అన్వేషించండి

Telangana Municipal Elections: కొల్లాపూర్‌లో జూపల్లి కృష్ణారావు వినూత్న ప్రచారం.. ప్రజల్ని ఆకట్టుకున్న మంత్రి ప్రయత్నం

Telangana Municipal Elections 2026 | కొల్లాపూర్ పట్టణ అభివృద్ధి కోసం తాను కృషిచేస్తానని, రాష్ట్రంలోనే నెంబర్ వన్‌గా చేస్తానని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

Jupally Krishna Rao campaign in Municipal Elections | కొల్లాపూర్: కొల్లాపూర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రజల దృష్టిని ఆకర్షించారు. వినూత్న కార్యక్రమంలో భాగంగా సైకిల్‌పై కొల్లాపూర్ పట్టణ వీధుల వెంట తిరుగుతూ శారీరక శ్రమ, మానసిక ఉల్లాసం, ఆరోగ్యకర జీవనశైలి ప్రాధాన్యతను గురించి ప్రజలకు సందేశాన్ని ఇచ్చారు. 

నేటి ఆధునిక జీవనశైలిలో వాహనాలపై అధిక ఆధారపడటం వల్ల శారీరక శ్రమ తగ్గి, అనేక రకాల ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లో సైకిల్ ప్రయాణం వంటి సాధారణ అలవాట్లు శరీర దృఢత్వంతో పాటు మనసుకు ఆనందాన్ని అందిస్తాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి విజయం అందించాలని ప్రజలను మంత్రి జూపల్లి కోరారు.
Telangana Municipal Elections: కొల్లాపూర్‌లో జూపల్లి కృష్ణారావు వినూత్న ప్రచారం.. ప్రజల్ని ఆకట్టుకున్న మంత్రి ప్రయత్నం

సైకిల్ వినియోగం ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా, కాలుష్య నియంత్రణకు, పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ప్రతి ఒక్కరూ తమ రోజువారీ జీవితంలో సాధ్యమైనంతవరకు సైకిల్‌ను వినియోగించాలని, శారీరక శ్రమ చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, యువత, రైతులు తమ దైనందిన జీవితంలో సైకిల్ వినియోగానికి ప్రాధాన్యత ఇవ్వాలని మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు పిలుపునిచ్చారు. మంత్రి జూపల్లి చేపట్టిన ఈ వినూత్న ప్రచారానికి పట్టణ ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.


Telangana Municipal Elections: కొల్లాపూర్‌లో జూపల్లి కృష్ణారావు వినూత్న ప్రచారం.. ప్రజల్ని ఆకట్టుకున్న మంత్రి ప్రయత్నం

కొల్లాపూర్ మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో అగ్రగామిగా నిలపడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం కొల్లాపూర్ పట్టణంలోని 11వ వార్డులో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికీ తిరుగుతూ సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని 'ప్రజా ప్రభుత్వం' చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.


Telangana Municipal Elections: కొల్లాపూర్‌లో జూపల్లి కృష్ణారావు వినూత్న ప్రచారం.. ప్రజల్ని ఆకట్టుకున్న మంత్రి ప్రయత్నం

అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. కొల్లపూర్ పట్టణ రూపురేఖలు మార్చాలంటే హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకా మూడేళ్ల పదవీకాలం ఉంది. ఈ సమయంలో కొల్లాపూర్ రూపురేఖలు మార్చేలా నిధులు మంజూరు చేయిస్తా. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రజలు కాంగ్రెస్ వైపే ఉంటారనే నమ్మకం ఉందని మంత్రి జూపల్లి ధీమా వ్యక్తం చేశారు.


