అన్వేషించండి

Telangana Municipal Elections 2026 Results: మధ్యాహ్నం 3 వరకు 65 మున్సిపాలిటీల ఫలితాలు వెల్లడి, కాంగ్రెస్‌దే హవా

Telangana Municipal Elections 2026 Results LIVE Updates: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు శుక్రవారం మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి.  ఓట్ల లెక్కింపులో భాగంగా మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తారు.

LIVE

Key Events
Telangana Municipal Elections Results 2026 LIVE Updates TS Local Body Election Vote Counting Winners Ward Wise Party Wise Latest News Telangana Municipal Elections 2026 Results: మధ్యాహ్నం 3 వరకు 65 మున్సిపాలిటీల ఫలితాలు వెల్లడి, కాంగ్రెస్‌దే హవా
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు లైవ్ అప్ డేట్స్
Source : x.com

Background

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 7 నగరపాలక సంస్థలు, 116 పురపాలికలకు జరిగిన ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ఎన్నికల సంఘం అత్యంత పారదర్శకమైన విధానాలను అవలంబించింది. మొత్తం ఏడు నగరపాలక సంస్థలు, 116 మున్సిపాలిటీల్లో శాంతియుత వాతావరణంలో ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహించిన అధికారులు ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు చేపట్టారు. పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులను అత్యంత భద్రతతో కూడిన స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించి, అక్కడ నిరంతరం సీసీ కెమెరాల నిఘా, వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ కొనసాగించారు.

శాస్త్రీయమైన ఓట్ల లెక్కింపు విధానం

ఓట్ల లెక్కింపు ప్రక్రియను గందరగోళం లేకుండా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఒక ప్రత్యేకమైన విధానాన్ని రూపొందించింది. లెక్కింపు రోజున ఉదయం 8 గంటలకు తొలుత పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత సాధారణ బ్యాలెట్ పేపర్ల లెక్కింపు మొదలవుతుంది. ప్రతి వార్డుకు సంబంధించిన బ్యాలెట్లను బాక్సుల నుంచి తీసి, ముందుగా 25 చొప్పున కట్టలుగా కడతారు. అనంతరం ఒక వార్డులోని అన్ని పోలింగ్ కేంద్రాల కట్టలను ఒక పెద్ద డ్రమ్ములో వేసి పూర్తిగా కలపడం ఈ ప్రక్రియలో అత్యంత కీలకమైన అంశం. దీనివల్ల ఏ గ్రామంలో లేదా ఏ బూత్‌లో ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయనేది తెలియదు. 

రౌండ్ల వారీగా ఫలితాల ప్రకటన

ప్రతి రౌండ్‌లో డ్రమ్ నుంచి 1,000 బ్యాలెట్లను తీసి లెక్కింపు టేబుళ్లకు పంపిస్తారు. అభ్యర్థుల వారీగా ఓట్లను వర్గీకరించడానికి ప్రత్యేక కంపార్ట్‌మెంట్‌లు ఉన్న చెక్క ట్రేలను ఉపయోగిస్తారు. ప్రతి అభ్యర్థికి వచ్చిన 100 ఓట్లను ఒక కట్టగా కట్టి, లెక్కింపు షీట్‌లో నమోదు చేస్తారు. ప్రతి రౌండ్ ముగిసిన తర్వాత అభ్యర్థుల వారీగా వచ్చిన ఓట్ల వివరాలను ఏజెంట్ల సమక్షంలో ధ్రువీకరించి, తుది ఫలితాలను ప్రకటిస్తారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించకుండా కఠిన నియమాలు అమలు చేస్తారు. ఈ శాస్త్రీయమైన లెక్కింపు విధానం ఫలితాల విషయంలో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా జరిగేలా చేస్తుంది.

తెలంగాణలోని ఏడు నగరపాలక సంస్థలు, మరియు 116 పురపాలికల్లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 73.01 శాతం ఓటింగ్ నమోదైంది. 

  • మొత్తం ఓటర్లు: సుమారు 52.17 లక్షలు.

  • పోలైన ఓట్లు: సుమారు 38.09 లక్షలు.

  • పురపాలికల్లో ఓటింగ్: 75.88% (నగరాల కంటే పట్టణాల్లో ఓటింగ్ అధికంగా ఉంది).

  • నగరపాలక సంస్థల్లో ఓటింగ్: 66.05% (కార్పొరేషన్ పరిధిలో ఓటింగ్ శాతం తక్కువగా నమోదైంది).

అత్యధిక ఓటింగ్: యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మున్సిపాలిటీ 91.91 శాతంతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది.

అత్యల్ప ఓటింగ్: నల్గొండ జిల్లాలోని నందికొండ మున్సిపాలిటీలో అత్యల్పంగా 59.68 శాతం ఓట్లు పడ్డాయి.

కార్పొరేషన్లలో: నగరపాలక సంస్థల్లో నల్గొండ అత్యధికంగా 77.36 శాతం ఓటింగ్‌ను నమోదు చేయగా, నిజామాబాద్ 59.12 శాతంతో అత్యల్పంగా నిలిచింది.

18:10 PM (IST)  •  13 Feb 2026

Telangana Municipal Elections 2026 Results:ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏ పార్టీ ఎన్ని మున్సిపాలిటీలు గెలుచుకుంది?

