IPS officers transfer: తెలంగాణలో భారీగా ఐపీఎస్ ల బదిలీలు, ఎవరెవరు ఎక్కడంటే?
IPS officers transfer: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో భారీ ఎత్తున ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. వెయిటింగ్ లో ఉన్నవాళ్లకు పోస్టింగ్ తో పాటు పలువురికి అదనపు బాధ్యతలను అప్పగించింది.

IPS officers transfer: తెలంగాణలో భారీ ఎత్తున ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే వెయిటింగ్ లో ఉన్న కొందరికి పోస్టింగ్ ఇచ్చింది. 29 మంది అధికారులను బదిలీ చేసింది. కొంత మందికి బదిలీలతోపాటు అదనపు బాధ్యతలను కూడా అప్పగించింది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అదనపు డైరెక్టర్ జనరల్ గా పూర్తి అదనపు బాధ్యతలను హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ కు అప్పగించారు. స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఐజీగా సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్రకు పూర్తి అదనపు బాధ్యతలు ఇచ్చారు. నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరిని యాదాద్రి జోన్ డీఐజీగా బదిలీ చేశారు. అయితే నల్గొండకు ఎస్పీని నియమించే వరకూ ఆమే కొనసాగనున్నారు.
టీఎస్ ఎస్పీ బెటాలియన్స్ ఏడీజీగా స్వాతి లక్రా..
మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా డీజీపీ కార్యాలయంలో వ్యవహారాల ఏడీజీ రాజీవ్ రతన్ ను పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా బదిలీ చేశారు. రాజీవ్ రతన్ స్థానంలో గ్రేహౌండ్స్, ఆక్టోపస్ ఏడీజీ కొత్తకోట శ్రీనివాస రెడ్డిని నియమించారు. రైల్వే, రోడ్ సేఫ్టీ ఏడీజీగా ఉన్న సందీప్ శాండిల్యను పోలీసు అకాడమీ డైరెక్టరుగా నియమించారు. డీజీపీయంలో ఏడీజీ (పర్సనల్) గా ఉన్న బి.శి వధర్ రెడ్డిని రైల్వే, రోడ్ సేఫ్టీ ఏడీజీగా బదిలీ చేశారు. టీఎస్ఎస్పీ బెటాలియన్స్ ఏడీజీ అభిలాష బిస్త్ ను డీజీపీ కార్యాలయంలో సంక్షేమం, స్పోర్ట్స్ ఏడీజీగా బదలాయించారు. ఆమెకే హోం గార్డ్ ఏడీజీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఏసీబీ డైరెక్టరుగా ఉన్న శిఖా గోయల్ ను షీ టీములు, భరోసా, మహిళా భద్రత విభాగాలకు ఏడీజీగా బదిలీ చేశారు. ఇప్పటి వరకూ ఈ బాధ్య తలు నిర్వహించిన స్వాతి లక్రాను టీఎస్ ఎస్పీ బెటాలియన్స్ ఏడీజీగా బదిలాయించారు.
టీఎస్ఎల్పీ ఆర్పీ చైర్మన్ గా ఉన్న వీవీ శ్రీనివాసరావుకు పోలీసు కంప్యూటర్ సర్వీసెస్ పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటి వరకూ వెయిటింగ్ లో ఉన్న విజయ్ కుమార్ కు గ్రేహౌండ్స్, ఆక్టోపస్ ఏడీజీగా బాధ్యతలు అప్పగించారు. నార్త్ జోన్ ఏడీజీగా వై.నా గిరెడ్డిని విపత్తు నిర్వహణ, అగ్ని మాపక సేవల డీజీగా బదిలీ చేశారు.
Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
ట్రెండింగ్ వార్తలు





















