అన్వేషించండి

KTR letter to Centre: బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ ఘాటు లేఖ

KTR On Bayyaram Steel Plant: నాణ్యమైన ఇనుప ఖనిజ సంపద అందుబాటులో ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ సంకల్ప లోపమే బయ్యారం ప్లాంట్ నిర్మాణానికి శాపంగా మారిందన్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్.

KTR letter to Centre: బయ్యారం ఉక్కు కర్మాగారం నిర్మాణం విషయంలో కేంద్ర ప్రభుత్వ వివక్షపూరిత వైఖరిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. నాణ్యమైన ఇనుప ఖనిజ సంపద అందుబాటులో ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ సంకల్ప లోపమే బయ్యారం ప్లాంట్ నిర్మాణానికి శాపంగా మారిందన్నారు. బయ్యారం ఉక్కు కర్మాగారం విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ కేంద్ర స్టీల్ శాఖ మంత్రి రామచంద్ర ప్రసాద్ సింగ్ కి మంత్రి కేటీఆర్ ఘాటు లేఖ రాశారు.

బయ్యారంలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం అనేది రాజ్యాంగబద్దంగా తెలంగాణ రాష్ట్రానికి దక్కిన హామి అని, బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అన్న విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. నిండు పార్లమెంట్ లో భారత ప్రభుత్వం ఒప్పుకున్న నిర్ణయాన్ని కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ తుంగలో తొక్కిందని విమర్శించారు. న్యాయంగా దక్కాల్సిన ఎన్నో విభజన హామీలను పక్కన పెట్టినట్టుగానే బయ్యారం స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని కూడా బీజేపీ ప్రభుత్వం కావాలని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సూమారు 300 మిలియన్ మెట్రిక్ టన్నుల అపార ఇనుప ఖనిజ నిల్వలు బయ్యారంలో ఉన్నాయన్న జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే నివేదికను ఈ లేఖలో కేటీఆర్ ప్రస్తావించారు. కాని నాణ్యమైన ఐరన్ ఓర్ బయ్యారంలో లేదని కేంద్ర ప్రభుత్వం నిస్సిగ్గుగా అబద్దాలు చెపుతుందన్నారు. 

ఒకవేళ బయ్యారంలో సరిపడ నాణ్యమైన నిల్వలు లేకపోవడమే కారణం అయినా కేవలం 180 కిలోమీటర్ల స్వల్ప దూరంలోని ఛత్తీస్ ఘడ్ లోని భైలాడిల్లలో గనులు కేటాయించాలని కోరిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. అక్కడినుంచి బయ్యారానికి ఐరన్ ఓర్ రవాణా చేసేందుకు ఒక స్లర్రి పైపులైన్ లేదా రైల్వే లైన్ వేస్తే సరిపోతుందని స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్ గారు భారత ప్రధాని నరేంద్ర మోడీని కలిసి విజ్ఞప్తి చేశారని, తాను పలు మార్లు కేంద్రమంత్రులను కలసి బయ్యారంలో ప్లాంట్ కోసం ప్రయత్నం చేశామని, అయినప్పటికీ సానుకూల స్పందన రాలేదన్నారు. ఈ రవాణా ఏర్పాటుకు అవసరమయ్యే వ్యయాన్ని తెలంగాణ ప్రభుత్వం పంచుకుంనేందుకు సిద్దంగా ఉన్నామని హమీ ఇచ్చినా మోదీ ప్రభుత్వం నుంచి ఉలుకూ పలుకూ లేదని కేటీఆర్ మండిపడ్డారు. చత్తీస్ ఘడ్ లో ఉన్న ఐరన్ ఓర్ గనుల నుంచి బయ్యారం ప్లాంట్ కు సరఫరా చేసేందుకు 2016లోనే ఎన్‌యండిసి అంగీకరించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. దీంతోపాటు మెటలర్జికల్ ఇంజనీరింగ్ కన్సల్ టెంట్స్ (మేకాన్) సంస్ధ ఖమ్మం పరిసర ప్రాంతాలను అధ్యయనం చేసి పెల్లెటైజేషన్ ప్లాంట్, స్ర్కాప్ బేస్డ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ఉన్న అంశాలపైన సానుకూల నివేదిక ఇచ్చిందన్నారు. 

ఒకవైపు యన్‌యండిసి (NMDC), సింగరేణి కాలరీస్, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ సంస్ధలు సానుకూలంగా స్పందించినా కేంద్రం మాత్రం బయ్యారంలో ప్లాంట్ ఎర్పాటుపైన నిమ్మకు నిరెత్తినట్లు వ్యవహరిస్తుందన్నారు. మరోవైపు ఛత్తీస్ ఘడ్, జార్ఖండ్ ల్లో స్టీల్ ప్లాంట్ల నిర్మాణాల కోసం కేంద్రం, NMDC, స్థానిక ప్రభుత్వాలతో స్పెషల్ పర్పస్ వెహికల్ సంస్ధలు ఏర్పాటైన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ ప్రస్తావించారు. ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ప్రస్తుతం వీలు కాకుంటే, తాత్కాలికంగా పెల్లేటైజేశన్ ప్లాంట్ పెట్టి స్థానిక యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కూడా కేంద్రాన్ని కోరామని కేటీఆర్ చెప్పారు. ఇన్ని రకాలుగా విజ్ఞప్తి చేస్తున్నా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఏం పట్టనట్టు వ్యవహరిస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మోడీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందనడానికి ఇంతకంటే రుజువులు అవసరం లేదన్నారు కేటీఆర్. 
                
