అన్వేషించండి

"బీజేపీకి మత పిచ్చి పెరిగిపోతోంది, కేసీఆర్‌ను బెదిరించేందుకే ఆ దాడులు"

Gutta Sukender Reddy Fires On BJP: బీజేపీ తన బలాన్ని నిరూపించుకునేందుకే మునుగోడు ఉపఎన్నికను బలవంతంగా తీసుకువచ్చిందని గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తోందని ఆరోపించారు.

Gutta Sukender Reddy Fires On BJP: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారుకు మత పిచ్చి ముదిరిపోతోందని విమర్శించారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడారు. బీజేపీ తన బలాన్ని నిరూపించుకునేందుకు బలవంతంగా మునుగోడు ఉపఎన్నికను తీసుకు వచ్చిందని గుత్తా విమర్శించారు. మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ నాయకులు చాలా డబ్బులను దుర్వినియోగం చేస్తున్నారని గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు.

రోజుకు ఒకరు ఇద్దరు చొప్పున కేంద్ర మంత్రులు మునుగోడులో పర్యటిస్తున్నారని శాసన మండలి ఛైర్మన్ విమర్శించారు. మునుగోడులో ఎన్ని డబ్బులు పంచి పెట్టినా.. అక్కడ ఎగిరేది గులాబీ జెండా అని, గెలిచేది తమ అభ్యర్థేనని గుత్తా సుఖేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు నియోజకవర్గంలో విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేసి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయాలని బీజేపీ ప్రయత్నం చేస్తోందని ఆయన అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా, మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ డబ్బులు పంచి పెడుతోందని విమర్శించారు. 

'కేంద్ర సంస్థల దాడులతో బెదిరింపులు'

ఎన్నికల సంఘం, ఈడీ, సీబీఐ లాంటి కేంద్ర సంస్థలు, దర్యాప్తు సంస్థలు తమ చెప్పు చేతుల్లో ఉండటంతో... రాష్ట్రంలో దాడులు చేయిస్తున్నారని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై, రాష్ట్ర బీజేపీ నాయకులపై ఆయన ఆరోపణలు చేశారు. కె. చంద్రశేఖర్ రావును అడ్డుకోవాలన్న ఉద్దేశంతో ఒక వైపు మునుగోడు ఉపఎన్నిక, మరోవైపు ఈడీ, సీబీఐ దాడులతో టీఆర్ఎస్ నాయకులను బెదిరిస్తోందని గుత్తా మండిపడ్డారు. ఇప్పటికి అయినా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశం కోసం ఆలోచించాలని, రాష్ట్రాల మీద పెత్తనాలు చేయడం తగ్గించుకోవాలని సూచించారు. వందల కోట్లు ఖర్చు పెట్టి బీజేపీ అభ్యర్థికి ఓట్లు పడేలా చేయాలని కేంద్ర మంత్రులను పంపిస్తోందని ఆరోపణలు చేశారు.

'మునుగోడు ప్రజలు చైతన్యవంతులు'

మునుగోడు నియోజకవర్గ ప్రజలు చాలా చైతన్యవంతులన్న గుత్తా సుఖేందర్ రెడ్డి.. బీజేపీ నాయకుల జిమ్మిక్కులకు పడిపోరని అన్నారు. మత కల్లోలాలు రేపే బీజేపీని ఎట్టిపరిస్థితుల్లోనూ గెలిపించరని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ అసమర్ధ పాలన వల్ల డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో పడిపోయిందని, ఇంకా పడిపోతూనే ఉందని ఆయన విమర్శలు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థపై దృష్టి పెట్టడం మాని, మత విద్వేషాలు, కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలను బీజేపీ సర్కారు చేస్తోందని ఆరోపణలు గుప్పించారు. విద్వేషాలు రెచ్చగొట్టి దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం బీజేపీ చేస్తోందని తీవ్ర స్థాయిలో విమర్శించారు. 

'వాటిపై ఉన్న శ్రద్ధ దేశంపై లేదు'

దేశాన్ని అభివృద్ధి చేయడంలో, ఆర్థికంగా పుష్టిగా మార్చడంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని అన్నారు. మత విద్వేషాలు సృష్టించడంపై ఉన్న శ్రద్ధ.. వేరే ఇతర అంశాలపై లేదని చెప్పారు. మోదీ సర్కారు పాలన వైఫల్యాలతో దేశ లౌకికవాదం, మత సామరస్యానికి విఘాతం కలుగుతోందని తెలిపారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget