Doctor MLAS: తెలంగాణ ఎన్నికల ఫలితాలు - ఈ ఎమ్మెల్యేలు డాక్టర్లు!
Telangana Elections Results 2023: తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో 15 మంది డాక్టర్లు ఎమ్మెల్యేలుగా సత్తా చాటారు. వైద్యులుగా సేవలందించిన వీరు ప్రజా సేవలోనూ నిమగ్నం కానున్నారు.
Doctor MLAs Won in Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయ్. బీఆర్ఎస్ పదేళ్ల అధికార జోరుకు 'కాంగ్రెస్' బ్రేకులు వేసింది. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 64 స్థానాల్లో 'హస్తం' జయకేతనం ఎగురవేసింది. అయితే, ఈ ఫలితాల్లో కొన్ని నియోజకవర్గాల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకున్నాయి. ఓ చోట తండ్రి ఓడిపోగా, మరో చోట కొడుకు గెలుపొందారు. మల్కాజిగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావు, బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆయన కుమారుడు రోహిత్ మెదక్ నుంచి బరిలో దిగి విజయం సాధించారు. ఓ చోట అన్నదమ్ములు గెలువగా, మరో చోట అన్నదమ్ములు ఓటమి చవి చూశారు. కోమటిరెడ్డి, గడ్డం సోదరులు ఈ ఎన్నికల్లో విజయం సాధించగా, ఎర్రబెల్లి సోదరులు ఓడిపోయారు. కొందరు ఈ ఎన్నికల్లో గెలిచి తొలిసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారు. పాలకుర్తిలో సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ నేత, సాక్షాత్తు మంత్రిగా పని చేసిన ఎర్రబెల్లి(BRS)ని కాంగ్రెస్ అభ్యర్థిని, 26 ఏళ్లు కూడా నిండని యశస్విని రెడ్డి ఓడించడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో ఈమెనే యంగెస్ట్ ఎమ్మెల్యే. ఎన్నికల్లో సుడిగాలి పర్యటనలతో ఓటర్లను ఆకట్టుకున్న ఈమె విజయాన్ని ఖరారు చేసుకున్నారు. మరో విచిత్రం ఏంటంటే ఈ ఎన్నికల్లో 15 మంది ఎమ్మెల్యేలు డాక్టర్లు కావడం విశేషం.
డాక్టర్ ఎమ్మెల్యేలు వీరే
నిజామాబాద్ రూరల్ లో కాంగ్రెస్ అభ్యర్థి రేకుల డాక్టర్ భూపతి రెడ్డి తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్థన్ పై గెలుపొందారు. కోరుట్లలో బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, నాగర్ కర్నూల్ నుంచి రాజేశ్ రెడ్డి, మెదక్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డిపై గెలుపొందారు. మహబూబాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ మురళీ నాయక్, ప్రణీతారెడ్డి (నారాయణపేట), సిర్పూర్ లో బీజేపీ అభ్యర్థి డాక్టర్ పాల్వాయి హరీష్ విజయం సాధించారు. సత్తుపల్లి నుంచి మట్టా రాగమయి, డోర్నకల్ నుంచి రామచందర్ నాయక్ (కాంగ్రెస్), నారాయణఖేడ్ నుంచి సంజీవరెడ్డి (కాంగ్రెస్), మానకొండూరు నుంచి డాక్టర్ సత్యనారాయణ, భద్రాచలం నుంచి డాక్టర్ తెల్లం వెంకట్రావు, అచ్చంపేటలో వంశీకృష్ణ (కాంగ్రెస్), చెన్నూర్ లో డాక్టర్ వెంకటస్వామి (కాంగ్రెస్), జగిత్యాల నుంచి డాక్టర్ ఎం.సంజయ్ కుమార్ (బీఆర్ఎస్) గా విజయం సాధించారు. వైద్యులుగా సేవలందించిన, అందిస్తున్న వీరు ప్రజా సేవలోనూ నిమగ్నం కానున్నారు.
Also Read: Kamareddy News: కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్‌కు షాక్ ఇచ్చిన వెంకటరమణారెడ్డి