బయ్యారంలో స్టీల్ ప్లాంట్ పెట్టాలని ఎన్నోసార్లు విన్నవించుకున్నా పట్టించుకోని మోడీ ప్రభుత్వం, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని రూర్కెలా, బర్న్ పూర్, దుర్గాపూర్ బొకారో, సాలెం ప్లాంట్ల విస్తరణ, ఆధునికీకరణ, గనుల కోసం దాదాపు సూమారు 71 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసిందన్నారు కేటీఆర్. అదే సమయంలో బయ్యారంలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. పాత కర్మాగారాల ఆధునికీకరణ ఆహ్వానించదగ్గదే అయినా... వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేసినంక స్టీల్ అథారిటీ అఫ్ ఇండియాను అప్పనంగా అమ్మేందుకు  మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. ఈ క్రమంలోనే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాను కూడా అమ్మకానికి పెట్టిందన్నారు కేటీఆర్. 
              
గతంలో హైదరాబాద్ లో జరిగిన ఎన్ఎండిసి సంబరాల్లో పాల్గొన్న అప్పటి కేంద్ర స్టీల్ శాఖ మంత్రి బీరేంద్ర సింగ్  కొత్తగూడెం, పాల్వంచలో పెల్లెటైజేషన్ ప్లాంట్, స్ర్కాప్ బేస్డ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు సిద్దంగా ఉన్నామని చెప్పిన మాటలు ఏమయ్యాయని కేటీఆర్ ప్రశ్నించారు. కేంద్రం ఇలా అబ్దదాల ప్యాక్టరీలు పెట్టడమే తప్పా అసలు ప్యాక్టరీలు పెట్టడం లేదన్నారు. నిన్న విశాఖ స్టీల్ ప్యాక్టరీ గొంతుకోసిన కేంద్రం, బయ్యారం స్టీల్ ప్యాక్టరీకి ఉపిరిపోయకుండానే ఉసురూ తీస్తుందని మండిపడ్డారు. దీనికి తోడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన ప్రకటనపై తన లేఖలో దుయ్యబట్టారు. అయన ప్రకటనతో బయ్యారంపై కేంద్ర బీజేపీ బండారం బయటపడిందన్నారు. బయ్యారం ఉక్కుపై కేంద్రంది కేవలం తుక్కు సంకల్పమే అని తేలిపోయిందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ విభజనను తప్పుపడితే, ఇక్కడి తెలంగాణ మంత్రి విభజన హమీలను తప్పుపడుతున్నారని, ఇదీ ముమ్మాటికీ తెలంగాణకు ద్రోహమే అన్నారు. తెలంగాణ నుంచి ఎన్నికైన మంత్రి హక్కులు సాధించాల్సిందిపోయి చిక్కులున్నాయంటూ చేతులేత్తెస్తారా అంటూ ప్రశ్నించారు. స్టీల్ ప్యాక్టరీని సాధించాల్సిన కేంద్రమంత్రే బయ్యారంలో ప్లాంట్ ఏర్పాటు లాభసాటికాదని, ప్లాంట్ ఎర్పాటు సాద్యం కాదంటూ చేతులేత్తేయడం ఎంటన్నారు. 

తెలంగాణ ప్రయోజనాలకు సహాయం చేయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిస్సహాయ మంత్రేనని కేటీఆర్ విమర్శించారు. కిషన్ రెడ్డి మాటలు వ్యక్తిగతమా లేదంటే కేంద్ర ప్రభుత్వ విధానపర నిర్ణయమా అన్నది తెలపాలని కేంద్రమంత్రి స్టీల్ శాఖ మంత్రిని కేటీఆర్ డిమాండ్ చేశారు. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అన్ని అవకాశాలు ఉన్నాయని ఓవైపు కేంద్ర ప్రభుత్వ సంస్థలే చెపుతుంటే.... ప్రభుత్వంలో భాగస్వామి అయిన కిషన్ రెడ్డి అలా మాట్లాడడం బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ పట్ల ఉన్న వివక్ష పూరిత వైఖరికి నిదర్శనం అన్నారు కేటీఆర్. నిన్న ట్రైబల్ యూనివర్సీటీకి సహాయం చేయ్యని కేంద్ర, నేడు బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో తమకు ఉద్యోగాలు వస్తాయనుకుంటున్న వేలాది గిరిజన, అదివాసీ యువకుల ఉపాది అశలను అవిరి చేస్తూ వేలాది ఉద్యోగాలకు కిషన్ రెడ్డి ఉరి వేశారని కేటీఆర్ విమర్శించారు. 

