అన్వేషించండి

Telangana Municipal Elections: కేసీఆర్ అరెస్టుకు కాంగ్రెస్, బీజేపీ నేతలు డిమాండ్.. చర్యలు తీసుకునేది రాష్ట్రమా, కేంద్రమా ?

Telangana Municipal Elections 2026: కేంద్రం అరెస్ట్ చేయకుండా కేసీఆర్‌ను కాపాడుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర సీఎం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

Telangana Political War: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తోంది. మాజీ సీఎం కేసీఆర్ అరెస్ట్ అంశం మున్సిపల్ ఎన్నికల్లో హాట్ టాపిక్ అవుతోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భాజపా, బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అరెస్టు అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. చేతిలో అధికారం ఉండి తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్‌ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని బాల్ రేవంత్ రెడ్డి కోర్టులోకి నెట్టారు.

కిషన్ రెడ్డి డిమాండ్లు, ప్రశ్నలు: మాజీ సీఎం కేసీఆర్‌పై చర్యలు తీసుకోవడానికి రేవంత్ రెడ్డిని ఎవరు అడ్డుకుంటున్నారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ అని, చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిదేనని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రికి చేతగాక, తన బాధ్యతారాహిత్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే కేంద్రంపై, తనపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌పై చర్యలు తీసుకోవాలని ఏ రోజైనా రాహుల్ గాంధీ ఆదేశించారా అని ఆయన నిలదీశారు. సోనియా గాంధీ కుటుంబం, కేసీఆర్ కుటుంబం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అడ్డుకోవడానికి లోపాయికారీగా ఏకమయ్యాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. కిషన్‌రెడ్డిని అడ్డుపెట్టుకుని రేవంత్ రెడ్డి ఎక్కువ రోజులు తప్పించుకోలేరని ఆయన హెచ్చరించారు.

రేవంత్ రెడ్డి 'ఫెవికాల్ బంధం' వ్యాఖ్యలు

ఇటీవల నిజామాబాద్ జిల్లా బర్దిపూర్‌లో నిర్వహించిన 'ప్రజా పాలన-ప్రగతి బాట' బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ, బీఆర్ఎస్‌లపై విరుచుకుపడ్డారు. ఈ రెండు పార్టీల మధ్య ఉన్నది ఫెవికాల్ బంధం అని ఆయన అభివర్ణించారు. కేసీఆర్, కేటీఆర్‌లను అరెస్టు చేయకుండా కేంద్ర ప్రభుత్వం, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కాపాడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో కిషన్ రెడ్డిని ఉద్దేశించి కల్వకుంట్ల కిషన్ రావు అంటూ ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని చెప్పిన బీజేపీ, ఆ కేసులో సీబీఐ విచారణను ఎందుకు ముందుకు తీసుకెళ్లడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

మున్సిపల్ ఎన్నికల ముంగిట మాటల తూటాలు

రానున్న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలలో బీజేపీ, బీఆర్ఎస్‌లకు ఓటు వేయడం అంటే ఆ ఓటును మూసీ నదిలో వేసినట్లేనని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తప్పు చేసినట్లు తేలితే కనుక కేసీఆర్, కేటీఆర్‌ల అరెస్ట్ తప్పదన్నారు. అయితే కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగించినా.. కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని, ఆ పార్టీల మధ్య చీకటి ఒప్పందాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. కేంద్రం విచారణ చేపట్టి కేసీఆర్ అవినీతిని బయటపెట్టి అరెస్ట్ చేస్తుందనే కాళేశ్వరం ప్రాజెక్టు కేసును సీబీఐకి అప్పగించినట్లు రేవంత్ పేర్కొన్నారు.

అటు కిషన్ రెడ్డి సైతం స్పందిస్తూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కేవలం మజ్లిస్ పార్టీని ప్రసన్నం చేసుకోవడానికే రాజకీయాలు చేస్తున్నాయని, ప్రజలు ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మొత్తానికి, కేసీఆర్ అరెస్టు అంశం కేంద్ర బిందువుగా మారి తెలంగాణ రాజకీయాల్లో ముక్కోణపు పోటీని రక్తికట్టిస్తోంది. ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఈ వ్యక్తిగత విమర్శలు ఓటర్లను ఏ మేరకు ప్రభావితం చేస్తాయో చూడాలి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 2027 డిసెంబర్ 9లోపు ఉస్మానియా, అల్వాల్‌, ఎల్బీనగర్‌, వరంగల్‌ ఆస్పత్రులు పూర్తి: సీఎం రేవంత్ రెడ్డి
2027 డిసెంబర్ 9లోపు ఉస్మానియా, అల్వాల్‌, ఎల్బీనగర్‌, వరంగల్‌ ఆస్పత్రులు పూర్తి: సీఎం రేవంత్ రెడ్డి
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Breaking News: మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
TIMS Sanathnagar Hospital Inauguration:హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో 1000 పడకల టిమ్స్‌ ప్రారంభం!
హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో 1000 పడకల టిమ్స్‌ ప్రారంభం!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget