Telangana New Minister List : తెలంగాణ మంత్రులుగా 11మందికి ఛాన్స్- డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క
Telangana Cabinet Ministers List 2023: తెలంగాణలో కొత్త మంత్రుల జాబితాను గవర్నర్‌కు కాంగ్రెస్ అందజేసింది. అందరికీ ఫోన్లు చేసి ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వించారు.

Telangana Cabinet Ministers List 2023: ఉత్కంఠకు తెరవీడి. తెలంగాణ మంత్రివర్గంలో చోటు ఎవరికో ప్రస్తుతానికి క్లారిటీ వచ్చింది. తెలంగాణ కొత్త మంత్రివర్గంలో ఉత్తమ్‌కుమార్(Uttam Kumar), శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivasa reddy), భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ జూపల్లి కృష్ణారావుకు రేవంత్ రెడ్డి చోటు కల్పించారు. డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్కకు అవకాశం ఇచ్చారు. మంత్రివర్గ జాబితాలో ఉన్న వారికి స్వయంగా రేవంత్ ఫోన్ చేశారు. అలాగే, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ ఠాక్రే సైతం కాబోయే మంత్రులకు ఫోన్ చేసి వివరాలు తెలిపారు. కాబోయే మంత్రుల వివరాలను రాజ్ భవన్ కు రేవంత్ తెలియజేశారు. ఆయనతో పాటు వీరు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరికి ఏ శాఖలో కేటాయిస్తారో అనేది ఆసక్తిగా మారింది. ఇంకా ఆరుగురికి మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుండగా, వారు ఎవరనేది ఉత్కంఠగా మారింది.
మంత్రివర్గ కూర్పుపై తీవ్ర కసరత్తు
మంత్రి వర్గ కూర్పుపై ఢిల్లీలో రేవంత్ రెడ్డి తీవ్ర కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. తొలుత కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ అయిన రేవంత్ రెడ్డి తిరుగుపయనమవుతుండగా, మళ్లీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. ఈ క్రమంలో మళ్లీ పార్టీ పెద్దలతో భేటీ అయి మంత్రి వర్గ కూర్పుపై తీవ్ర కసరత్తు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ నేతలందరికీ న్యాయం చేస్తామని అధిష్టానం ప్రకటించిన నేపథ్యంలో మంత్రి వర్గంలో చోటు దక్కని వారికి ఎమ్మెల్సీలుగా, నామినేటెడ్ పదవుల్లో నియమించే అవకాశం ఉంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