తెలంగాణ ప్రయోజనాలను, హక్కులను సాధించడం  కోసం మా ప్రభుత్వ నిరంతరం కృషి చేస్తూనే ఉంటుందని, ఈ దిశగా కేంద్రం నుంచి సానుకూల స్పందన కోసం ఏదురుచూస్తున్నామని మంత్రి కెటియార్ తన లేఖలో తెలిపారు. కేంద్రంలోని బీజెపీ ప్రభుత్వం ఇప్పటికైనా తెలంగాణ పట్ల తన వివక్ష పూరిత వైఖరి వదిలిపెట్టి బయ్యారంలో వెంటనే స్టీల్ ప్లాంట్ ఏర్పాటు దిశగా నిర్ణయం తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad News: సంతానం కోసం గరుడ ప్రసాదం వితరణ - చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం
సంతానం కోసం గరుడ ప్రసాదం వితరణ - చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం
Heavy Temparatures: నిప్పుల గుండంలా తెలుగు రాష్ట్రాలు - ఈ జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
నిప్పుల గుండంలా తెలుగు రాష్ట్రాలు - ఈ జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
Lok Sabha Election 2024: తమిళనాడులో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు
Lok Sabha Election 2024: తమిళనాడులో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు
Lok Sabha Election 2024: ఇది కదా ప్రజాస్వామ్యం గొప్పదనం, వీళ్లే అసలు సిసలు సెలెబ్రిటీలు
Lok Sabha Election 2024: ఇది కదా ప్రజాస్వామ్యం గొప్పదనం, వీళ్లే అసలు సిసలు సెలెబ్రిటీలు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Annamalai Reaction 1000Crores Google Pay | కోయంబత్తూరులో డీఎంకే వెయ్యికోట్లు పంచిందా..? | ABP DesamRohit Sharma on Impact Player | IPL 2024 లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పై హిట్ మ్యాన్ గుస్సా | ABP DesamLoksabha Elections 2024 | Tamil Nadu సహా 21రాష్ట్రాల్లో మొదలైన పోలింగ్ పండుగ | ABP DesamPBKS vs MI Toss Coin in IPL 2024 | కెమెరా మెన్ ఫోకస్ కరో ఫోకస్ కరో అన్నట్లుగా ఐపీఎల్ లో టాస్ లైవ్ షో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad News: సంతానం కోసం గరుడ ప్రసాదం వితరణ - చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం
సంతానం కోసం గరుడ ప్రసాదం వితరణ - చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం
Heavy Temparatures: నిప్పుల గుండంలా తెలుగు రాష్ట్రాలు - ఈ జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
నిప్పుల గుండంలా తెలుగు రాష్ట్రాలు - ఈ జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
Lok Sabha Election 2024: తమిళనాడులో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు
Lok Sabha Election 2024: తమిళనాడులో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు
Lok Sabha Election 2024: ఇది కదా ప్రజాస్వామ్యం గొప్పదనం, వీళ్లే అసలు సిసలు సెలెబ్రిటీలు
Lok Sabha Election 2024: ఇది కదా ప్రజాస్వామ్యం గొప్పదనం, వీళ్లే అసలు సిసలు సెలెబ్రిటీలు
Tillu Square OTT: ఓటీటీలో పాన్‌ ఇండియాగా వస్తున్న 'టిల్లు స్క్వేర్‌' - రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌, ఆ రోజు నుంచే స్ట్రీమింగ్‌!
ఓటీటీలో పాన్‌ ఇండియాగా వస్తున్న 'టిల్లు స్క్వేర్‌' - రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌, ఆ రోజు నుంచే స్ట్రీమింగ్‌!
Mahesh Babu SSMB29: క్రేజీ అప్‌డేట్‌, దుబాయ్‌ నుంచి వచ్చేసిన మహేష్‌, రాజమౌళి - ఇక షూటింగ్‌ అప్‌డేటేనా?
క్రేజీ అప్‌డేట్‌, దుబాయ్‌ నుంచి వచ్చేసిన మహేష్‌, రాజమౌళి - ఇక షూటింగ్‌ అప్‌డేటేనా?
Eesha Rebba Birthday : ఈ తెలుగు అందానికి ముప్పై నాలుగు ఏళ్లు.. ఈషా రెబ్బా బర్త్​డే స్పెషల్ ఫోటోలు చూశారా?
ఈ తెలుగు అందానికి ముప్పై నాలుగు ఏళ్లు.. ఈషా రెబ్బా బర్త్​డే స్పెషల్ ఫోటోలు చూశారా?
Tariff: జూన్‌ నుంచి ఫోన్‌లో మాట్లాడాలంటే వణికి పోవాల్సిందే! ఎన్నికల తర్వాత పడే మొదటి ఎఫెక్ట్ ఇదే!
జూన్‌ నుంచి ఫోన్‌లో మాట్లాడాలంటే వణికి పోవాల్సిందే! ఎన్నికల తర్వాత పడే మొదటి ఎఫెక్ట్ ఇదే!
Embed widget