KCR Maharashtra Visit: పండరీపూర్ విట్టల్ రుక్మిణీ దేవి ఆలయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు - పట్టు వస్త్రాల సమర్పణ
KCR Maharashtra Visit: మహారాష్ట్ర పండరీపూర్ విట్ల్ రుక్మిణీ దేవి ఆలయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు.
KCR Maharashtra Visit: మహారాష్ట్ర పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పండరీపూర్ వెళ్లి శ్రీ విట్టల్ రుక్మిణీ దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆ తర్వాత అమ్మవారి పాదాలను పసుపు, కుంకుమలతో అలంకరించి మొక్కుకున్నారు. ఆలయ అర్చకులు సీఎం కేసీఆర్ మెడలో తులసీ మాల వేసి వేదమంత్రాలతో ఆశీర్వాదం అందజేశారు.
పండరిపూర్ లో శ్రీ విట్ఠల్ రుక్మిణీ దేవీ ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్.
— BRS Party (@BRSparty) June 27, 2023
CM Sri KCR offered special pooja at Shri Vitthal Rukmini Devi Temple in Pandharpur, Maharashtra. pic.twitter.com/5xBgyWcX5F
BRS President, CM Sri K. Chandrashekhar Rao today offered prayers at Shri Vitthal Rukmini Devi Temple in Maharashtra's Pandharpur. pic.twitter.com/LtJfQNCZpz
— BRS Party (@BRSparty) June 27, 2023
ముందుగా ఆలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్ కు.. ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. ప్రధాన ద్వారం వద్దకు చేరుకోగానే పుష్ప గుచ్ఛాన్ని అందజేశారు. అనంతరం కాషాయ వస్త్రం కప్పారు. అలాగే శ్రీ విఠలేశ్వర స్వామి రుక్మిణీ అమ్మవార్లతో కూడిన చిత్రపటాన్ని సీఎం కేసీఆర్ కు బహుకరించారు. ఆ తర్వాత సీఎం అక్కడి నుంచి సర్కోలీ గ్రామానికి బయలుదేరారు.
స్వామి వారిని ప్రతిమను అందజేసిన వృద్ధ భక్తుడు
దర్శనానంతరం ఆలయ ఆవరణలో నడుచుకుంటూ వస్తుండగా... ఓ వృద్ధ భక్తుడు వచ్చి విఠలేశ్వరుడు, రుక్మిణీ అమ్మవార్లతో కూడిన ప్రతిమను బహుకరించారు. అందుకు సీఎం కేసీఆర్ చాలా సంతోషంగా ఫీలై.. వెంటనే ప్రతిమను స్వీకరించారు.