News
News
వీడియోలు ఆటలు
X

CM KCR: సివిల్స్ టాపర్స్‌కు సీఎం కేసీఆర్ అభినందనలు! ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్ష!

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్షల తుది ఫలితాల్లో రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు తమ సత్తా ప్రదర్శించారు.

FOLLOW US: 
Share:

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్షల తుది ఫలితాల్లో రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు తమ సత్తా ప్రదర్శించారు. తెలంగాణలోని నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు కూతురు ఉమా హారతి మూడో ర్యాంక్ సాధించారు. ఉత్తమ ర్యాంకులు సాధించి, సివిల్స్‌కు ఎంపికైన విద్యార్థులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్‌లో వారంతా మరిన్ని ఉన్నత స్థానాలకు ఎదగాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.

సివిల్స్‌లో మూడో ర్యాంక్ సాధించిన ఉమా హారతిని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అభినందించారు. ఉమా హారతి తండ్రి నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లుతో తనకు గల అనుబంధాన్ని సీవీ ఆనంద్ గుర్తు చేసుకున్నారు. తాను 1996-99 మధ్య నిజామాబాద్ జిల్లా ఎస్పీగా పని చేసినప్పుడు కామారెడ్డి ఎస్సైగా వెంకటేశ్వర్లు పని చేసేవారన్నారు. ఇప్పుడు నారాయణపేట ఎస్పీగా పని చేస్తున్న వెంకటేశ్వర్లు.. నక్సల్స్ సమస్యను ధైర్యంగా ఎదుర్కొన్నారన్నారు. ఉమా హారతి విజయం సాధించినందుకు ఆమె కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు.

Also Read: 
సివిల్ సర్వీసెస్ టాపర్‌గా ఇశితా కిశోర్, ఆమె గురించిన వివరాలు ఇలా!
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) మే 23న సివిల్ సర్వీసెస్ పరీక్ష (UPSC CSE 2022) తుది ఫలితాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలో యూపీకి చెందిన ఇషితా కిశోర్ అగ్రస్థానంలో నిలిచింది. అదే సమయంలో బిహార్‌కు చెందిన గరిమా లోహియా రెండో స్థానంలో నిలిచింది. ఇక తెలంగాణకు చెందిన ఎన్ ఉమా హారతి మూడో స్థానం కైవసం చేసుకుంది. యూపీకి చెందిన స్మృతి మిశ్రా నాలుగో స్థానంలో నిలవగా.. అసోంకి చెందిన మయూర్ హజారికా ఐదో స్థానం, కొట్టాయంకు చెందిన గెహనా నవ్య జేమ్స్ ఆరోస్థానం దక్కించుకున్నారు. 
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి..

సివిల్స్ 2022 ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు యువతీయువకులు వీరే, తెలంగాణ యువతికి మూడో ర్యాంకు
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన సివిల్స్ 2022 పరీక్షా ఫలితాలు నేడు (మే 23) విడుదల అయ్యాయి. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ వంటి అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం ఏటా యూపీఎస్సీ సివిల్స్‌ పరీక్షను నిర్వహించే సంగతి తెలిసిందే. 2022లో నిర్వహించిన పరీక్షలో మొత్తం 933 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. ఇందులో జనరల్‌ కోటాలో 345 మంది, ఈడబ్ల్యూఎస్‌ నుంచి 99, ఓబీసీ నుంచి 263, ఎస్సీ నుంచి 154, ఎస్టీ విభాగం నుంచి 72 మంది ఎంపిక అయ్యారు. ఈ సివిల్స్‌లో ఇషితా కిషోర్‌కు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. గరిమ లోహియా, ఉమా హారతి ఎన్‌., స్మృతి మిశ్రా తర్వాతి నాలుగు ర్యాంకుల్లో సత్తా చాటారు. వీరిలో మూడో ర్యాంకు పొందిన ఉమాహారతి తెలంగాణకు చెందిన వారు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి..

