IPL, 2022 | Match 70 | Wankhede Stadium, Mumbai - 22 May, 07:30 pm IST
(Match Yet To Begin)
SRH
SRH
VS
PBKS
PBKS
IPL, 2022 | Qualifier 1 | Eden Gardens, Kolkata - 24 May, 07:30 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
RR
RR

Revanth Reddy: దిల్లీలో బీజేపీ, టీఆర్ఎస్ వీధి నాటకాలు... కేసీఆర్ కుటుంబ అవినీతిపై విచారణ చేయలేదే?.. రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్

బీజేపీ, టీఆర్ఎస్ రాజకీయ క్రీడలో తెలంగాణ రైతాంగం బలి అవుతుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం అవినీతి చేస్తుందన్న అమిత్ షా దర్యాప్తునకు ఎందుకు ఆదేశించలేదని ప్రశ్నించారు.

FOLLOW US: 

గత రెండు నెలలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అమానుష క్రీడలో అమాయక రైతులు బలి అవుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. దిల్లీ వేదికగా బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు తెలంగాణ ప్రజల పరువు తీస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలకు వివరించాలని అమిత్ షా బీజేపీ నేతలకు సూచించారని, అన్ని వివరాలు తెలిసినా అమిత్ షా కేసీఆర్ కుటుంబ అవినీతిపై ఎందుకు విచారణకు ఆదేశించడం లేదన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ కు మధ్య ఉన్న అనుబంధం, ఒప్పందం బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సమాజాన్ని బీజేపీ, టీఆర్ఎస్ రెండు కలసి మోసం చేస్తున్నాయన్నారు. బండి సంజయ్, కిషన్ రెడ్డిలు ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతున్నారని విమర్శించారు. తెలంగాణలో చాలదన్నట్లు టీఆర్ఎస్, బీజేపీ నేతలు దిల్లీలో వీధి నాటకాలు మొదలుపెట్టారన్నారు. 

Also Read: హైదరాబాద్ పేరు మార్పు అంశం మరోసారి తెరపైకి.. హాట్ టాపిక్‌గా ఆ ట్వీట్..!

సునీల్ అనే వ్యూహకర్త డైరెక్షన్ లో కేసీఆర్ 

'రబీ సీజన్ లో పండిన ధాన్యం కొనుగోలు చేసే అంశంపై మాట్లాడకుండా మళ్లీ వర్షాకాలంలో పండే పంట గురించి తెలంగాణ మంత్రులు మాట్లాడుతున్నారు. రాజకీయ వైషమ్యాలను రెచ్చగొట్టి ప్రయోజనం పొందడం తప్ప రైతాంగ ప్రయోజనాలను సీఎం కేసీఆర్ పట్టించుకోవడంలేదు. టీఆర్ఎస్, బీజేపీ నేతలు వీధి బాగోతాలు ఆడుతున్నారు. కాంగ్రెస్ కు ప్రజల్లో ఉన్న ఆదరణను పక్కదోవ పట్టించేందుకు ఈ నాటకాలు ఆడుతున్నారు. వరి ధాన్యం కొనుగోలు అంశంపై అమిత్ షా డైరెక్షన్ లో కేసీఆర్ రాజకీయ నాటకాలు ఆడుతున్నారు. కేసీఆర్ తన వ్యూహాల మీద నమ్మకం కోల్పోయి, సునీల్ అనే రాజకీయ వ్యూహకర్త డైరెక్షన్ లో నడుస్తున్నారు. సునీల్ అనే వ్యూహకర్త  బీజేపీ టీఆర్ఎస్ పార్టీలకు నాయకుడిగా మారారు. త్వరలో అన్ని బయటపెడతాను.' అని రేవంత్ రెడ్డి అన్నారు. 

