అన్వేషించండి

Telangana officers Transfers : గడల శ్రీనివాసరావుకు షాకిచ్చిన కాంగ్రెస్ సర్కార్ - అప్రాధాన్య పోస్టుకు బదిలీ !

Gadala Srinivasa Rao transfer : తెలంగాణ డైరక్టర్ ఆఫ్ హెల్త్ గడల శ్రీనివాసరావును ప్రభుత్వం బదిలీ చేసింది. బీఆర్ఎస్ తరపున కొత్త గూడెం టిక్కెట్ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు.


Telangana Director of Health Gadala Srinivasa Rao :  రాష్ట్రంలో కొలువుదీరిన రేవంత్ రెడ్డి సర్కార్ వివిధ శాఖలలోని ఉన్నతాధికారులను బదిలీ చేస్తోంది. ఇప్పటికే పలవురు ఐఏఎస్, ఐపీఎస్ లకు స్థానచలనం కల్పించిన ప్రభుత్వం.. తాజాగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌గా డాక్టర్ రమేశ్ రెడ్డి స్థానంలో త్రివేణిని నియమించింది. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ గడల శ్రీనివాసరావు స్థానంలో డాక్టర్ రవీంద్ర నాయక్‌ను నియమిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.                   

గడల శ్రీనివాసరావు.. పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరిది. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు సుదీర్ఘ కాలంగా అదే పోస్టులో ఉన్నారు. కరోనా సమయంలోనూ ఆయనే కీలకంగా విధులు నిర్వర్తించారు. అయితే ఆయనకు రాజకీయ నేతగా మారాలన్న కోరిక ఎక్కువ. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయన వీర విధేయత ప్రకటించేవారు. ఓ సారి కాళ్లకు నమస్కారం  చేశారు. ఆయన కొత్తగూడెం నియోజకవర్గాన్ని ఎంచుకుని తరచూ అక్కడ పర్యటించేవారు.                                                                                               

కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయటం కోసం గడల శ్రీనివాసరావు చివరి వరకూ ప్రయత్నించారు.  కొత్తగూడెంలో పలు సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారు. ఓ స్వచ్చంద సంస్థను ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు  చేపట్టారు.  కొత్తగూడెంలో కార్యక్రమాలు పెట్టినప్పుడల్లా ఏదో ఒక వివాదానికి కేంద్ర బిందువుగా మారుతూ ఉండేవారు.  గతంలో ఓ ఐఎఎస్ అధికారి కేసీఆర్ కి వీరవిధేయుడిగా మారి, ఆయన కాళ్లకు నమస్కరించారు. తర్వాత ఆయన తన పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్సీ అయిపోయారు. ఇదే తరహాలో శ్రీనివాసరావు కూడా ప్రయత్నించారు.                                      

 కేసీఆర్ తనకు టికెట్ ఇస్తారని చివరి వరకు ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున నియోజకవర్గంలో పర్యటనలు చేస్తూ ప్రజలకు చేరువ అయ్యే ప్రయత్నాలు చేశారు. కానీ గులాబీ అధినేత టికెట్ నిరాకరించడంతో సైలెంట్ అయ్యారు. ఈ క్రమంలో అతడి వైఖరిపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తం కాగా తాజాగా రేవంత్ రెడ్డి సర్కార్ అతడికి స్థాన చలనం కల్పించింది. ఆయన పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్‌లో చేరుతారో లేకపోతే ప్రభు్తవం ఇచ్చిన  పోస్టింగ్ లో ఉంటారో చూడాల్సి ఉంది.            

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News: రెండు గ్రూపులుగా సచివాలయాల ఉద్యోగులు- ప్రభుత్వం సంచలన నిర్ణయం
రెండు గ్రూపులుగా సచివాలయాల ఉద్యోగులు- ప్రభుత్వం సంచలన నిర్ణయం
TTD Board Chairman :  అర గంటలో మారిన స్వరం- భక్తులకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ 
అర గంటలో మారిన స్వరం- భక్తులకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ 
PM Modi Podcast :  నా సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోలేదు  - తొలి పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోదీ
నా సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోలేదు - తొలి పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోదీ
Fun Bucket Bhargava:  ఫన్ బకెట్ భార్గవకు ఇరవై ఏళ్ల జైలు శిక్ష - మైనర్‌ను రేప్ చేసినందుకు పోక్సో కోర్టు శిక్ష
ఫన్ బకెట్ భార్గవకు ఇరవై ఏళ్ల జైలు శిక్ష - మైనర్‌ను రేప్ చేసినందుకు పోక్సో కోర్టు శిక్ష
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Prathyusha Challa Case | అతుల్ సుభాష్ కేసును గుర్తు చేస్తున్న మరో కేసు | ABP DesamPawan Kalyan vs YS Jagan | జగన్, పవన్ ఎదురెదురు పడిన ఘటన..తీవ్ర ఉద్రిక్తత | ABP DesamYanam Fruit and Flower Show | పుష్ప అంట్లే ఫ్లవర్ అనుకుంటివా...కాదు యానాం ఫ్లవర్ | ABP DesamFun Bucker Bhargav 20Years Sentence | సంచలన తీర్పు ఇచ్చిన విశాఖ పోక్సో కోర్టు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News: రెండు గ్రూపులుగా సచివాలయాల ఉద్యోగులు- ప్రభుత్వం సంచలన నిర్ణయం
రెండు గ్రూపులుగా సచివాలయాల ఉద్యోగులు- ప్రభుత్వం సంచలన నిర్ణయం
TTD Board Chairman :  అర గంటలో మారిన స్వరం- భక్తులకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ 
అర గంటలో మారిన స్వరం- భక్తులకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ 
PM Modi Podcast :  నా సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోలేదు  - తొలి పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోదీ
నా సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోలేదు - తొలి పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోదీ
Fun Bucket Bhargava:  ఫన్ బకెట్ భార్గవకు ఇరవై ఏళ్ల జైలు శిక్ష - మైనర్‌ను రేప్ చేసినందుకు పోక్సో కోర్టు శిక్ష
ఫన్ బకెట్ భార్గవకు ఇరవై ఏళ్ల జైలు శిక్ష - మైనర్‌ను రేప్ చేసినందుకు పోక్సో కోర్టు శిక్ష
Ashwin In Politics: రాజకీయ చదరంగంలోకి అశ్విన్..!!l తమిళ పాలిటికల్‌ ఎంట్రీ కోసమే హిందీ వ్యతిరేక వ్యాఖ్యలా!
రాజకీయ చదరంగంలోకి అశ్విన్..!!l తమిళ పాలిటికల్‌ ఎంట్రీ కోసమే హిందీ వ్యతిరేక వ్యాఖ్యలా!
Telangana News: తెలంగాణలో చేనేత కార్మికులకు గుడ్ న్యూస్- అభ‌య‌హ‌స్తం ప‌థ‌కం మార్గదర్శకాలు జారీ
తెలంగాణలో చేనేత కార్మికులకు గుడ్ న్యూస్- అభ‌య‌హ‌స్తం ప‌థ‌కం మార్గదర్శకాలు జారీ
Pawan Kalyan Tour In Pithapuram: క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఎందుకు? టీటీడీని ప్రశ్నించిన పవన్ కల్యాణ్‌
క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఎందుకు? టీటీడీని ప్రశ్నించిన పవన్ కల్యాణ్‌
NTR Nagar:  జగన్‌కు మరో షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం - సెంటు స్థలాల కాలనీలకు కొత్త పేరు ఖరారు!
జగన్‌కు మరో షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం - సెంటు స్థలాల కాలనీలకు కొత్త పేరు ఖరారు!
Embed widget