Telangana Elections 2023 : కాంగ్రెస్‌తో సీపీఎం కటీఫ్ - ఫస్ట్ లిస్ట్ ప్రకటన !
కాంగ్రెస్‌తో కూటమి ఆలోచనను సీపీఎం విరమించుకుంది. 17 మందితో తొలి జాబితాను ప్రకటించింది.
Telangana Elections 2023 : కాంగ్రెస్ తో కలిసి పోటీ చేాయలన్న ఆలోచనను సీపీఎం విరమించుకుంది. ఇప్పటి వరకూ చర్చలు జరిపినా కాంగ్రెస్ ఏమీ చెప్పకపోవడంతో సొంతంగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నామని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. చర్చల్లో కాంగ్రెస్ వైర్, మిర్యాలగూడ ఇస్తామన్నారని కానీ తర్వాత ఏ విషయం చెప్పడం లేదన్నారు. మిత్రృత్వంలో చప్పట్లో కొట్టాలంటే రెండు చేతులు ఉండాలని.. ఒంటి చేత్తో శబ్దం రాదని తమ్మినేని సీతారాం స్పష్టం చేశార. నిన్ననే నిర్ణయం తీసుకుందామనుకున్నాం కానీ.. భట్టి విక్రమార్క ఫోన్ చేసి.. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దని కోరారన్నారు. అందుకే గురువారం మధ్యాహ్నం వరకూ ఎదురు చూశామన్నారు. కానీ ఎలాంటి స్పందన లేకపోవడంతో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. చర్చల సమయంలో ఎన్నో మెట్లు దిగి మాట్లాడామన్నారు. ఇంత అవమానకరంగా పొత్తులకు వెళ్లాల్సిన ్వసరం లేదని స్పష్టం చేశారు. కమ్యూనిస్టులు ప్రాధాన్యతను నిలబెట్టుకోవాల్సిన అవసరం వచ్చిందని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో విడిగా పోటీ చేయడం తప్ప మరో మార్గం లేదన్నారు.
ఉభయకమ్యూనిస్టు పార్టీలు కలిసి నిర్ణయం తీసుకోలేదు. సీపీఐ పార్టీ ఇంకా నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. రెండు రోజులు ఎదురు చూస్తామని ఆ పార్టీ నేత నారాయణ ప్రకటించారు. అయితే సీపీఎం మాత్రం.. కాంగ్రెస్ పార్టీ సీట్లు ఇచ్చే అవకాశం లేదని గుర్తించి ఒంటరి పోటీకి సిద్ధమయింది. కాంగ్రె్స సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ జిల్లాలో కమ్యూనిస్టు నేతలకు సీట్లే కేటాయిపంును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. లెఫ్ట్ పార్టీలతో పొత్తు అవసరం లేదన్నారు. నాలుగు సీట్లు ఇస్తే ఓడిపోతారని జోస్యం చెప్పారు. హంగ్ అసెంబ్లీ వస్తే అది కాంగ్రెస్‌కి నష్టమవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిచాక రెండు ఎమ్మెల్సీ పదవులతో పాటూ, మరో రెండు మంత్రి పదవులు కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ కోమటిరెడ్డి మాటలను సీపీఎం పట్టించుకోలే్దు.
కమ్యూనిస్టు పార్టీ నేతలు మొదట బీఆర్ఎస్ తో పొత్తులు పెట్టుకోవాలనుకున్నారు. మునుగోడు ఉపఎన్నికల సమయంలో... బ ీఆర్ఎస్ పార్టీ చీఫ్ కేసీఆర్ ప్రత్యేకంగా కమ్యూనిస్టు పార్టీల నేతల్ని ఆహ్వానించి పొత్తులు పెట్టుకున్నారు. మునుగోడులో మాత్రమే కాదని.. తర్వాత కూడా కలిసి పని చేద్దామని ఆయన హామీ ఇచ్చారు. దాంతో మునుగోడులో బీఆర్ఎస్‌కు కమ్యూనిస్టులు మద్దతు ఇచ్చారు. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయానికి కమ్యూనిస్టులతో పూర్తిగా తెగదెంపులు చేసుకున్నారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే పూర్తి స్తాయిలో అభ్యర్థులను విడుదల చేశారు. దీంతో మోసపోయామనుకున్న కమ్యూనిస్టులు..తర్వాత తాము మాత్రమే కలిసి పోటీ చేయాలనుకున్నారు. ఇండియా కూటమిలో కలిసి పని చేస్తున్నందున .. కాంగ్రెస్ తో కలిసి పోటీ చేయాలని తర్వాత భావించి చర్చలు జరిపారు. చెరో రెండు సీట్లు ఇవ్వడానికి కాంగ్రెస్ అంగీకరించినా తర్వాత పరిస్థితి మారిపోయింది.