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ తుది ఫలితాలు విడుదల, తిరుపతికి చెందిన పవన్ కు 22వ ర్యాంక్
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ తుది ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ మే 23న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు ఫలితాలను చూసుకోవచ్చు. దేశవ్యాప్తంగా మొత్తం 933 మంది అభ్యర్థులు యూపీఎస్సీ ఎంపికచేసింది. కేటగిరీలవారీగా జనరల్-345, ఈడబ్ల్యూఎస్-99, ఓబీసీ-263, ఎస్సీ-154, ఎస్టీ-72 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఇక సర్వీసులవారీగా చూస్తే.. ఐఏఎస్‌కు 180 మంది, ఐఎఫ్‌ఎస్-38 మంది, ఐపీఎస్-200 మంది, సెంట్రల్ సర్వీసెస్-ఎ-473 మంది, గ్రూప్-బి సర్వీసులకు 131 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి..

Published at : 24 May 2023 07:11 AM (IST) Tags: Civil Services Toppers Civil Services 2023 Toppers Civils Telangana Topper UPSC Civil Services Final Result

సంబంధిత కథనాలు

Telangana politics  : కేసీఆర్ విమర్శించకపోవడమే అసలు కష్టం - బీజేపీ సమస్యకు పరిష్కారమేది ?

Telangana politics : కేసీఆర్ విమర్శించకపోవడమే అసలు కష్టం - బీజేపీ సమస్యకు పరిష్కారమేది ?

చాలా సింపుల్‌గా నిర్మలా సీతారామన్, పరకాల ప్రభాకర్‌ దంపతుల కుమార్తె వివాహం

చాలా సింపుల్‌గా నిర్మలా సీతారామన్, పరకాల ప్రభాకర్‌ దంపతుల కుమార్తె వివాహం

Weather Latest Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలకు ఛాన్స్! బిపర్‌జోయ్ తుపాను తీవ్రత ఎలా ఉందంటే?

Weather Latest Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలకు ఛాన్స్! బిపర్‌జోయ్ తుపాను తీవ్రత ఎలా ఉందంటే?

Medical Collages: 50 కొత్త మెడికల్ కాలేజీలకు కేంద్రం ఆమోదం - ఏపీ, తెలంగాణకు ఎన్నంటే

Medical Collages: 50 కొత్త మెడికల్ కాలేజీలకు కేంద్రం ఆమోదం - ఏపీ, తెలంగాణకు ఎన్నంటే

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం

టాప్ స్టోరీస్

CM Jagan Gudivada Tour: సీఎం జగన్‌ గుడివాడ పర్యటన వాయిదా, ఇక టిడ్కో ఇళ్లు ప్రారంభం 16న!

CM Jagan Gudivada Tour: సీఎం జగన్‌ గుడివాడ పర్యటన వాయిదా, ఇక టిడ్కో ఇళ్లు ప్రారంభం 16న!

IND vs AUS Final: ఫాలోఆన్ ప్రమాదంలో టీమిండియా, ఫైనల్లో ఐపీఎల్ సింహాలకు చావుదెబ్బ

IND vs AUS Final: ఫాలోఆన్ ప్రమాదంలో టీమిండియా, ఫైనల్లో ఐపీఎల్ సింహాలకు చావుదెబ్బ

RBI Governor Shaktikanta Das : లక్షా 80వేల కోట్ల రూపాయల విలువైన 2వేలనోట్లు ఉహసంహరణ | ABP Desam

RBI Governor Shaktikanta Das : లక్షా 80వేల కోట్ల రూపాయల విలువైన 2వేలనోట్లు ఉహసంహరణ | ABP Desam

Nabha Natesh: సమ్మర్.. అంటూ నభా ఫోటో షూట్ అదుర్స్

Nabha Natesh: సమ్మర్.. అంటూ నభా ఫోటో షూట్ అదుర్స్