Telangana Municipal Elections: కొల్లాపూర్‌లో జూపల్లి కృష్ణారావు వినూత్న ప్రచారం.. ప్రజల్ని ఆకట్టుకున్న మంత్రి ప్రయత్నం

కొల్లాపూర్‌ను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే విద్యా, వైద్య రంగాలతో పాటు తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థల మెరుగుదలకు కృషి చేశామని జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. కొనసాగుతున్న పనులను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు, భవిష్యత్తులో మరిన్ని భారీ ప్రాజెక్టులతో కొల్లాపూర్ పట్టణాన్ని అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పార్టీ మద్దతుదారులు, ప్రజలు పాల్గొన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Congress Rajya Sabha Candidates: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. తెలంగాణ నుంచి సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. తెలంగాణ నుంచి సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి
Telangana CM Revanth : 99 రోజుల ప్రణాళికపై సీఎం రేవంత్ దృష్టి - ఈ కార్యక్రమంతో ఏం సాధించాలనుకుంటున్నారు?
99 రోజుల ప్రణాళికపై సీఎం రేవంత్ దృష్టి - ఈ కార్యక్రమంతో ఏం సాధించాలనుకుంటున్నారు?
Telangana Congress Rajya Sabha Candidates: కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులుగా సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి - మాట నెగ్గించుకున్న రేవంత్ రెడ్డి !
కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులుగా సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి - మాట నెగ్గించుకున్న రేవంత్ రెడ్డి !
ABP Desam Smart Ed Conclave 2026: జీవితంలో సక్సెస్ కావాలంటే ఈ మూడు ఉండాలి, రిస్క్ లేకపోతే లైఫ్ లేదు: స్కోప్ సీఈవో అప్పల్ల సాయికిరణ్
జీవితంలో సక్సెస్ కావాలంటే ఈ మూడు ఉంటే చాలు - ABP Desam Smart Ed Conclave లో అప్పల్ల సాయికిరణ్
Advertisement

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Operation Decapitation: ట్రాఫిక్ కెమెరాల హ్యాకింగ్ నుండి బంకర్ బస్టర్ల వరకు.. ఖమేనీ అంతం వెనుక CIA, మోసాద్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్!
ట్రాఫిక్ కెమెరాల హ్యాకింగ్ నుండి బంకర్ బస్టర్ల వరకు.. ఖమేనీ అంతం వెనుక CIA, మోసాద్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్!
TDP Trap: మండలిలో మత రాజకీయం- జగన్‌పై క్రిస్టియన్ ముద్ర - టీడీపీ వ్యూహంలో చిక్కుకున్న వైసీపీ ?
మండలిలో మత రాజకీయం- జగన్‌పై క్రిస్టియన్ ముద్ర - టీడీపీ వ్యూహంలో చిక్కుకున్న వైసీపీ ?
Telangana Congress Rajya Sabha Candidates: కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులుగా సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి - మాట నెగ్గించుకున్న రేవంత్ రెడ్డి !
కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులుగా సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి - మాట నెగ్గించుకున్న రేవంత్ రెడ్డి !
Virosh Reception Photos: విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా దేవరకొండ - మందన్నా ఫ్యామిలీలు
విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా దేవరకొండ - మందన్నా ఫ్యామిలీలు
Yamaha XSR155 vs TVS Ronin - ధరలో ఏది చవక? దర్జాలో ఏది ఎక్కువ? 155cc vs 225cc లో ఏ బైక్ బెస్ట్?
Yamaha XSR155 vs TVS Ronin - ధరలో ఏది చవక? దర్జాలో ఏది ఎక్కువ? 155cc vs 225cc లో ఏ బైక్ బెస్ట్?
Finn Allen Century: 33 బంతుల్లో సెంచరీతో ఫిన్ అలెన్ చరిత్ర.. 5 రికార్డులు బద్దలు కొట్టిన కివీస్ బ్యాటర్
33 బంతుల్లో సెంచరీతో ఫిన్ అలెన్ చరిత్ర.. 5 రికార్డులు బద్దలు కొట్టిన కివీస్ బ్యాటర్
Underwater Tunnel In India: నీటి అడుగున రహదారిని చూసారా? ఇవి ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన సొరంగాలు!
నీటి అడుగున రహదారిని చూసారా? ఇవి ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన సొరంగాలు!
Israel Iran War: యుద్ధం మొదలైన మరుసటిరోజు అమెరికాతో చర్చలకు ఇరాన్ రెడీ? నివేదికలో సంచలన విషయాలు
యుద్ధం మొదలైన మరుసటిరోజు అమెరికాతో చర్చలకు ఇరాన్ రెడీ? నివేదిక సంచలనం
Embed widget