By: ABP Desam | Updated at : 27 Jul 2022 12:05 PM (IST)
రైతు బీమా పథకానికి దరఖాస్తుల ఆహ్వానం, ఆనందంలో అన్నదాతలు!
Rythu Bheema: తెలంగాణ ప్రభుత్వం రైతుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రైతులకు ఆసరాగా ఉండేందుకు రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలను అందుబాటులోకి తీసుకు వస్తోంది. ఈరోజుల్లో ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎంతో ముఖ్యం. కరోనా మహమ్మారి తర్వాత బీమా పాలసీలపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇఖ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో రైతు బీమా ఒకటి. ఈ పథకంలో చేరిన రైతులకు వారి కుటుంబానికి 5 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. ప్రభుత్వం బీమా సదుపాయం ఉన్న రైతులకు ఎలాంటి లోటు లేకుండా ప్రతిసారి బడ్జెట్ ను కేటాయిస్తోంది.
18 నుంచి 59 ఏళ్ల వయసు గల రైతలు అర్హులు..
అందులో భాగంగానే ఈ రైతు బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ శాఖ సూచిస్తోంది. ఇందులో దరఖాస్తు చేసుకునేందుకు ఆగస్టు ఒకటో తేదీ వరకు గడువును కూడా ఇచ్చింది. అయితే రైతు బీమాకు అర్హులైన కొత్త రైతుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు ఆగస్టు 1వ తేదీ వరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ గడువు నిర్ణయించింది. ఈ పథకం కింద 18 నుంచి 59 ఏళ్ల వయసు గల రైతులకు జీవిత బీమా కల్పించడానికి ప్రీమియం చెల్లించింది. గతేడాది (2021 ఆగ్టు 12 నుంచి 2022 13) ప్రీమియం కింద 35.64 లక్షల మంది రైతుల తరఫున రూ. 1,465 కోట్లను భారతీయ జీవిత బీమా సంస్ఖ అయిన ఎల్ఐసీకి చెల్లించింది.
పాసుబుక్కు జిరాక్సుతో పాటు మరిన్ని...
గతేడాది జూన్ నుంచి ఈ ఏడాది జూన్ 22 వరకూ కొత్తగా భూములు కొని పట్టాదారు పాసు పుస్తకాలు పందిన వారిలో 18 నుంచి 59 ఏళ్ల వయసు గల వారు తమ భూమని ఉన్న గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ)కి దరఖాస్తు ఇవ్వాలి. పట్టాదారు పాసు పుస్తకాలతో పాటు ఆధార్, బ్యాంకు అకౌంట్ పాసు పుస్తకం జిరాక్సులను కూడా అందజేయాలి. తద్వారా వారికి 2022 ఆగస్టు 14 నుంచి ఏడాది పాటు జీవిత బీమా ఉంటుంది. ఏదైనా కారణంతో రైతు మరణిస్తే అతని కుటుంబానికి రూ.5 లక్షలు జీవిత బీమా పరిహారం కింద ఎల్ఐసీ అందజేయాలనేది ఈ పథకం నిబంధన.
అన్నదాతలకు అండంగా..
దీని వల్ల అన్నదాతలు చాలా లాభపడతారని అధికారులు చెబుతున్నారు. ఏ కారణం చేతనైనా రైతు మృతి చెందినట్లయితే.. ఆ రైతు కుటుంబానికి 5 లక్షల సాయాన్ని అందించేలా ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు వివరించారు. దేశానికి వెన్నుముకగా నిలుస్తున్న రైతులకు తెలంగాణ సర్కార్ అండగా నిలుస్తోంది. ఈ స్కీమ్ ద్వారా వారి కుటుంబానికి భరోసా ఇస్తోంది.
GDS Results: ఏపీ, తెలంగాణ జీడీఎస్ ఫలితాలు విడుదల- సర్టిఫికేట్ వెరిఫికేషన్ గడువు ఇదే!
Voter Sahaya Mithra: తెలంగాణ ఓటర్ల కోసం చాట్ బాట్, అందుబాటులోకి తెచ్చిన ఎన్నికల సంఘం
Telangana Elections: 34 అసెంబ్లీ సీట్లు ఇవ్వాల్సిందే, కాంగ్రెస్ బీసీ నేతల నుంచి పెరుగుతున్న డిమాండ్
Kishan Reddy on Modi Telangana Tour: ప్రధాని మోదీ తెలంగాణకు వస్తే కేసీఆర్ కు జ్వరం వస్తుంది - కిషన్రెడ్డి ఎద్దేవా
Indrakaran Reddy: రూ.75 కోట్లతో నిర్మించనున్న అంతర్రాష్ట్ర వంతెనకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి భూమి పూజ
Bigg Boss Telugu 7: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి
IND Vs ENG: ప్రపంచకప్ ప్రస్థానం ప్రారంభించనున్న రోహిత్ సేన - ఇంగ్లండ్‌తో వార్మప్ మ్యాచ్‌కు రెడీ!
Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?
Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?
/body>