అన్వేషించండి

Telangana Local Elections: స్థానిక ఎన్నికల నిర్వహణకు మరో 60 రోజులు గడువు కావాలన్న ప్రభుత్వం - తీర్పు రిజర్వ్

TG High Court: తెలంగాణ స్థానిక ఎన్నికల నిర్వహణకు మరో అరవై రోజుల గడువు కావాలని ప్రభుత్వం హైకోర్టును కోరింది. ఈ అంశంపై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

Telangana local Body elections: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే జరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఈ అంశంపై కోర్టులో జరిగిన వాదనల్లో తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు మరో అరవై రోజుల సమయం కావాలని కోరింది. వాదనల్లో ప్రభుత్వం ఎన్ని రోజుల్లో ఎన్నికలు నిర్వహిస్తారో చెప్పాలని ధర్మాసనం ప్రశ్నించింది. దానికి అరవై రోజుల గడువు కోరింది. గతంలో జరిగిన విచారణల్లో గత ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ ఎందుకు నిర్వహించలేదని హైకోర్టు ప్రశ్నించింది. వాదనలు పూర్తి కావడంతో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.                      

తెలంగాణలో  జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీల ఎన్నికల్లో జాప్యంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. గతంలోనే విచారణ జరిగింది.   జనవరి 30, 2025న జరిగిన విచారణలో, హైకోర్టు బెంచ్  పంచాయతీ రాజ్ శాఖను మూడు వారాలలో సమాధానం దాఖలు చేయాలని ఆదేశించింది.  కొంత జాప్యం తర్వాత ఇప్పుడు మళ్లీ విచారణకు  వచ్చింది. గత విచారణలో ప్రభుత్వం ఫిబ్రవరిలోపు ఎన్నికుల నిర్వహిస్తామని చెప్పింది.కానీ ఫిబ్రవరి ముగిసిపోయి మరో నాలుగు నెలలు గడిచిపోయినా ఎన్నికలు నిరవహించలేదు.  ఇప్పుడు మరో అరవై రోజుల సమయం కావాలని ఎన్నికల కమిషన్ హైకోర్టుకు తెలిపింది.               

స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఇది గ్రామీణ ప్రాంతాలలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలను దెబ్బతీస్తోందని పిటిషనర్ విచారణలో వాదించారు. స్థానిక సంస్థల ఎన్నికలు సంవత్సరాలుగా నిర్వహించకపోవడం వల్ల సంబంధిత గ్రామాలకు సంక్షేమ కార్యకలాపాలు అందకుండా పోయాయని పిల్‌లో వాదించారు.              

ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర దాటి పోవడంతో పాటు అన్ని స్థానిక సంస్థలకు సంబందించిన పాలక వర్గాల గడువు ముగిసింది. అన్ని పాలక వర్గాలు ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్నాయి. పంచాయతీల పదవీ కాలం 2024 జనవరి 31వ తేదీన, జిల్లా, మండల పరిషత్‌ల గడువు 2024 జులైలో ముగిసింది. స్థానిక సంస్థలకు పాలక మండళ్లు లేకపోవడం వల్ల కేంద్రం నుంచి వచ్చే నిధుల విడుదలలో జాప్యం జరుగుతోంది.  ఎన్నికలు ఇంకా ఆలస్యం అయితే ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ. 1,500 కోట్లు నష్టం జరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి. 

మరో వైపు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ నుంచి కూడా ఎన్నికలు నిర్వహించాలన్న ఒత్తిడి వస్తోంది. స్థానిక ఎన్నికలు నిర్వహించాలన్న ఉద్దేశంతోనే.. వెంటనే ప్రభుత్వం రైతు భరోసాని అమలు చేసిందని చెబుతున్నారు.  ఈసారి తైరు భరోసాని రైతులందరి ఖాతాల్లో జమ చేశారు. ఇప్పుడు మరో రెండు నెలల గడువు కావాలని హైకోర్టును కోరడంతో.. స్థానిక ఎన్నికలు ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కొంత మంది మంత్రులు.. వచ్చే పది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తుందన్నట్లుగా మాట్లాడటం కూడా వివాదాస్పదం అయింది.           
  


 

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Bonalu Traffic Diversions: బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్‌ మళ్లింపు ఇలా
బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్‌ మళ్లింపు ఇలా
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
Embed widget