అన్వేషించండి

Godavari Floods: భారీ వర్షాలతో అప్రమత్తం, గోదావరి ఉధృతిపై నిరంతరం నిఘా పెట్టాలని మంత్రి పొంగులేటి ఆదేశాలు

Telangana Rains | కొన్ని జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో పాటు ఎగువ నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. గోదావరి ఉధృతిపై పర్యవేక్షణ ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు.

Telangana Minister Ponguleti Srinivas Reddy | హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో తెలంగాణపై సైతం ప్రభావం పడింది. గత రెండు, మూడు రోజులుగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్నందున అన్ని జిల్లాల కలెక్టర్ లు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. రెవెన్యూ, సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖా మంత్రి పొంగులేటి ఆదివారం సాయంత్రం అన్ని జిల్లాల్లో వరద పరిస్థితిని సమీక్షించారు. అన్ని జిల్లాల అధికారులు, సిబ్బంది పునరావాస చర్యల్లో నిమగ్నం కావాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా గోదావరి ఉధృతిపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని అన్నారు.

భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ 
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడం, ఎగువ నుంచి వరద నీరు వస్తుండటంతో గోదావరి ఉధృతి పెరిగింది. ఇప్పటికే భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరి పరివాహ ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, రెస్కూటీమ్‌లను వినియోగించాలని అధికారులకు మంత్రి పొంగులేటి సూచించారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముంపు ప్రాంతాల్లో చేపట్టవలసిన చర్యలపై ఉన్నతాధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.

కలెక్టర్లకు మంత్రి పొంగులేటి ఆదేశాలు 
ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా సంబంధిత ప్రభుత్వ విభాగాలతో కలసి జిల్లాల కలెక్టర్లు జాగ్రత చర్యలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి సూచించారు. ప్రధాన వాగుల వద్ద, రోడ్లపై నీరు ప్రవహించే సమీప కాలువల వద్ద తగు బందోబస్తును ఏర్పాటు చేయాలన్నారు. ప్రమాదకరంగా ప్రవహించే వాగులను ప్రజలు దాటకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. అన్ని జిల్లాల్లో కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసి, వర్షాలు, వరదల పరిస్థితిని ఎప్పటికప్పుడూ పోలీస్ తదితర శాఖల అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించాలన్నారు. ఏ విధమైన సహాయం కావాలన్నా ఏ సమయంలోనైనా హైదరాబాద్ లో ఉన్నతాధికారులను, తనను సంప్రదించవచ్చునని మంత్రి పొంగులేటి చెప్పారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TPCC Chief: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ - ఏఐసీసీ అధిష్టానం కీలక నిర్ణయం
TPCC Chief: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ - ఏఐసీసీ అధిష్టానం కీలక నిర్ణయం
Actor Raj Tarun Case: రాజ్‌తరుణ్‌, లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్‌- సహజీవనం నిజమని కోర్టుకు చెప్పిన పోలీసులు
రాజ్‌తరుణ్‌, లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్‌- సహజీవనం నిజమని కోర్టుకు చెప్పిన పోలీసులు
Andra Pradesh Trains: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక- విజయవాడ మార్గంలో 44 రైళ్లు రద్దు- దసరా దీపావళికి ప్రత్యేక ట్రైన్స్‌
రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక- విజయవాడ మార్గంలో 44 రైళ్లు రద్దు- దసరా దీపావళికి ప్రత్యేక ట్రైన్స్‌
Jr NTR On Mokshagna Debut: తమ్ముడికి తారక్ వెల్కమ్... బాబాయ్ బాలకృష్ణతో గొడవాలంటూ వచ్చే పుకార్లకు చెక్!
తమ్ముడికి తారక్ వెల్కమ్... బాబాయ్ బాలకృష్ణతో గొడవాలంటూ వచ్చే పుకార్లకు చెక్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Chandrababu Naidu Escape Train Accident |రైలు వచ్చే కొన్ని క్షణాల ముందు చంద్రబాబు ఏం చేశారో చూడండిJainoor Tribal Woman Incident: ఆదివాసీ మహిళపై లైంగిక దాడి.. అట్టుడుకుతున్న జైనూర్ | ABP DesamFloods At Gabbarsingh Re Release Chilakaluripet |నడుం లోతు నీళ్లలోనూ సినిమా చూస్తున్న ఫ్యాన్స్ |ABPRobotic Life Jacket SDRF | ఏలూరులో తమ్మిలేరులో రోబోటిక్ లైఫ్ జాకెట్ డెమో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TPCC Chief: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ - ఏఐసీసీ అధిష్టానం కీలక నిర్ణయం
TPCC Chief: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ - ఏఐసీసీ అధిష్టానం కీలక నిర్ణయం
Actor Raj Tarun Case: రాజ్‌తరుణ్‌, లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్‌- సహజీవనం నిజమని కోర్టుకు చెప్పిన పోలీసులు
రాజ్‌తరుణ్‌, లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్‌- సహజీవనం నిజమని కోర్టుకు చెప్పిన పోలీసులు
Andra Pradesh Trains: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక- విజయవాడ మార్గంలో 44 రైళ్లు రద్దు- దసరా దీపావళికి ప్రత్యేక ట్రైన్స్‌
రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక- విజయవాడ మార్గంలో 44 రైళ్లు రద్దు- దసరా దీపావళికి ప్రత్యేక ట్రైన్స్‌
Jr NTR On Mokshagna Debut: తమ్ముడికి తారక్ వెల్కమ్... బాబాయ్ బాలకృష్ణతో గొడవాలంటూ వచ్చే పుకార్లకు చెక్!
తమ్ముడికి తారక్ వెల్కమ్... బాబాయ్ బాలకృష్ణతో గొడవాలంటూ వచ్చే పుకార్లకు చెక్!
Congress party : కాంగ్రెస్ పార్టీలోకి స్టార్ రెజ్లర్లు - అధికారంగా చేరిన వినేష్ ఫోగట్, భజరంగ్ పూనియా
కాంగ్రెస్ పార్టీలోకి స్టార్ రెజ్లర్లు - అధికారంగా చేరిన వినేష్ ఫోగట్, భజరంగ్ పూనియా
Kolkata Rape Case: మాకు డబ్బులొద్దు , న్యాయం కావాలి - కోల్‌కతా డాక్టర్ తల్లి భావోద్వేగ లేఖ !
మాకు డబ్బులొద్దు , న్యాయం కావాలి - కోల్‌కతా డాక్టర్ తల్లి భావోద్వేగ లేఖ !
Telangana: కేసీఆర్‌కు మరోసారి కోర్టు సమన్లు-వచ్చే నెల 17న హాజరుకావాలని ఆదేశం- ఏ కేసులో అంటే?
కేసీఆర్‌కు మరోసారి కోర్టు సమన్లు-వచ్చే నెల 17న హాజరుకావాలని ఆదేశం- ఏ కేసులో అంటే?
Tamannaah Bhatia: పెళ్లి విషయంలో బాంబ్ పేల్చిన మిల్కీ బ్యూటీ తమన్నా!
పెళ్లి విషయంలో బాంబ్ పేల్చిన మిల్కీ బ్యూటీ తమన్నా!
Embed widget