Covid Updates: తెలంగాణలో కోవిడ్ విజృంభణ... కొత్తగా 4,416 కరోనా కేసులు, ఇద్దరు మృతి
తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. రాష్ట్రంలో కొత్తగా 4,416 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కోవిడ్ తో ఇద్దరు మరణించారు.
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,20,243 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. వీటిల్లో కొత్తగా 4,416 మందికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,26,819కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ కోవిడ్ బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో కరోనాతో ఇద్దరు మరణించారని పేర్కొంది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ కరోనాతో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,069కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 29,127 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి నిన్న 1920 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 6,93,623కి చేరింది.
ఏపీలో కరోనా కేసులు
ఏపీలో కరోనా ఉగ్రరూపం చూపుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 44,516 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 13,212 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ తో ఐదురుగు మరణించారు. రాష్ట్రంలో కోవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,532కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 2,942 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 20,74,600 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో 64,136 యాక్టివ్ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Also Read: కోమాలో ఉన్న తల్లిని కదిలించిన బిడ్డ ఏడుపు.... తల్లి ప్రేమకు నిదర్శనం ఈ ఘటన
దేశంలో కరోనా విజృంభణ
దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. కొత్తగా 3,47,254 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే 29,722 కేసులు ఎక్కువగా వచ్చాయి. ఒక్కరోజులో 2,51,777 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరణాల సంఖ్య కూడా భారీగా పెరిగింది. కొత్తగా 703 మంది కరోనా కారణంగా మృతి చెందారు.
- యాక్టివ్ కేసులు: 20,18,825
- డైలీ పాజిటివిటీ రేటు: 17.94%
దేశంలో ఇప్పటివరకు 9,692 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 20,18,825కి చేరింది. రికవరీ రేటు 93.50%గా ఉంది. మహారాష్ట్రలో కొత్తగా 46,197 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 125 ఒమిక్రాన్ కేసులు వచ్చాయి. 37 మంది మృతి చెందారు. తాజాగా 52,000 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 73,71,757కి చేరింది. మృతుల సంఖ్య 1,41,971కి పెరిగింది. యాక్టివ్ కేసుల సంఖ్య 2,58,569కి చేరింది.
Also Read: కరోనా నేర్పిన గుణపాఠం! బడ్జెట్‌లో 'బూస్టర్ డోస్' తప్పదు!!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి