Bharateeyudu 2: భారతీయుడు 2 టికెట్ ధరలు పెంపునకు గ్రీన్ సిగ్నల్, కానీ కొన్ని కండిషన్స్
Telangana Latest News: భారతీయుడు 2 టికెట్ ధరల పెంపు జూలై 12 నుంచి 19వ తేదీ వరకు ఉండనుంది. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
Bharateeyudu 2 Movie Ticket Prices: భారతీయుడు 2 సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ ఓ షరతు విధించింది. ప్రతి థియేటర్‌లో సినిమా ప్రారంభం అయ్యే ముందు డ్రగ్స్, సైబర్ క్రైమ్‌పై ప్రేక్షకులకు అవగాహన కల్పించేలా యాడ్స్ ప్రదర్శించాలని షరతు విధించింది. దీంతో భారతీయుడు 2 సినిమా టికెట్ రేట్లు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.50 మేర పెరగనున్నాయి. మల్టీప్లెక్స్‌ల్లో అయితే, అదనంగా రూ.75 పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం వీలు కల్పించింది.
ఈ టికెట్ ధరల పెంపు సినిమా విడుదల అయ్యే జూలై 12 నుంచి 19వ తేదీ వరకు వర్తించనుంది. టికెట్ ధరల పెంపునకు వెసులుబాటు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అంతేకాక, ఈ వారం రోజులపాటు ఐదో ఆట వేసుకునేందుకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే, సినిమా మొదలు కావడానికి ముందు.. డ్రగ్స్, సైబర్ నేరాలను కట్టడి చేసేలా యాడ్స్ ప్రదర్శించాలని కండీషన్ పెట్టింది.