Telangana Schools Holiday: తెలంగాణలో మరో 3 రోజులు సెలవులు పొడిగింపు, ప్రభుత్వం ప్రకటన
Telangana Govt: తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన మూడురోజుల సెలవుల గడువు నేటితోనే ముగియనుంది. మరోవైపు, వర్షాలు మాత్రం ఎక్కడా తగ్గుముఖం పట్టలేదు.
![Telangana Schools Holiday: తెలంగాణలో మరో 3 రోజులు సెలవులు పొడిగింపు, ప్రభుత్వం ప్రకటన Telangana govt may extends 3 days holidays to schools collages amid heavy rains Telangana Schools Holiday: తెలంగాణలో మరో 3 రోజులు సెలవులు పొడిగింపు, ప్రభుత్వం ప్రకటన](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/13/c9cf839183b54fd5ddd2eff302efe0781657704309_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
తెలంగాణలో ఇంకా వరదలు తగ్గుముఖం పట్టకపోవడం, ఉత్తర ప్రాంతం మొత్తం వర్షాలతో అతలాకుతలం అవుతుండడం వల్ల అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం మరో మూడు రోజులు సెలవులను పొడిగించింది. గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆగకుండా వర్షం కురుస్తోంది. అందుకని ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగు రోజుల క్రితం సమీక్ష నిర్వహించి విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వాలని నిర్ణయించారు. ఆ మేరకు సోమ, మంగళ, బుధవారాలు అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇచ్చారు. తాజాగా గురు, శుక్ర, శనివారాలు కూడా సెలవులు ప్రకటించారు.
ప్రభుత్వం ప్రకటించిన మూడురోజుల సెలవుల గడువు నేటితోనే ముగియనుంది. మరోవైపు, వర్షాలు మాత్రం ఎక్కడా తగ్గుముఖం పట్టలేదు. పైగా ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో విపరీతంగా వర్షం కురుస్తోంది. చాలా చోట్ల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడుతోంది. అందుకే మరో మూడు రోజులు విద్యా సంస్థలకు సెలవులు పొడిగించింది. దీనిపై నేడు (జూలై 13) మధ్యాహ్నం ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చింది.
తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తుండడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రాబోయే మూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలకు మూడు రోజులు సెలవులు ప్రకటించింది. వారం రోజులుగా హైదరాబాద్‌లో జల్లులు కురుస్తూనే ఉన్నాయి. మరో రెండు మూడు రోజులు ఇలాంటి వర్షాలే ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ క్రమంలోనే మరో మూడు రోజులు సెలవులు పెంచనున్నట్లు తెలుస్తోంది.
కడెం ప్రాజెక్ట్‌కు మూడో ప్రమాద హెచ్చరిక జారీ
కడెం ప్రాజెక్ట్ కు వరద పోటెత్తింది. అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నిజామాబాద్ జిల్లా మెట్‌పల్లి నుంచి కమ్మర్ పల్లి, ఆర్మూర్, నిజామాబాద్ వైపు వెళ్లే వారు ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని హెచ్చరిస్తున్నారు అధికారులు. ఊరికి చెందిన పెద్దచెరువు నిండిన కారణంగా ప్రమాదం పొంచి ఉందని అధికారులు చెబుతున్నారు. మూడు బొమ్మలమేడిపల్లి గ్రామ శివారులో గల పెట్రోల్ బంకు పక్క నుంచి జాతీయ రహదారిపై నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుందని వివరించారు. ఎలాంటి సాహసాలు చేయొద్దని హితవు పలికారు అధికారులు .
Also Read: Kukatpally Theft: హైదరాబాద్‌లో కొత్త గ్యాంగ్ హల్‌చల్ - ఇలాంటివారిని పనిలో పెట్టుకుంటే ఇల్లు గుల్లే!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)