![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Telangana High Court: బండి సంజయ్ ఫోన్ చూస్తే అన్ని విషయాలు బయటకొస్తాయి: తెలంగాణ ప్రభుత్వం
Telangana High Court: పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో బండి సంజయ్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలోనే బండి.. విచారణకు సహకరించడం లేదని తెలంగాణ సర్కారు తెలిపింది.
![Telangana High Court: బండి సంజయ్ ఫోన్ చూస్తే అన్ని విషయాలు బయటకొస్తాయి: తెలంగాణ ప్రభుత్వం Telangana High Court Hearing on Bandi Sanjay Petition on SSC Paper Leakage Telangana High Court: బండి సంజయ్ ఫోన్ చూస్తే అన్ని విషయాలు బయటకొస్తాయి: తెలంగాణ ప్రభుత్వం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/10/0ddd7bbafe05ae8277c5915bbfe43e301681135860252519_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Telangana High Court: పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిటిషన్ ను హైకోర్టులో విచారణ జరిపింది. ఈ క్రమంలోనే తెలంగాణ సర్కారు.. బండి సంజయ్ విచారణకు సహకరించడం లేదని చెప్పింది. హన్మకొండ జిల్లా కోర్టు విధించిన రిమాండ్ ను కొట్టి వేయాలని కోరుతూ.. బండి సంజయ్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ఇవాళ మరోసారి విచారణ చేపట్టారు. అయితే బండికి బెయిల్ వచ్చినప్పటికీ.. విచారణకు సహకరించడం లేదని తెలంగాణ అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తన మొబైల్ ఫోన్ ను పోలీసులకు ఇవ్వడం లేదని న్యాయస్థానానికి తెలిపారు. ఆయన మొబైల్ ఫోన్ ఇస్తే.. అన్ని విషయాలు బయటకు వస్తాయని వివరించారు. వాదనలు వినిపించేందుకు బండి సంజయ్ తరఫు న్యాయవాది సమయం కోరడంతో ధర్మాసనం విచారణను ఈనెల 21వ తేదీకి వాయిదా వేసింది.
మరోవైపు తన ఫోన్ పోయిందని చెబుతున్న బండి సంజయ్
టెన్త్ పేపర్ లీకేజీ కేసులో విచారణకు రావాలన్న కమలాపురం పోలీసులకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రిప్లై ఇచ్చారు. ఈ కేసులో విచారణ మరిన్ని వివరాలు ఇచ్చేందుకు ఇవాళ విచారణకు రావాలని కమలాపురం పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఫోన్‌తో విచారణకు రావాలని పిలుపునిచ్చారు. అయితే తన ఫోన్ పోయిందని అందుకే విచారణకు రాలేనని చెప్పారు బండి సంజయ్. తన ఫోన్ దొరికే వరకు విచారణకు పిలవద్దని చెప్పారు. ఎంపిగా ఉన్న తనపై లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదని పోలీసులకు చెప్పారు. మరోవైపు ఈ కేసులో తనపై లేనిపోని ఆరోపణలు చేశారని వరంగల్ సీపీ రంగనాథ్‌పై బండి సంజయ్ ఫైట్‌కు సిద్ధమయ్యారు. ఆయనపై కోర్టులో పరువునష్టం దావా వేశారు. రంగనాథ్ ఇష్యూను అంత తేలిగ్గా విడిచిపెట్టబోమన్న బండి... ఆయనపై ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఆయనపై ఓ పెద్ద రిపోర్టు రెడీ చేసినట్టు తెలుస్తోంది. పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీకి కూడా రిపోర్ట్ చేయనున్నట్టు సన్నిహితులు చెబుతున్నారు.
వరంగల్ సీపీ రంగనాథ్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు బండి సంజయ్. తనపై నిరాధార ఆరోపణలు చేయడంతో పాటు విద్యార్థుల జీవితాలను నాశనం చేయాలని చూశారని తనపై లేనిపోని ఆరోపణలు చేశారు కనుక వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఆయన అవినీతి చిట్టా మొత్తం బయటకు తీస్తామన్నారు. తన ఫోన్ సిద్దిపేటలోనే పోయిందని, ప్రస్తుతం తన ఫోన్ సీఎం కేసీఆర్ వద్ద ఉందని ఆరోపించారు. పోలీసులు ఉద్దేశపూర్వకంగానే తన ఫోన్ తిరిగి ఇవ్వడం లేదన్నారు. తన ఫోన్ కాల్స్ కంటే ముందు సీపీ రంగనాథ్ ఫోన్ కాల్ లిస్టు బయటకు తీస్తే అసలు విషయాలు బయటకు వస్తాయన్నారు.
పరువు నష్టం దావా వేసేందుకు సిద్ధమవుతున్న బండి
ఈ క్రమంలోనే పేపర్ లీకేజీ కేసులో వరంగల్ సీపీ రంగనాథ్‌పై పరువునష్టం దావా వేసేందుకు బండి సంజయ్ రెడీ అవుతున్నారు. టెన్త్ క్లాస్ హిందీ పేపర్ లీకేజీ విషయంలో ఎంపీ అయిన తనపై సీపీ రంగనాథ్ నిరాధార ఆరోపణలు చేశారని బండి సంజయ్ కోర్టుకు వెళ్లనున్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)