By: ABP Desam | Updated at : 07 May 2022 10:35 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
తెలంగాణలో మద్యం అమ్మకాలు
TS Liquor Sale : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగ భగలకు జనం అల్లాడిపోతున్నారు. ఉదయం 10 గంటలకు ఉక్కపోత, వేడిమి మొదలవుతుంది. రాత్రి 10 వరకు ఉక్కపోత ప్రభావం ఉంటుంది. అయితే తెలంగాణ వాసులు ఉక్కపోతకు ఉపశమనంగా చల్లని బీర్లు తెగ తాగేస్తున్నారు. ఉక్కపోతలు, వేడిగాలుల నుంచి చల్లని బీరుతో సేద తీరుతున్నారు. తెలంగాణలో మద్యం అమ్మకాల గణాంకాలు వెల్లడయ్యాయి. ఓవైపు ఎండలు మండిపోతుంటే మరోవైపు ఉక్కపోత ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఎండ నుంచి సేద తీరేందుకు మద్యం ప్రియులు చల్లని బీరును తాగేస్తున్నారు. గత నెల రోజులుగా ఎండలు ఎక్కువవటంతో బీర్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. రాష్ట్రంలో గత ఏడాది ఏప్రిల్‌తో పోల్చితే ఈ వేసవి సీజన్ లో బీర్ల అమ్మకాలు 90 శాతం అధికంగా నమోదు అయ్యాయి. ఇతర మద్యం అమ్మకాలు కూడా 3 శాతం పెరిగాయి. తెలంగాణ ఆబ్కారీ శాఖ తాజా గణాంకాలు వెల్లడించింది.
19 శాతం పెరిగిన మద్యం అమ్మకాలు
తెలంగాణలో మద్యం అమ్మకాలు గత ఏడాదితో పోల్చితే 19 శాతం పెరిగినట్టు ఆబ్కారీ శాఖ పేర్కొంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాల్లో 49,84,285 కేసుల బీర్లు, 27,69,998 కేసుల ఇతర మద్యం అమ్ముడైంది. ఎండల తీవ్రతల కారణంగానే మద్యం అమ్మకాలు పెరిగాయని అధికారులు అంటున్నారు. రాష్ట్రంలో కరెంటు కోతలు లేకపోవడంతో చిల్డ్ బీర్లు లభ్యమవుతున్నాయి. దీంతో మద్యం ప్రియులు ఎండల నుంచి కూల్ అయ్యేందుకు బీర్లకే మొగ్గుచూపుతున్నారు. దీంతో విస్కీ, బ్రాందీ, ఇతర మద్యం కన్నా బీర్‌లనే తీసుకోవడంతో వీటి అమ్మకాలు పెరుగుతున్నట్టు వైన్ షాపుల నిర్వాహకులు తెలుపుతున్నారు. 2021-22 లో మద్యం 26,87,808 కేస్లు అమ్ముడైంది. అలాగే బీర్లు 26,12,694 కేస్లు ఉన్నాయి. 2022-23లో ఇప్పటి వరకూ మద్యం 27,69,998 కేస్లు, బీరు 43,84,285 కేస్లు లాగించేశారు.
పది జిల్లాల్లో బీర్ల అమ్మకాలు టాప్
తెలంగాణలో బీర్ల అమ్మకాలలో 10 జిల్లాలు టాప్ లో ఉన్నాయి. ఈ 10 జిల్లాల్లో బీర్ల అమ్మకాలు 150 శాతం వరకూ పెరిగినట్టు తెలుస్తోంది. ఆ తర్వాతలో 146 శాతం, కామారెడ్డిలో 124 శాతం అమ్మకాలు జరిగాయి. ఆదిలాబాద్‌లో 122 శాతం, జిల్లాలో 120 శాతం బీర్ల అమ్మకాలు అధికంగా నమోదు అయ్యాయి. దీంతో రానున్న రోజుల్లో ఎక్సైజ్ ఆదాయం మరింతగా పెరగవచ్చని అధికారులు అంటున్నారు. ఎండల కారణంగానే మద్యం అమ్మకాలు పెరిగాయని అధికారులు అంటున్నారు.
CM KCR Appriciates Nikat Zareen : విశ్వ విజేతగా నిలిచిన తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్, సీఎం కేసీఆర్ హర్షం
Breaking News Live Updates : దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై సుప్రీంలో విచారణ, దోషి ఎవరో తెలుసన్న సీజేఐ
CM KCR Tour : జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ గురి, నేటి నుంచి వరుస పర్యటనలు
Petrol Diesel Price 20th May 2022 : తెలుగు రాష్ట్రాలో నిలకడగా పెట్రోల్, డీజిల్ ధరలు, ఇవాళ్టి ఇంధన ధరలు ఇలా
Gold Silver Price Today 20th May 2022 : మళ్లీ పెరిగిన బంగారం ధరలు, కాస్త తగ్గిన వెండి ధరలు, ప్రధాన నగరాల్లో ఇవాళ్టి రేట్స్ ఇలా
MLC Car Dead Body : వైసీపీ ఎమ్మెల్సీ కారులో డ్రైవర్ డెడ్ బాడీ, కొట్టిచంపారని కుటుంబసభ్యుల ఆరోపణ
Ram Charan-NTR: నీతో నా బంధాన్ని మాటల్లో చెప్పలేను - రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్
Nara Lokesh : ఎమ్మెల్సీ కారులో మృతదేహం ఘటనపై లోకేశ్ ఫైర్, హత్యను యాక్సిడెంట్ గా చిత్రీకరిస్తున్నారని ఆరోపణ!
TTD Darshan Tickets For July, August : జూలై, ఆగస్టులో శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారా ? అయితే మీ కోసమే ఈ సమాచారం