అన్వేషించండి
Bakrid Holidays: తెలంగాణలో 2 రోజులు సెలవు ప్రకటించిన ప్రభుత్వం

Bakrid Holidays: తెలంగాణలో 2 రోజులు సెలవు ప్రకటించిన ప్రభుత్వం
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రెండు రోజులు సెలవులు ప్రకటిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ముస్లింల పవిత్ర పర్వదినం సందర్భంగా సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ పండుగకు కాంగ్రెస్ ప్రభుత్వం సెలవు ప్రకటిచింది. ముస్లింలు బక్రీద్ ఎప్పుడు జరుపుకుంటే అప్పుడు సెలవు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. దాంతో బక్రీద్ పండుగ జూన్ 17న జరుపుకుంటే ఆ రోజు, లేకపోతే జూన్ 18న జరుపుకుంటే ఆ రోజు సెలవు ఇవ్వాలని సర్కార్ యోచిస్తోంది. మరోవైపు బక్రీద్ పర్వదినంతో పాటు జూన్ 25న వచ్చే ఈద్-ఎ-గదీర్ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించడం తెలిసిందే.
(ఇది బ్రేకింగ్ న్యూస్. ప్రస్తుతం దీనిని అప్‌డేట్ చేస్తున్నాం. లేటేస్ట్ అప్‌డేట్ కోసం రిఫ్రెష్ చేయండి)ఇంకా చదవండి






















