అన్వేషించండి

Singareni Junior Assistant : సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ -2 ఉద్యోగాల భర్తీ నిలిపివేత - హైకోర్టు ఆదేశం !

సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ -2 ఉద్యోగాల భర్తీని తదుపరి ఆదేశాల వరకూ నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. పరీక్షల్లో అవకతవకలపై అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.

Singareni Junior Assistant :   సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ -2 ఉద్యోగాల భర్తీ విషయంలో తదుపరి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పరీక్షలు, విద్యార్హతలు ఇతర అంశాల్లో అవకతవకలు జరిగాయని కొంత మంది హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు పిటిషనర్లు తన వాదనకు ఆధారాలు చూపించారని.. తదుపరి నిర్ణయం వెలువడే వరకూభర్తీని నిలిపివేయాలని ఆదేశించింది.
Singareni Junior Assistant :  సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ -2 ఉద్యోగాల భర్తీ నిలిపివేత - హైకోర్టు ఆదేశం !
 
జూనియర్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌ – 2 పరీక్షను ఇటీవలే నిర్వహించారు. పరీక్షల నిర్వహణపై  అనేక ఆరోపణలు వస్తున్నాయి. పరీక్షల నిర్వహణ తాము అంతా సక్రమంగానే చేశామని సింగరేణి అధికారులు, అటు జేఎన్‌టీయూ అధికారులు చెబుతునప్పటికీ పరీక్ష జరిగే రోజునే కొంత మంది అభ్యర్ధులను గోవాకు తీసుకెళ్లి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారని, అక్కడే పేపర్‌ లీకైందని ఆరోపణలు వచ్చాయి. అయితే వీటిని కొట్టిపారేసిన సింగరేణి యాజమాన్యం, జేఎన్‌టీయూ అధికారులు హడావుడిగా పరీక్షా ఫలితాలను విడుదల చేశారు.
Singareni Junior Assistant :  సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ -2 ఉద్యోగాల భర్తీ నిలిపివేత - హైకోర్టు ఆదేశం !

70 వేల మంది పరీక్షలు రాయగా అందులో కేవలం 49 వేల మంది పరీక్షలలో అర్హత సాధించారని, వారి మార్కులతోపాటు ర్యాంకులను విడుదల చేశారు. పరీక్ష రాసిన ప్రతి అభ్యర్థి తమకు మార్కులు ఎన్నివచ్చాయో తెలుసుకోవాలనుకుంటున్నారు. కానీ సింగరేణి అధికారులు విడుదల చేయడం లేదు.  అందరి మార్కులు వివరాలు వెల్లడించిన తర్వాత ర్యాంకులు విడుదల చేయాల్సి ఉనప్పటికీ కేవలం అర్హత పేరుతో 49 వేల మంది పలితాలు విడుదల చేయడం ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది. పరీక్ష రాసిన ప్రతి అభ్యర్థి తాను ఎన్ని మార్కులు సాధించాననే విషయం తెలియక ఇప్పుడు గందరగోళంలో పడాల్సిన పరిస్థితి నెలకొంది.
Singareni Junior Assistant :  సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ -2 ఉద్యోగాల భర్తీ నిలిపివేత - హైకోర్టు ఆదేశం !

ఫలితాలలో తప్పులు దొర్లడంతో పాటు ఇప్పుడు ఈ పరీక్షల నిర్వహణ తీరుతో అభ్యర్ధులకు అనేక అనుమానాలు వచ్చాయి. ప్రతీది క్షుణ్ణంగా పరిశీలన చేశామని చెప్పిన అధికారులు ఫలితాలు విడుదల విషయంలో తప్పులు దొర్లడంపై ఇప్పుడు అభ్యర్ధులను గందరగోళానికి గురిచేసింది. కేవలం 177 పోస్టులకు లక్ష మందికి పైగా అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోగా వీరిలో 70 వేల మంది వరకు పరీక్షలకు హాజరయ్యారు. అయితే పరీక్షా పలితాల విడుదలలో తప్పులు దొర్లడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  
  
