40 మంది నేతలు

మరోవైపు, తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారానికి ఆ పార్టీ ముఖ్య నేతలు రాష్ట్రానికి రానున్నారు. ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్ తదితరులు ప్రచారం నిర్వహించనున్నారు. మొత్తం 40 మంది నేతలు ప్రచారంలో పాల్గొననున్నట్లు బీజేపీ ప్రకటించింది.

అటు, ఈ నెల 7న హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో బీసీ ఆత్మ గౌరవ సభకు ప్రధాని మోదీ హాజరు కానున్నారు. ఈ సభకు తెలంగాణ ముఖ్య నేతలు సహా, జనసేనాని పవన్ కల్యాణ్ సైతం హాజరు కానున్నారు. ఇప్పటికే సభకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు బీజేపీ నేతలు తెలిపారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు.  

Also Read: హైదరాబాద్‌ ఓటర్లకు క్యూలైన్‌ అప్‌డేట్స్‌-ఓటింగ్‌ పెంచేందుకు కొత్త విధానం

టాప్ హెడ్ లైన్స్

Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
LPG Lite Instant Cylinder: విశాఖలో భారత్ గ్యాస్ 'జిప్ సిలిండర్' ప్రారంభం.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ!
విశాఖలో భారత్ గ్యాస్ 'జిప్ సిలిండర్' ప్రారంభం.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Embed widget