Breaking News: హీరో సాయి ధరమ్ తేజ్‌కు ప్రమాదం.. స్పోర్ట్స్ బైక్‌పై వెళ్తుండగా..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 10న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

Background
హైదరాబాద్ సైదాబాద్ సింగరేణి కాలనీలో ఉద్రిక్త వాతావరణ నెలకొంది. కాలనీలో గురువారం అదృశ్యమైన చిన్నారి పక్క ఇంట్లో ఉంటున్న రాజు అనే వ్యక్తి ఇంట్లో విగతజీవిగా కనిపించింది. దీంతో స్థానికులు ఆగ్రహానికి గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులపై స్థానికులు రాళ్లు రువ్వారు. స్థానికుల దాడిలో పలువురు పోలీసులకు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. బాలికపై రాజు అఘాయిత్యానికి పాల్పడ్డాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాజును తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. మరోవైపు పరారీలో ఉన్న రాజు కోసం పోలీసులు గాలిస్తున్నారు.
హీరో సాయి ధరమ్ తేజ్‌కు ప్రమాదం
సినీ హీరో సాయి ధరమ్ తేజ్‌కు రోడ్డు ప్రమాదం జరిగింది. ఆయన స్పోర్ట్స్ బైక్‌పై వెళ్తుండగా హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జి నుంచి ఐకియా జంక్షన్‌కు వెళ్లే మార్గంలో ప్రమాదం జరిగింది. ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మహిళపై కిరాతక అత్యాచారం
ముంబయిలో ఓ మహిళ దారుణమైన రీతిలో అత్యాచారానికి గురై స్పృహతప్పిపోయిన స్థితిలో పడి ఉంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. దాదాపు 32 ఏళ్లు ఉండే ఓ మహిళపై కిరాతకంగా అత్యాచారం చేయడమే కాకుండా నిందితులు ఆమె ప్రైవేటు అవయవాలపై ఇనుప రాడ్డుతో దాడి చేశారు. రక్తపు మడుగులోనే ఆమెను వదిలేసి పారిపోయారు. ముంబయిలోని సాకినాక ప్రాంతంలోని ఖైరానీ రహదారి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు.





