పరీక్షలకు కేవలం 15 రోజుల ముందు సింగరేణిలో కీలకమైన డైరెక్టర్‌ ‘పా’ పదవిని చంద్రశేఖర్‌ అనే వ్యక్తికి ఇచ్చారు. ఐదు నెలల ముందుగా రిటైర్డ్‌ అయ్యే వ్యక్తికి ఇప్పుడు ఆ పదవి కట్టుబెట్టడంతో సింగరేణిలో పరీక్షల నిర్వహణపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో జేఎంఈ పరీక్షల నిర్వహణ సందర్భంగా జరిగిన అనుమానాలపై అభ్యర్ధులు ఏకంగా హైకోర్టును ఆశ్రయించడం, అప్పుడు ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తికి మళ్లీ పరీక్షల సమయంలో పదవిని ఇవ్వడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. దీంతో అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ భర్తీ వద్దని హైకోర్టు ఆదేశాలిచ్చింది.  హైకోర్టు  ఆదేశాల మేరకు తదుపరి విచారణ తర్వాత అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరిగే అవకాశం ఉంది.  ఉద్యోగాల భర్తీలో సింగరేణి ఎప్పటికప్పుడు పారదర్శకత పాటించకపోతూండటంతోనే సమస్యలు వస్తున్నాయని పలువురు అభ్యర్థులు అసంతృప్తి  వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
YS Jagan:  అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Kohli Completes 1000 Runs Vs KKR: కేకేఆర్ పై వెయ్యి ప‌రుగులు పూర్తి.. ఫిఫ్టీతో స‌త్తా చాటిన విరాట్, ఫ‌స్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ శుభారంభం
కేకేఆర్ పై కోహ్లీ వెయ్యి ప‌రుగులు పూర్తి.. ఫిఫ్టీతో స‌త్తా చాటిన విరాట్, ఫ‌స్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ శుభారంభం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KKR vs RCB IPL 2025 Match Highlights | కేకేఆర్ పై 7వికెట్ల తేడాతో ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ | ABP Desamడీలిమిటేషన్ పై దక్షిణాది యుద్ధంమేము రాజకీయంగా నష్టపోతాంIPL 2025 Captain's Meet | రేపటి నుంచే ఐపీఎల్ మహా సంగ్రామం ప్రారంభం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
YS Jagan:  అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Kohli Completes 1000 Runs Vs KKR: కేకేఆర్ పై వెయ్యి ప‌రుగులు పూర్తి.. ఫిఫ్టీతో స‌త్తా చాటిన విరాట్, ఫ‌స్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ శుభారంభం
కేకేఆర్ పై కోహ్లీ వెయ్యి ప‌రుగులు పూర్తి.. ఫిఫ్టీతో స‌త్తా చాటిన విరాట్, ఫ‌స్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ శుభారంభం
Sushant Singh Rajput Case: నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది ఆత్మహత్యే- తేల్చేసిన సీబీఐ
నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది ఆత్మహత్యే- తేల్చేసిన సీబీఐ
Pawan Kalyan Latest News: పవన్ పేరు చెబితే ర్యాగింగ్ చేశారు- నంద్యాల ఎంపీ శబరి ఆసక్తికర వ్యాఖ్యలు
పవన్ పేరు చెబితే ర్యాగింగ్ చేశారు- నంద్యాల ఎంపీ శబరి ఆసక్తికర వ్యాఖ్యలు
Vizag:  వైజాగ్ బీచ్‌కు మళ్లీ బ్లూఫ్లాగ్ గుర్తింపు - కలెక్టర్ కఠిన చర్యలతో మళ్లీ కళకళ
వైజాగ్ బీచ్‌కు మళ్లీ బ్లూఫ్లాగ్ గుర్తింపు - కలెక్టర్ కఠిన చర్యలతో మళ్లీ కళకళ
Actor Posani Latest News : గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
Embed widget