అన్వేషించండి

Telangana Elections 2023 : కోనప్పా ఇక ఆంధ్రా వెళ్లిపో - సిర్ఫూర్‌లో బండి సంజయ్ వార్నింగ్ !

Bandi sanjay : సిర్పూర్ ఎమ్మెల్యేపై బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక ఆంధ్రా వెళ్లిపోవాలని సూచించారు.


Telangana Elections 2023 Bandi Sanjay On Koneru Konappa :  సిర్పూర్ :     సిర్పూర్ కాగజ్ నగర్ బీజేపీ అభ్యర్ధిగా డాక్టర్ పాల్వాయి హరీష్ రావు ఈరోజు నామినేషన్ వేసిన సందర్భంగా సిర్పూర్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో బండి సంజయ్ మాట్లాడారు.  ‘‘తెలంగాణలో తొలి ఓటరున్న నియోజకవర్గం సిర్పూర్ కాగజ్ నగర్... బీజేపీ తొలి విజయం కూడా ఇక్కడే... కోనప్పా.... ఇక చాలప్ప...ఇగ ఆంధ్రాకు వెళ్లిపో అప్పా...10 ఏళ్ల కింద ఈ నియోజకవర్గం ఎట్లుందో ఇప్పుడట్లనే ఉంది. బస్టాండ్ లేదు. ఆసుపత్రి లేదు.. మరి ఏం పీకడానికి ఎమ్మెల్యే ఉన్నడు? ఆయనకు ఎందుకు ఓటేయాలి? అని ప్రశ్నించారు.  ఎంతో మంది రైతులున్నరు.  కానీ వంద ఎకరాలకైనా సాగునీరిచ్చిండా? అని బండి సంజయ్ ప్రశ్నించారు.  నదులకు నడక నేర్పిన ఇంజనీర్ కేసీఆర్ కు కాగజ్ నగర్ రైతులు కనబడతలేదా? ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు మేడిగడ్డకు పోతే మరి ఇక్కడి రైతుల సంగతేందని అడగడు.. బ్రిడ్జి లు కావాలని, రోడ్లు కావాలని అడగడు. ఏమైనా అంటే కేంద్రం నిధులిస్తలేదని బద్నాం చేసుడు తప్ప ఆయన చేసిన పని ఒక్కటైనా ఉందా? వార్థా నది మీద ప్రాజెక్ట్ కడతానని మాయమాటలు చెబుతూ మళ్లీ ఎన్నికల్లో లబ్ది పొందాలని చూస్తున్నడని బండి సంజయ్ ఆరోపించారు. 

కేవలం అధికారం, డబ్బు తో ఎలక్షన్ లో గెలవాలనుకుంటున్నడే తప్ప ఏనాడైనా ఫలానా పని చేశాను? ఫలానా చోట అభివ్రుద్ధి చేశానని చెప్పిండా?  పల్లెల్లోకి పోయి ఓపెన్ గా ప్రజలతోముఖముఖి ఏర్పాటు చేసి అభివృద్ది చెప్పే ధైర్యం ఉందా? అని బండి సంజయ్ ప్రశ్నించారు.  ఎమ్మెల్యే కోనేరు కొనప్ప సొంత ఎజెండా తో కాంట్రాక్టు లు తన సొంత మనుషులకే ఇస్తున్నాడు. అంబలి, అన్నదానం చేస్తున్నానని ప్రచారం చేసుకుంటాడే తప్ప ప్రజల అభివృద్ది గురించి మాత్రం పట్టించుకోడు. నియోజక వర్గంలో వ్యాపారాలను అన్ని కంట్రోల్ చేస్తున్నాడు. కనీస సౌకర్యాలు కల్పించక ఏ ముఖం తో ఓట్లు అడుగుతున్నడో చెప్పాలన్నారు. 

 కొనప్పా అతని సోదరులు లిక్కర్ వ్యాపారం, బియ్యం దందా తో పాటు మట్కా ప్రోత్సహిస్తున్నారు. ఎస్పీ ఎం కంపెనీ లో ఇప్పుడు లోకల్  వాళ్ళ కన్నా నాన్ లోకల్, నార్త్ ఇండియా వాళ్ళే ఎక్కువ ఉన్నరు. లోకల్ వాళ్ళ కోసం కంపెనీ తెరిపించారా లేక నాన్ లోకల్ వాళ్ళ కోసం తెరిచారా? మన రాష్ట్రం ప్రజల సొమ్ముతో సబ్సిడీ లు ఇస్తూ వేరే రాష్ట్రం వ్యక్తులకు మేలు చేస్తే లాభం చేస్తారా? లోకల్ నిరుద్యోగుల కోసం ఒక కొత్త కంపెనీ ఏర్పాటు చేసే ఆలోచన కూడా చేయలేదు. ఇంత నిర్లక్ష్యమా? అని పరశ్నించారు.  అంబలి, అన్నదానం తప్ప అభివ్రుద్ధి చేసినవా? అభివ్రుద్ధి జరగకపోతే.. ఉద్యోగాలియ్యకపోతే రాజీనామా చేసి వెళ్లిపోవాలే తప్ప ఇంకా ఎందుకు పోటీ చేస్తున్నట్లు? చేసిన పాపాలన్నీ పోవాలని, మళ్లీ గెలవాలని అన్నదానం చేస్తే గెలుస్తాననుకుంటున్నవా? నువ్వు చేసిన పాపాలు ఊరికే పోవన్నారు. 