Also Read:  పీయూష్ గోయల్ వ్యాఖ్యలు దుర్మార్గం, క్షమాపణ చెప్పాల్సిందే.. మంత్రి హరీశ్ డిమాండ్

టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై సీబీఐ దర్యాప్తు

గత సంవత్సరం రబీలో 52 లక్షల ఎకరాల్లో వరి పండిస్తే, ఈ రబీలో వరి సాగు చేయవద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నాయని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం 3 వేల కోట్ల రూపాయలు ఇంటెన్సివ్ గా ప్రకటిస్తే, ఉత్పత్తి అయిన మొత్తం ధాన్యం ఎగుమతి చేయవచ్చన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి బాగోతం తెలుసు అంటున్న కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై సీవీసీ, సీబీఐతో దర్యాప్తు జరిపించాలన్నారు. తెలంగాణలో ఎస్టీ రిజర్వేషన్ ల పెంపుపై ఎటువంటి ప్రతిపాదన అందలేదని కేంద్రం అంటోందని, దీన్ని బట్టి గిరిజనులపై టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి తెలుస్తుందన్నారు. 

Also Read: సరకులు కొంటే క్యారీ బ్యాగ్ ఫ్రీ ఇవ్వాల్సిందే.. ఆ డీమార్ట్ లో మీ డబ్బులు తిరిగిచ్చేస్తారు వెళ్లండి!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 22 Dec 2021 08:59 PM (IST) Tags: BJP trs revanth reddy TS News TPCC Paddy cultivation

సంబంధిత కథనాలు

Shekar Movie : జీవిత, రాజశేఖర్ కు భారీ షాక్, శేఖర్ సినిమా ప్రదర్శన నిలిపివేత

Shekar Movie : జీవిత, రాజశేఖర్ కు భారీ షాక్, శేఖర్ సినిమా ప్రదర్శన నిలిపివేత

Breaking News Live Updates: రాజశేఖర్ నటించిన 'శేఖర్' సినిమా ప్రదర్శన నిలిపివేత

Breaking News Live Updates: రాజశేఖర్ నటించిన 'శేఖర్' సినిమా ప్రదర్శన నిలిపివేత

Secunderabad: లిఫ్టులో చీర కొంగు అడ్డు పెట్టి మహిళ పాడు పని, సీసీటీవీ కెమెరాల్లో మొత్తం రికార్డు - అవాక్కైన పోలీసులు

Secunderabad: లిఫ్టులో చీర కొంగు అడ్డు పెట్టి మహిళ పాడు పని, సీసీటీవీ కెమెరాల్లో మొత్తం రికార్డు - అవాక్కైన పోలీసులు

Karimnagar: రాష్ట్రం ఆ పని చేస్తే పెట్రోల్ రూ.80కే ఇవ్వొచ్చు - బండి సంజయ్ వ్యాఖ్యలు

Karimnagar: రాష్ట్రం ఆ పని చేస్తే పెట్రోల్ రూ.80కే ఇవ్వొచ్చు - బండి సంజయ్ వ్యాఖ్యలు

Road Accidents: తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరు ఘోర ప్రమాదాలు - నేడు 11 మంది అక్కడికక్కడే దుర్మరణం

Road Accidents: తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరు ఘోర ప్రమాదాలు - నేడు 11 మంది అక్కడికక్కడే దుర్మరణం
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

JC Prabhakar Reddy : మంత్రుల బస్సు యాత్రపై రాళ్లు పడే అవకాశం, జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

JC Prabhakar Reddy : మంత్రుల బస్సు యాత్రపై రాళ్లు పడే అవకాశం, జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Rainbow Island: సప్తవర్ణాల దీవి, అందులోని మట్టితో సాస్, మసాలాల తయారీ

Rainbow Island: సప్తవర్ణాల దీవి, అందులోని మట్టితో సాస్, మసాలాల తయారీ

Rashmi Gautham: పింక్ చీరలో బుట్టబొమ్మలా రష్మీ గౌతమ్

Rashmi Gautham: పింక్ చీరలో బుట్టబొమ్మలా రష్మీ గౌతమ్

Kakinada News : డ్రైవర్ హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుకు బిగిస్తున్న ఉచ్చు, పోస్ట్ మార్టంలో వెలుగు చూసిన నిజాలు!

Kakinada News :  డ్రైవర్ హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుకు బిగిస్తున్న ఉచ్చు,  పోస్ట్ మార్టంలో వెలుగు చూసిన నిజాలు!