By: ABP Desam | Published : 10 Jan 2022 08:00 PM (IST)|Updated : 10 Jan 2022 08:00 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
కరోనా కేసులు(ఫైల్ ఫొటో)
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 70,697 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. వీటిల్లో కొత్తగా 1825 మందికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,95,855కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ కోవిడ్ బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో కరోనాతో ఒకరు మరణించారని పేర్కొంది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ కరోనా ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,043కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 14,995 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 1042 కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి ఆదివారం 351 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 6,76,817కి చేరింది.
Also Read: భారత్‌లో విజృంభిస్తున్న ఒమిక్రాన్.. 4 వేలు దాటిన పాజిటివ్ కేసులు, తాజాగా 146 మరణాలు
ఏపీలో కరోనా కేసులు
ఏపీలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 24,280 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 984 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ తో మరణాలు సంభవించలేదు. రాష్ట్రంలో కోవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,505కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 152 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 20,62,732 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో 5606 యాక్టివ్ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Also Read: నకిలీ వార్తలు మనుషుల భావోద్వేగాలను ఎంతగా ప్రభావితం చేస్తాయంటే.... ఓ కొత్త అధ్యయనం
దేశంలో కరోనా కేసులు
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తిపై ప్రభావం చూపినట్లు కనిపిస్తోంది. గత నాలుగైదు రోజులుగా భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో లక్షన్నర వరకు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. భారతదేశంలో కరోనా వైరస్ మరోసారి ఉగ్రరూపం దాల్చుతోంది. గడిచిన 24 గంటల్లో 1,79,723 మంది కరోనా బారిన పడ్డారు. అదే సమయంలో 146 మందిని కరోనా మహమ్మారి బలిగొంది. యాక్టివ్ కేసుల సంఖ్య 7,23,619కు చేరుకుంది. రోజువారీ పాజిటివిటీ రేటు 13.29 శాతానికి పెరిగింది.
Also Read: ఏపీలో కొత్తగా 984 కోవిడ్ కేసులు... 5 వేలు దాటిన యాక్టివ్ కేసులు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Bank Of Baroda Theft Case: బ్యాంకులో చోరీ కేసులో కీలక పరిణామం, ఎట్టకేలకు కోర్టులో లొంగిపోయిన క్యాషియర్ ప్రవీణ్
TRS Office Row : దుమారం రేపుతున్న టీఆర్ఎస్ ఆఫీస్కు స్థల కేటాయింపు - ఉద్యమానికి సిద్ధమవుతున్న విపక్షాలు !
Online Bettings Suicide : ఆన్లైన్ బెట్టింగులకు మరో ప్రాణం బలి, అప్పుల పాలై యువకుడు ఆత్మహత్య
Breaking News Live Updates: ఎచ్చెర్లలో ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య
Child Marriage : బర్త్ డే వేడుకల ముసుగులో బాల్య వివాహం, 12 ఏళ్ల బాలికకు 35 ఏళ్ల వ్యక్తితో పెళ్లి
Ravela Kishore Resign To BJP : ఏపీ బీజేపీకి ఎదురు దెబ్బ - పార్టీ ఉపాధ్యక్షుడు రాజీనామా !
Gun Violence In USA: అమెరికాలో మళ్లీ కాల్పుల మోత- ముగ్గురు మృతి
Ayyanna Vs Ambati Twitter : అంబటి వర్సెస్ అయ్యన్న - ట్విట్టర్లో రచ్చ రచ్చ
Sithara Ghattamaneni: సితార క్యూట్ ఫోటోలు చూశారా?