 ఎస్పీఎం కంపెనీ నడుపుతున్న జేకే యాజమాన్యం మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే కోనేరు కొనప్ప కుమ్కక్కై కార్మికుల, ఉద్యోగుల పొట్ట కొడుతున్నరు. కంపెనీ రీ ఓపెన్ చేశామని చెప్పే సర్కార్, ఎమ్మెల్యే లు కంపెనీ తెరిచిన తర్వాత ఎంతమంది స్థానికులకు మేలు చేశారో దమ్ముంటే సమాధానం చెప్పాలి? సిర్పూర్ ను అభివ్రుద్ధి ఎందుకు చేయడం లేదని కేసీఆర్ ను నిలదీసే దమ్ముందా కోనప్పకు... మీ కోసం పోరాడితే జైలుకు పోయిన చరిత్ర పాల్వాయి హరీష్ ది... కోవిడ్ తో బాధపడుతున్నా వినకుండా హరీష్ ను గుంజుకుపోయి జైల్లో వేయించిన నీచుడు కోనప్ప... అయినా భయపడకుండా పోరాడిన చరిత్ర హరీష్ రావు కుటుంబానిదేనన్నారు. 

మీకోసం కొట్లాడిన పార్టీ బీజేపీ అని  ప్రజలకు బండి సంజయ్ చెప్పారు.  50 లక్షల మంది నిరుద్యోగులు, 40 లక్షల మంది రైతులు, లక్షలాది మంది రైతులు, విద్యార్థులు, మహిళల పక్షాన యుద్దం చేసినం. కేసులు పెట్టినా జైలుకు పంపినా భయపడకుండా మీకు అండగా ఉన్నం... తెలంగాణలో జరుగుతున్న అభివ్రుద్ధి నిధులన్నీ కేంద్రానివే...  జీతాలే ఇయ్యలేనోడు మళ్లీ అధికారంలోకి వస్తే అప్పులెలా తీరుస్తడు. జీతాలెట్ల ఇస్తడు. ఉన్న భూములన్నీ అమ్మేసిండు. గల్లీగల్లీకి మద్యం షాపులు పెట్టిండు.. ఇగ అమ్మడానికి ఏమీ లేవు. మరెట్లా జీతాలెస్తడో చెప్పాలన్నారు.  దళిత బందు..BC బందుల పేరు మీదే దళిత, బలహీన వర్గాల దగ్గర కమిషన్లు మింగిన రాబందులు మీరు...గెలుస్తానని ఎట్లనుకున్నరు? 50 లక్సల మంది నిరుద్యోగుల జీవితాలను నాశనం చేస్తివి. 40 లక్షల మంది రైతులను అరిగోస పెడితివి. పేపర్ లీకులతో, పరీక్ష నిర్వహించడం చేతగాక లక్షల మంది విద్యార్థులను ఆగం చెసినవ్.. ఉద్యోగులను ఆగమాగం చేస్తివి. కన్పించిన భూమినల్లా కబ్జా చేస్తివి. కమీషన్ల పేరుతో లక్షల కోట్లు దోచుకుంటివి. గెలిచినప్పటి నుండి ఫాంహౌజ్ కే పరిమితిమై కులుకుతుంటివి. 4 కోట్ల మంది ప్రజల ఉసురు పోసుకుంటివి. ఎట్లా గెలుస్తాననుకున్నవని బండి సంజయ్ ప్రశఅనించారు.  

 సిగ్గు లేకుండా మళ్లీ గెలిచేందుకు కేసీఆర్ కాంగ్రెస్, ఎంఐఎం తో కలిసి కుట్ర చేస్తున్నడన్నారు.  ఒవైసీ వావివరసలు మర్చేసి కేసీఆర్ ను మామ అంటున్నడు... ఎన్నికలకు ముందు అన్నదమ్ములట... ఎన్నికలొస్తే మామా అల్లుళ్లట...ఎన్నికలయ్యాక బావ బామ్మర్థులట. ఇవేం వరసలు? ఇట్లాంటోళ్లను ఓడించాలని పిలుపునిచ్చారు.   సిర్పూర్ లో 80 శాతం మంది ఓటు బ్యాంకు మారి బీజేపీని గెలిపిస్తే కబ్జా చేరలో ఉన్న గోండు ఖిల్లాను విడిపించి మీకు అప్పగించే బాధ్యత తాను తీసుకుంటానని బండి సంజయ్ భరోసా ఇచ్చారు.  సిర్పూర్ కాగజ్ నగరలో ఎంఐఎం అరాచకాలను ఎట్లా భరిస్తున్నరు? ఒక వర్గానికే చెందిన వాళ్లు ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు అవుతుంటే మీరేం చేస్తున్నరని ప్రస్నించారు. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni Christmas Santa | జివా అడిగితే ధోనీ చేయకుండా ఉంటాడా | ABP DesamChiranjeevi Meeting CM Revanth Reddy | సినీ పరిశ్రమ సమస్యలపై సీఎంతో భేటీ | ABP Desamకశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Bumrah VS Ashwin: అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
AP Telangana Latest Weather Updates: తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
Tirumala: జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ 
జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ 
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Embed widget