అన్వేషించండి

Telangana Municipal Elections 2026 Results: తొలి విజయం బీఆర్ఎస్‌దే.. గడ్డపోతారంలో ఎగిరిన గులాబీ జెండా

Gaddapotharam Municipality | తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో తొలి విజయం బీఆర్ఎస్‌ పార్టీ సాధించింది. సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది.

 

BRS vs Congress | గడ్డపోతారం: తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్ (BRS) పార్టీ బోణీ కొట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా, సంగారెడ్డి జిల్లాలోని గడ్డపోతారం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించి తొలి ఫలితాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక్కడ అధికార కాంగ్రెస్ పార్టీపై స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శిస్తూ బీఆర్ఎస్ దూసుకుపోయింది.

 

సంగారెడ్డి జిల్లాలోని గడ్డపోతారం మున్సిపాలిటీలోని మొత్తం 18 వార్డులకు గాను బీఆర్ఎస్ పార్టీ ఏకంగా 14 వార్డుల్లో విజయం సాధించి ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. ఇక అధికార కాంగ్రెస్ పార్టీ కేవలం మూడు స్థానాలకు మాత్రమే పరిమితం కాగా, ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి (ఇతరులు) విజయం సాధించారు. మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవడంతో గడ్డపోతారం మున్సిపల్ పీఠంపై గులాబీ జెండా ఎగిరింది. ఈ గెలుపుతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ 16న గడ్డపోతారం మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నికలు నిర్వహిస్తారు.

హోరాహోరీగా మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు..

 ఫిబ్రవరి 11న తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ నేడు (ఫిబ్రవరి 13, 2026) ఉదయం 8 గంటలకు మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 116 పురపాలికలు మరియు 7 నగరపాలక సంస్థల్లోని మొత్తం 2,981 వార్డులు/డివిజన్లకు సంబంధించి 123 కేంద్రాల్లో మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు. అనంతరం సాధారణ బ్యాలెట్ పేపర్ల లెక్కింపు చేపట్టారు. ఓట్ల లెక్కింపులో పారదర్శకత కోసం ప్రతి టేబుల్ వద్ద వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేయగా, భద్రత దృష్ట్యా లెక్కింపు కేంద్రాల పరిధిలో 144 సెక్షన్‌ సైతం అమలు చేస్తున్నారు.

ప్రస్తుత సమాచారం ప్రకారం, అధికార కాంగ్రెస్ పార్టీ మెజారిటీ పలు మున్సిపాలిటీల్లో ఆధిక్యతను కనబరుస్తుండగా, ప్రతిపక్ష బీఆర్ఎస్ (BRS) సైతం గట్టి పోటీనిస్తోంది. సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ తొలి విజయాన్ని నమోదు చేసి బోణీ కొట్టింది. మరోవైపు, మధ్యాహ్నం 12 గంటల లోపు మెజారిటీ పురపాలికల తుది ఫలితాలు వచ్చే అవకాశం ఉండగా, నగరపాలక సంస్థల (Corporations) ఫలితాలు సాయంత్రం లోపు వెలువడనున్నాయని అధికారులు తెలిపారు. కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ వంటి ప్రధాన నగరాల్లో ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో అక్కడ ఫలితాల వెల్లడికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Deputy CM Pawan Dissatisfaction: డిప్యూటీ సీఎం అప్‌సెట్.. ?ఆ పోలీస్ బాస్‌తో ఏం చెప్పారు..?
డిప్యూటీ సీఎం అప్‌సెట్.. ?ఆ పోలీస్ బాస్‌తో ఏం చెప్పారు..?
Jagtial Emotional Friendship Story: నిజాయితీకి నిలువెత్తు రూపం! 25 ఏళ్ల నాటి అప్పు తీర్చేందుకు కేరళ నుంచి తెలంగాణ కొచ్చిన ఇస్మాయిల్!
నిజాయితీకి నిలువెత్తు రూపం! 25 ఏళ్ల నాటి అప్పు తీర్చేందుకు కేరళ నుంచి తెలంగాణ కొచ్చిన ఇస్మాయిల్!
CM Revanth Reddy Khammam Sabha: కాచుకో కేసీఆర్! 2029లో 182 సీట్లు.. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం - సీఎం రేవంత్ రెడ్డి సంచలన జోస్యం!
కాచుకో కేసీఆర్! 2029లో 182 సీట్లు.. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం - సీఎం రేవంత్ రెడ్డి సంచలన జోస్యం!
Breaking News: 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy Khammam Sabha: కాచుకో కేసీఆర్! 2029లో 182 సీట్లు.. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం - సీఎం రేవంత్ రెడ్డి సంచలన జోస్యం!
కాచుకో కేసీఆర్! 2029లో 182 సీట్లు.. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం - సీఎం రేవంత్ రెడ్డి సంచలన జోస్యం!
Akhil Akkineni : తండ్రి కాళ్లపై పడిన హీరో అఖిల్ - అయ్యగారితో కింగ్ ఎమోషనల్ మూమెంట్
తండ్రి కాళ్లపై పడిన హీరో అఖిల్ - అయ్యగారితో కింగ్ ఎమోషనల్ మూమెంట్
Kagaznagar Thief Caught: ఇంత అమాయకంగా దొంగతనం చేస్తారా? అడ్డంగా దొరికాక ఒళ్లు హూనం కాకుండా ఉంటుందా?
ఇంత అమాయకంగా దొంగతనం చేస్తారా? అడ్డంగా దొరికాక ఒళ్లు హూనం కాకుండా ఉంటుందా?
Double Occupancy OTT : పగలు అమ్మాయి... రాత్రి అబ్బాయి - ఓటీటీలోకి సడన్‌గా తమిళ రొమాంటిక్ కామెడీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
పగలు అమ్మాయి... రాత్రి అబ్బాయి - ఓటీటీలోకి సడన్‌గా తమిళ రొమాంటిక్ కామెడీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
Roshan Kanakala : సుమ కొడుకు రోషన్ సరికొత్త ప్రయోగం - సైన్స్ ఫిక్షన్ జానర్... స్పెషాలిటీ ఏంటంటే?
సుమ కొడుకు రోషన్ సరికొత్త ప్రయోగం - సైన్స్ ఫిక్షన్ జానర్... స్పెషాలిటీ ఏంటంటే?
Breaking News: 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
Supreme Court Litigant Hurls Abuses Judges: సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
Youtuber Ravan: యూట్యూబర్ రావణ్‌ తరఫున వాదిస్తున్న పొన్నవోలు సుధాకర్! వైసీపీతో సంబంధం లేదని వివరణ!
యూట్యూబర్ రావణ్‌ తరఫున వాదిస్తున్న పొన్నవోలు సుధాకర్! వైసీపీతో సంబంధం లేదని వివరణ!
Embed widget