Telangana Municipal Elections 2026 Results:ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 19 మున్సిపాలిటీల లెక్కింపు పూర్తి అయ్యింది. తుది ఫలితాలు వచ్చిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీ సంగారెడ్డి, సదాశివపేట ఆందోల్‌- జోగిపేట, నారాయణఖేడ్‌, రామాయంపేట, హస్నాబాద్‌ను గెలుచుకుంది. బీఆర్‌ఎస్‌ తూప్రాన్, గడ్డపోతాం, దుబ్బాక, చెర్యాల, గుమ్మడిదల, గజ్వేల్‌ మున్సిపాలిలీటలను కైవశం చేసుకుంది. జహీరాబాద్, ఇస్నాపూర్‌, కోహిర్‌, ఇంద్రేశం, జిన్నారం, మెదక్, నర్సాపూర్‌ మున్సిపాలిటీల్లో హంగ్‌ ఏర్పడింది. 

15:29 PM (IST)  •  13 Feb 2026

మధ్యాహ్నం 3 వరకు 65 మున్సిపాలిటీల ఫలితాలు వెల్లడి, కాంగ్రెస్‌దే హవా

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో భాగంగా మధ్యాహ్నం 3 వరకు 65 మున్సిపాలిటీల ఫలితాలు వెల్లడయ్యాయి.  కాంగ్రెస్‌ 39 చోట్ల, బీఆర్ఎస్ 7 చోట్ల గెలుపొందాయి. ఫార్వర్డ్ బ్లాక్ ఓ చోట నెగ్గగా, 18 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది.

Load More
New Update
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

GodavariPushkaralu 2027: గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు! 2027లో ప్రారంభం, తెలంగాణ బ్రాండ్ ప్రతిబింబించేలా ఏర్పాట్లు
గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు! 2027లో ప్రారంభం, తెలంగాణ బ్రాండ్ ప్రతిబింబించేలా ఏర్పాట్లు
MLAs Disqualification Petitions: దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు భారీ ఊరట.. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ - బీఆర్ఎస్ ఆగ్రహం
దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు భారీ ఊరట.. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ - బీఆర్ఎస్ ఆగ్రహం
Telangana Politics: బీఆర్ఎస్‌ను మించి గ్రౌండ్ పాలిటిక్స్‌లో కవిత దూకుడు - క్యాడర్, లీడర్‌ను ఆకర్షిస్తారా?
బీఆర్ఎస్‌ను మించి గ్రౌండ్ పాలిటిక్స్‌లో కవిత దూకుడు - క్యాడర్, లీడర్‌ను ఆకర్షిస్తారా?
Velugumatla Issue: వెలుగుమట్ల నిర్వాసితులకు సర్కారు తీపి కబురు! ఇందిరమ్మ ఇళ్లు, పట్టాల పంపిణీకి సిద్ధం!
వెలుగుమట్ల నిర్వాసితులకు సర్కారు తీపి కబురు! ఇందిరమ్మ ఇళ్లు, పట్టాల పంపిణీకి సిద్ధం!
Advertisement

వీడియోలు

Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్
ICC Penalizes Arshdeep After T20 World Cup Final | అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ వేటు
Shahid Afridi praises Team India | భారత జట్టుపై షాహిద్ అఫ్రిదీ ప్రశంసలు
BCCI Reward for T20 World Cup Champions | టీమిండియాపై బీసీసీఐ కాసుల వర్షం
Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kerala Assembly Elections 2026: కేరళ కాంగ్రెస్‌లో సీఎం సెగ - వేణుగోపాల్ రాకతో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు!
కేరళ కాంగ్రెస్‌లో సీఎం సెగ - వేణుగోపాల్ రాకతో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు!
Kavuri Sambasivarao Passes Away: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత
Telangana Politics: బీఆర్ఎస్‌ను మించి గ్రౌండ్ పాలిటిక్స్‌లో కవిత దూకుడు - క్యాడర్, లీడర్‌ను ఆకర్షిస్తారా?
బీఆర్ఎస్‌ను మించి గ్రౌండ్ పాలిటిక్స్‌లో కవిత దూకుడు - క్యాడర్, లీడర్‌ను ఆకర్షిస్తారా?
Sandigdham: విడుదలకు 'సందిగ్ధం'... క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎందరున్నారో చూశారా?
విడుదలకు 'సందిగ్ధం'... క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎందరున్నారో చూశారా?
Andhra Pradesh alliance Politics: ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
Hyundai Verna 2026 వెర్షన్ వచ్చేసింది - కొత్త డిజైన్, అదనపు సేఫ్టీ ఫీచర్లు
2026 హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ లాంచ్‌ - పాత మోడల్‌తో పోలిస్తే ఏం మారింది?
Velugumatla Issue: వెలుగుమట్ల నిర్వాసితులకు సర్కారు తీపి కబురు! ఇందిరమ్మ ఇళ్లు, పట్టాల పంపిణీకి సిద్ధం!
వెలుగుమట్ల నిర్వాసితులకు సర్కారు తీపి కబురు! ఇందిరమ్మ ఇళ్లు, పట్టాల పంపిణీకి సిద్ధం!
Iran War Updates: గల్ఫ్ సంక్షోభం - తెలుగు వారి సురక్షిత తరలింపునకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాచరణ
గల్ఫ్ సంక్షోభం - తెలుగు వారి సురక్షిత తరలింపునకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాచరణ
Embed widget