అన్వేషించండి

TS Constable Jobs: తెలంగాణలో కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ కు హైకోర్టు బ్రేక్, ఎప్పటివరకంటే!

TSLPRB TS Police Constable final result: తెలంగాణలో కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ ను హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. అభ్యర్థులకు 4 మార్కులు కలపాలని బోర్డును ఆదేశించింది.

TSLPRB TS Police Constable final result: 
హైదరాబాద్: తెలంగాణలో కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ కు రాష్ట్ర హైకోర్టు బ్రేకులు వేసింది. తుది పరీక్ష నుంచి 4 ప్రశ్నలు తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. అందరికీ నాలుగు మార్కులు కలిపి ఫలితాలు వెల్లడించాలని ఆదేశించింది. ఈ ప్రక్రియ జరిగిన తరువాతే కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ చేయాలని రాష్ట్ర పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డును హైకోర్టు ఆదేశించింది. 122, 130, 144 ప్రశ్నలను తెలుగులోకి అనువదించలేదని, 57 ప్రశ్న తప్పుగా ఉన్నందున వాటిని ప్రశ్నపత్రం నుంచి తొలగించాలని ఆదేశించింది. దాదాపు 23 ప్రశ్నలకు అభ్యంతరాలు తెలుపుతూ 2022, ఆగస్టు 30వ తేదీన హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. 

కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను పోలీసు నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) అక్టోబరు 4న విడుదల చేసింది. పోలీసుశాఖలోని పలు విభాగాల్లో 16,604 పోస్టులకు 15,750 మంది ఉద్యోగాలకు ఎంపికైనట్లు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ ఒక ప్రకటనలో తెలిపింది. కోర్టులో కేసుల దృష్ట్యా పలు పోస్టులకు ఫలితాలు విడుదల చేయలేదని బోర్డు తెలిపింది. పీటీవోలోని 100 డ్రైవర్ పోస్టులు, విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖలోని 225 పోస్టులకు ఫలితాలు (TS Police Constable Results) కోర్టు కేసుల కారణంగా విడుదల చేయలేదని స్పష్టంచేసింది.

మరోవైపు, పోస్టుల వారీగా ఎంపికైన అభ్యర్థుల జాబితాలో 12,866 మంది పురుషులు, 2,884 మంది మహిళలు ఉన్నారు. ఎంపిక చేసిన అభ్యర్థులకు సంబంధించిన పూర్తి వివరాలు అక్టోబర్ 5వ తేదీ నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతున్నట్టు బోర్డు స్పష్టం చేసింది.

నియామక ప్రక్రియలో కొత్త తగాదాలు
తెలంగాణలో పోలీసు ఉద్యోగాల నియామక ప్రక్రియలో కొత్త తగాదాలు తలెత్తుతున్నాయి. ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీలో బడుగు, బలహీన వర్గాలకు అన్యాయం జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళా అభ్యర్థుల కటాఫ్ మార్కుల కంటే, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల కటాఫ్ మార్కులు చాలా తక్కువగా ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. 

తెలంగాణ పోలీసుశాఖలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 587 సబ్ ఇన్‌స్పెక్టర్;16,604 కానిస్టేబుల్ పోస్టులకు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు గతేడాది నోటిఫికేషన్ విడుదల చేసింది. లక్షల మంది యువత ఈ ఉద్యోగాల కోసం పోటీ పడ్డారు. నోటిఫికేషన్ విడుదలయ్యే నాటికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై కోర్టుల్లో కేసులు ఉన్నాయి. దీంతో ఈ నోటిఫికేషన్‌కు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తించబోవని బోర్డు పేర్కొంది.

కానిస్టేబుల్ పోస్టుల తుది ఫలితాలు, కటాఫ్ మార్కుల వివరాల కోసం క్లిక్ చేయండి..

ప్రిలిమినరీ ఎగ్జామ్ వరకూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు లేవు. కానీ, ఫైనల్ ఎగ్జామ్‌కు ముందట ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పిస్తూ నోటిఫికేషన్‌లో సవరణలు చేశారు. నియామకాల్లో 10 శాతం పోస్టులను ఈడబ్ల్యూఎస్ కింద కేటాయించారు. తుది పరీక్షకు సంబంధించిన ఫలితాలను మూడ్రోజుల క్రితమే పోలీసు నియామక బోర్డు విడుదల చేసింది. ప్రతి జిల్లాలోనూ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల కటాఫ్ కంటే బీసీ, ఎస్సీ, ఎస్టీల కటాఫ్ మార్కులు ఎక్కువగా ఉన్నాయి.

బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళా అభ్యర్థుల కటాఫ్ కంటే కూడా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల కటాఫ్ తక్కువగా ఉంది. ప్రతి జిల్లా, ప్రతి కమిషనరేట్‌లోనూ అత్యల్ప కటాఫ్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులదే ఉంది. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు తక్కువ మంది ఉండటం, వారికి కేటాయించిన పోస్టులు ఎక్కువగా ఉండడం వల్లే వారి కటాఫ్ తక్కువగా ఉందనే అభిప్రాయం వినిపిస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
Hrithik Roshan Vs Kangana Ranaut: సారీ హృతిక్... ఇంటర్నెట్‌లో జెన్ జీ రచ్చ... కంగనా ఫైర్ - అసలు ఏం జరిగిందంటే?
సారీ హృతిక్... ఇంటర్నెట్‌లో జెన్ జీ రచ్చ... కంగనా ఫైర్ - అసలు ఏం జరిగిందంటే?
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Samantha: బేబీ బంప్‌తో సమంత లేటెస్ట్ ఫోటోషూట్... పవర్ ఫుల్ మెసేజ్ కూడా
బేబీ బంప్‌తో సమంత లేటెస్ట్ ఫోటోషూట్... పవర్ ఫుల్ మెసేజ్ కూడా
Embed widget