By: ABP Desam | Published : 01 Sep 2021 11:12 PM (IST)|Updated : 01 Sep 2021 11:12 PM (IST)
కేంద్రమంత్రి పియూష్ గోయాల్ ను కలిసిన రాష్ట్రమంత్రులు కేటీఆర్,గంగుల
రాష్ట్ర సమస్యలపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు రాష్ట్ర మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్ కలిశారు. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన రైతు అనుకూల విధానాలతో తెలంగాణ బాగుపడుందని.. తెలంగాణ రైతులకు అండగా ఉండాల్సిన భాద్యత కేంద్రంపై ఉందని కేంద్రమంత్రికి గంగుల కమలాకర్ వివరించారు. యాసంగిలో 80-90 శాతం పారాబాయిల్డ్ రైస్ లిమిట్ పెంచాలని విజ్ఞప్తి చేశారు. యాసంగి ధాన్యం రారైస్‌గా చేస్తే విరిగిపోయి నష్టపోతామని మంత్రులు అన్నారు.
రాబోయే కాలంలో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తీసుకోవాలని కోరారు. ఈ రబీలో సైతం 50 లక్షల మెట్రిక్ టన్నలు పారాబాయిల్డ్ రైస్ ఇస్తామని మంత్రులు తెలిపారు. గతంలో కోల్పోయిన 2019-20 రబీ సీఎంఆర్ డెలివరీ 30 రోజులు పెంచాలని తెలంగాణ మంత్రులు విజ్ఞప్తి చేశారు. తాలు, తేమ నిబంధనలు మార్చితే రైతులు తీవ్రంగా నష్టపోతారని మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మాదిరి కొనసాగించి రైతులకు కేంద్రం అండగా వుండాలని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
రైతుబందు, ఇరవై నాలుగు గంటల కరెంటు, కాళేశ్వర జలాలతో రికార్డు స్థాయిలో ఈ ధపా రాష్ట్రంలో 55 లక్షలకు పైగా ఎకరాల్లో వరి సాగయిందని అంతే స్థాయిలో 92.35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఈ యాసంగిలో సేకరించామని గంగుల తెలిపారు. ఇందులో 62.82 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎఫ్.సి.ఐకి అందజేయడం కోసం మిల్లింగ్ ప్రక్రియ కొనసాగుతుందని ఈ దశలో ఎఫ్.సి.ఐ. కేవలం 24.57 లక్షల మెట్రిక్ టన్నుల పారాబాయిల్డ్ రైస్ మాత్రమే తెలంగాణ నుండి తీసుకుంటామని అంటుందని కేంద్రమంత్రికి వివరించారు. ఇలా అయితే తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. ఈ సమస్యను అధిగమించేందుకు ఈ యాసంగిలో ఎఫ్.సి.ఐకి 80 నుండి 90 శాతం పారాబాయిల్డ్ రైస్ ఇవ్వడానికి అనుమతించాలని గతంలోనే కేంద్రానికి లేఖను రాశామని చెప్పారు. దానిపై సానుకూల నిర్ణయం తీసుకొని కరోనా క్లిష్ట సమయంలో రైతులను ఆదుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు,
వరంగల్ లో కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ ను 2000 ఎకరాలలో నిర్మాణం చేయనున్నట్లు కేంద్రమంత్రికి మంత్రి కేటీఆర్ తెలిపారు. టెక్స్ టైల్ పార్క్ ను మెగా టెక్స్ టైల్ పార్క్ గా ప్రకటించాల్సిందిగా కోరుతూ దానికి అవసరమైన నిధులను రిలీజ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. హైదరాబాదులో నేషనల్ డిజైన్ సెంటర్ ప్రతిపాదన ఆమోదం కోసం వివరణాత్మక ప్రాజెక్టు నివేదికను పియూష్ గోయాల్ కు రాష్ట్రమంత్రులు అందజేశారు. ఈ ప్రాజెక్టు కార్యాచరణ నిధుల అవసరాలలో 50 శాతం నిధులను సమకూర్చడానికి కి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
Also Read: KRMB Meet : కృష్ణా బోర్డు భేటీ నుంచి తెలంగాణ వాకౌట్ ! ఇంతకీ వాటాలు తేలాయా..?
Nalgonda: ప్రియుడితో వెళ్లిపోయిన భార్య, తిరిగొచ్చేస్తానని మళ్లీ భర్తకు ఫోన్ - ఊహించని షాక్ ఇచ్చిన భర్త
TRS Rajyasabha Mandava : టీఆర్ఎస్ రాజ్యసభ రేస్‌లో మండవ - కేసీఆర్ డిసైడయ్యారా ?
Teenmar Mallanna Vs Puvvada : మిస్టర్ మల్లన్న క్షమాపణలు చెప్పు లేదా రూ. పది కోట్లు కట్టు - మినిస్టర్ వార్నింగ్
Cabs Bundh: అలర్ట్! ఈ నెల 19న క్యాబ్స్ బంద్, ఆటోలు కూడా - పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపు
Nalgonda: ‘పైసలియ్యి, లేకుంటే చావు’ పెళ్లి కాకముందే కట్నం కోసం వరుడి మెసేజ్‌లు - యువతి ఆత్మహత్య
Rajyasabha Candidates: వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు వీరే, ఖరారు చేసిన సీఎం జగన్? ఈయనకి మళ్లీ ఛాన్స్
Parag Agrawal On Twitter Spam: పరాగ్ X మస్క్- స్పామ్ అకౌంట్లపై తగ్గేదేలే అంటూ ట్వీట్ వార్!
Prabhas Project K Update: ప్రభాస్ ఇంట్రడక్షన్ కంప్లీట్ చేశాం, ప్రాణం పెట్టి పని చేస్తున్నాం - నాగ్ అశ్విన్ రిప్లై
AP PCC New Chief Kiran : వైఎస్ఆర్సీపీతో పొత్తు దిశగా ప్లాన్ - ఏపీ పీసీసీ చీఫ్‌గా మాజీ సీఎం !?